ZP Chairman Elections: రేపే ముహూర్తం – అక్కడక్కడా చెరో రెండున్నరేళ్లు..! 8 జిల్లాల్లో ఏకం.. 5 జిల్లాల్లో బింకం..!

YS Jagan: Jagan in U Turn Some times
Share

ZP Chairman Elections: పరిషత్ ఎన్నికల్లో ఈజీగా గెలుపొందిన వైసీపీ ఆ మేరకు అధ్యక్ష జాబితాని రూపొందించింది.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తుంది.. 151 సీట్లు, 156 లక్షల ఓట్లు గెలుచుకుని సీఎం పీఠమెక్కిన సీఎం జగన్ సొంత పార్టీలో చాలా మందికి పదవీ హామీలిచ్చారు. 2019 ఎన్నికలకు ముందే తన పార్టీలో చేరిన సందర్భంగా చాలా మందికి ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు, పరిషత్ పదవుల ఆశలు కల్పించారు. ఇప్పటికే వైసీపీలో పేరున్న (ఎమ్మెల్యే ఆ పై స్థాయి) దాదాపు పాతిక మంది నేతలకు కీలక పదవులను ఇవ్వాల్సి ఉంది. ఆ హామీలు నెరవేర్చే క్రమంలో ఈ జిల్లా పరిషత్ ఎన్నికలు కొంత మేరకు మేలు చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవులకు తమ పార్టీ అభ్యర్థుల జాబితాను వైకాపా దాదాపు ఖరారు చేసింది. రేపు జిల్లా పరిషత్మ్ మండల పరిషత్ స్థానాలకు అధ్యక్షా ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో జడ్పీ ఛైర్మన్‌ అభ్యర్థులపై కసరత్తు చేసింది. కొన్ని జిల్లాలకు మినహా మిగిలిన వాటికి పేర్లు ఖరారైనట్లే తెలుస్తుంది.
జిల్లాల్లో నెలకొన్న బేధాభిప్రాయాలపై సీఎం జగన్ ఇప్పటికే ఆయా జిల్లాల మంత్రులు, ఇంచార్జిలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏకాభిప్రాయాలు లేకుంటే తను చెప్పిన పేర్లు ఫైనల్ చేయాలని ఆదేశించారు.

ZP Chairman Elections: YS Jagan Serious Warning to Ministers
ZP Chairman Elections: YS Jagan Serious Warning to Ministers

ZP Chairman Elections: 8 జిల్లాలో ఏకాభిప్రాయం..!!

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పరిషత్ స్థానాలు వైసీపీకి దక్కాయి. కనీసం ప్రతిపక్షం కూడా లేదు. ఐదేళ్లు ఈ పార్టీ సభ్యులదే రాజ్యం. మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన తర్వాత బహుశా ఇలా ప్రతిపక్షం లేకుండా ఏకపక్ష ఫలితాలు రావడం ఇదే తొలిసారి. 2014 లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 70 శాతం స్థానాలను గెలుచుకుంది. కానీ ఈ ఎన్నికల్లో టీడీపీ కనీసం 10 శాతం కూడా సత్తా చాటలేదు. ఎన్నికలను ఆ పార్టీ బహిష్కరించడం, తగిన వనరులు లేకపోవడం, నాయకత్వం సిద్ధంగా లేకపోవడమే ప్రధాన కారణాలు.. రేపు జిల్లా పరిషత్, మండల పరిషత్ అధ్యక్షా ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో జెడ్పి అధ్యక్షా పీఠంపై ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తుంది. విజయనగరం – మజ్జి శ్రీనివాసరావు.., విశాఖపట్నం – శివరత్నం.., గుంటూరు – క్రిస్టినా.., ప్రకాశం – బూచేపల్లి వెంకాయమ్మ.., పశ్చిమగోదావరి – కవురు శ్రీనివాస్‌.., కృష్ణా – ఉప్పాళ్ల హారిక.., కడప – ఆకేపాటి అమర్నాథరెడ్డి.., నెల్లూరు – ఆనం అరుణమ్మ తదితరులు ఖరారయ్యారు. మిగిలిన అయిదు జిల్లాల్లో ఏకాభిప్రాయం రాకపోవడంతో చెరో రెండున్నరేళ్లు ఇచ్చేలా అనుకుంటున్నారు.

ZP Chairman Elections: YS Jagan Serious Warning to Ministers
ZP Chairman Elections: YS Jagan Serious Warning to Ministers

* చిత్తూరులో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవికి వి.కోట జడ్పీటీసీగా పోటీ చేసిన శ్రీనివాసులు పేరు దాదాపు ఖరారు అయింది. కాకపోతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గానికి చెందిన కీలక నాయకుడు కూడా ఆశిస్తున్నారు. తూర్పుగోదావరిలో ఛైర్మన్‌ పదవికి విప్పర్తి వేణుగోపాల్‌ పేరు ప్రచారంలో ఉంది. అనంతపురంలో ఆత్మకూరు జడ్పీటీసీగా పోటీ చేసిన గిరిజ పేరు ప్రధానంగా ఉంది. అయితే జక్కల ఆదిశేషు భార్య కదిరి నుంచి, ప్రవీణ్‌ యాదవ్‌ భార్య గుత్తి నుంచి పోటీ చేశారు. వీరిద్దరిపేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. చెరో రెండున్నరేళ్లు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కర్నూలులో ఎర్రబోతుల వెంకటరెడ్డిని గతంలోనే ఖరారు చేశారు. వెంకటరెడ్డి మృతి చెందడంతో ఆయన కుమారుడు ఉదయ్‌కుమార్‌రెడ్డికి అవకాశం కల్పించాలని వైకాపా అధినాయకత్వం నిర్ణయించింది. అయితే ఆయన ఆయన జడ్పీటీసీగా ఎన్నిక కావాల్సి ఉంది. అందువల్ల తాత్కాలికంగా వేరే వారికి బాధ్యతలు అప్పగించి, ఎన్నికలయ్యాక ఉదయ్‌ కుమార్ రెడ్డికే అవకాశం ఇస్తారని వైకాపా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లాలో భిన్నమైన రాజకీయం నెలకొంది. మంత్రి ధర్మాన కృష్ణదాస్ వర్గం నుండి ఒకరు, స్పీకర్ తమ్మినేని సీతారాం వర్గం నుండి ఒకరు ఆశిస్తున్నారు. గతంలో ఒక మహిళ పేరు తెరపైకి వచ్చినప్పటికీ ఇటీవల కార్పొరేషన్ల పదవుల్లో ఆమెకు డైరెక్టర్‌గా అవకాశమిచ్చారు. ఇద్దరు మహిళల పేర్లు జిల్లాలో ప్రచారంలో ఉన్నా… ఎలాంటి ధ్రువీకరణ రాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ జిల్లాలో ఇద్దరికీ చెరో రెండున్నరేళ్లు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.


Share

Related posts

బ్రేకింగ్ : ఏపీ బిజెపి చీఫ్ గా సోము వీర్రాజు

arun kanna

ఏపి అసెంబ్లీలో కీలక బిల్లులు అమోదం..! టీడీపీ వాకౌట్‌లు.!!

somaraju sharma

Pawan Kalyan : వైసిపి ఎమ్మెల్యేకు జనసేనాని కౌంటర్ మామూలుగా లేదుగా! పశ్చిమగోదావరి జిల్లాలో కొత్త వివాదం!

Yandamuri