మెగాస్టార్ ఆచార్యలో మరో స్టార్ హీరోయిన్!

another star heroine in chiranjeevi acharya
Share

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా పరిస్థితులతో ఈ సినిమా షూటింగ్ కూడా నిలిచిపోయింది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆయనకు హీరోయిన్ పలువురు పేర్లు కూడా వినిపించాయి. ఇప్పుడు లేటెస్ట్ గా మరో న్యూస్ ఫిలింనగర్ సర్కిల్స్ లో రౌండ్ అవుతోంది.

another star heroine in chiranjeevi acharya
another star heroine in chiranjeevi acharya

 

ఈ క్యారెక్టర్ ను హీరోయిన్ సాయి పల్లవి చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈపాత్ర గురించి ఆమెను సంప్రదించారని కూడా అంటున్నారు. సినిమాలో చరణ్ కు జోడీగా ఆమె నక్సలైట్ పాత్ర పోషించబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం సాయి పల్లవి సురేశ్ ప్రొడక్షన్స్ లో రానా హీరోగా నటిస్తున్న విరాటపర్వం సినిమాలో కూడా నక్సలైట్ గానే నటిస్తోంది. ఇటివలే ఆమె లుక్ కూడా రివీల్ చేశారు. దీంతో సాయిపల్లవి ఆచార్యలో నటిస్తుందనే వార్తలపై టీమ్ నుంచి అఫిషియల్ న్యూస్ రివీల్ కావాల్సి ఉంది.

 

ఆచార్యకు కరోనా కాకుండా మొదటి నుంచి సమస్యలు వస్తూనే ఉన్నాయి. హీరోయిన్ విషయంలో త్రిష అని వార్తలు వచ్చినా టీమ్ కన్ఫర్మ్ చేయలేదు. మొత్తానికి తాను తప్పుకుంటున్నట్టు త్రిష చెప్పేసింది. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రోల్ లో మహేశ్ అన్నారు. కానీ.. రామ్ చరణ్ చేస్తాడని వార్తలు వచ్చాయి. ఇలాంటి కన్ఫ్యూజన్స్ మధ్యలో ఇప్పుడు సాయి పల్లవి పేరు వచ్చింది. ఈ పాత్ర కోసం అలియా భట్ పేరు వినిపించినా అందులో వాస్తవం లేదు.

 


Share

Related posts

Anupama Parameswaran Cute Pictures

Gallery Desk

మెగాస్టార్ చిరంజీవి తో మరో సినిమా చేయబోతున్న నయనతార..?

GRK

పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ ఆ తోపు డైరెక్టర్ ని ఎందుకు పక్కన పెడుతున్నారు… ??

sekhar