NewsOrbit
Pro Kabaddi 2022

Pro Kabaddi 2022: సిద్ధార్థ్ దేశాయ్ బాహుబలి కాదు తెలుగు టైటాన్స్‌ని ముంచే కట్టప్ప.. అతన్ని కొనడం వేస్ట్..?

Pro Kabaddi 2022 : ప్రస్తుతం వివో ప్రో కబడ్డీ లీగ్ 2022 కొనసాగుతోంది. ఈ 9వ సీజన్‌లో కూడా తెలుగు టైటాన్స్ పేలవమైన ప్రదర్శనతో అందర్నీ నిరాశ పరుస్తోంది. పోయిన సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఒక్క మ్యాచ్ గెలవడానికి ఆపసోపాలు పడింది. ఇప్పుడు కూడా ఈ టీమ్ చాలా చెత్తగా ఆడుతోంది. ఈ ఆదివారం నాడు తెలుగు టైటాన్స్, బెంగాల్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరుగగా 20 పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్ చిత్తుగా ఓడింది. అభిషేక్ సింగ్, సుర్జిత్ సింగ్, ప్రవేశ్ భైన్‌వాల్, వినయ్, రజనీష్, రవీందర్ పహల్, విశాల్ భరద్వాజ్ ఈ మ్యాచ్‌లో ఆడారు. కానీ ఒక్కరు కూడా రాణించలేకపోయారు. బాహుబలిగా పిలుచుకునే సిద్ధార్థ్ దేశాయ్‌ కమ్‌బ్యాక్ ఇస్తాడేమో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు కానీ అతను కూడా నిరాశపరిచాడు.

Telugu Titans won over Patna Pirates on Tuesday October 11. But this victory belongs to excellent defense support from the team and clinical raids from Monu Goya.

Pro Kabaddi 2022 : సిద్ధార్థ్ ని కొనడం వేస్ట్

How would Siddharth Desai fit in the new Telugu Titans team in Pro Kabaddi Season 9?
How would Siddharth Desai fit in the new Telugu Titans team in Pro Kabaddi 2022 Season 9

గత సీజన్‌లో తెలుగు టైటాన్స్ యాజమాన్యం సిద్ధార్థ్ దేశాయ్‌ని రూ.1.30 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. కాగా ఆ సీజన్ 8లో సిద్ధార్థ్ గాయం కారణంగా కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. మూడు మ్యాచ్‌లలో 49 రైయిడ్స్‌లో 35 రైయిడ్ పాయింట్స్ తెచ్చాడు. రెండు సూపర్ టెన్స్ చేశాడు. తెలుగు టైటాన్స్ ఎఫ్‌బీఎం కార్డు ఉపయోగించి ఈసారి ఈ గాయపడ్డ ప్లేయర్‌ను రూ.20 లక్షలకు రిటైన్ చేసుకుంది. అయితే ఇప్పటి వరకు ఆ స్టార్ ప్లేయర్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే తేగలిగాడు. చాలా ఎత్తు ఉండటం వల్ల 85 కిలోల కంటే బరువు తగ్గడానికి చాలా కష్టంగా మారిందని.. అది తన రైడింగ్‌ను ప్రభావితం చేసిందని ఈ ప్లేయర్ ఈ మ్యాచ్ తర్వాత చెప్పుకొచ్చాడు. అయితే ఫ్యాన్స్ మాత్రం అతన్ని కొనుగోలు చేయడం తెలుగు టైటాన్స్ టీమ్‌కి పెద్ద మైనస్ అని పెదవి విరుస్తున్నారు.

Pro Kabaddi 2022: వారు కూడా వేస్టే

Siddharth Desai Performance in Pro Kabaddi Season 9
Is investing in Siddharth Desai a wrong decision for Telugu Titans

ఈసారి తెలుగు టైటాన్స్ స్టార్ డిఫెండర్ రవీందర్ పహల్‌ను రూ.23 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ స్టార్ డిఫెండర్ కూడా టాకిల్ చేయాలా వద్దా అన్నట్లు ఆడతాడు. ఇక రజనీష్ పరమ చెత్త పర్ఫామెన్స్ ఇస్తాడు. చాలా రైయిడ్స్‌ చేసినా ఎక్కువ పాయింట్ తేలేడు. పాయింట్స్‌ పోగొట్టుకోవడం తప్ప అతనికి పాయింట్స్ తీసుకురావడమే తెలీదన్నట్లు చాలా చిరాకు తెప్పిస్తుంటాడు. మిగతా వారు కూడా అలానే ఉన్నారు. కాగా ఈరోజు 8:30కి తెలుగు టైటాన్స్, పట్న పైరేట్స్ ఆడుతున్నారు. ఈ మ్యాచ్ అయినా తెలుగు టీమ్‌ గెలుస్తుందా అనేది సందేహమే!

Telugu Titans team in Pro Kabaddi 2022 Season 9:

  1. Monu Goyat- Raider
  2. Ankit Beniwal- Raider
  3. Rajnish- Raider
  4. Abhishek Singh- Raider
  5. Siddharth Desai- Raider
  6. Vinay- Raider
  7. Ravinder Pahal- RaiderDefender – Right Corner
  8. Surjeet Singh- Defender – Right Cover
  9. Vishal Bhardwaj- Defender
  10. Parvesh Bhainswal- Defender – Left Cover
  11. Vijay Kumar- Defender – Right Corner

Check out full players list along with detail profile and past performances on the official website of vivo Pro Kabaddi 2022 Season 9

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Pro Kabaddi 2023: ఉండేది ఎవరు వెళ్ళేది ఎవరు…కోట్లు పలికిన కబడ్డీ ఆటగాళ్లు ఎవరు? ఐపీల్ ప్రో కోబడి 2023 ఆక్షన్ ప్రత్యేకం!

siddhu