ట్విట్టర్ ని షేక్ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్…

01 Mar, 2020 - 04:04 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేనాని పవన్ కళ్యాణ్… ఈ రెండు పేర్ల మధ్య ఒక చిన్న అడ్డగీత ఉంది. గీత ఇటు వైపు అఖండమైన అభిమాన సందోహం ఉంది, అదే గీతకి అటు వైపు ప్రజల కోసం పోరాడే అలుపెరగని గుండె ధైర్యం ఉంది. అయితే కొన్ని రోజులు కేవలం రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కళ్యాణ్ సినిమాలకి దూరం అయ్యాడు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఈ రెండింటిని బాలన్స్ చేస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారుతున్నాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాని తెలుగులో పవన్ రీమేక్ చేస్తున్నాడు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కోసం పవన్ అభిమానులే కాకా ఇండస్ట్రీ వర్గాలు కూడా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాయి. పవన్ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ సోషల్ మీడియాని కూడా షేక్ చేసిన రోజులు ఉన్నాయి. వారి కలని నిజం చేస్తూ PSPK26 అప్డేట్ బయటకి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 26వ సినిమా ఫస్ట్ లుక్ ని మార్చ్ 2న 5గంటలకి రిలీజ్ చేయనున్నారు. ఈ అనౌన్స్మెంట్ బయటకి రాగానే ట్విట్టర్ షేక్ అయ్యింది. ఎక్కడ చూసినా PSPK ట్రెండ్ మాత్రమే నడుస్తుంది. ఒక అనౌన్స్మెంట్ కే ఈ రేంజ్ హల్చల్ ఉంటే, ఫస్ట్ లుక్ బయటకి వచ్చాక ఇంకెలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం అంటూ పవన్ ఫ్యాన్స్ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. థమన్ కూడా ఈ అనౌన్స్మెంట్ గురించి చెప్తూ ఇది వీక్ ఆఫ్ ది డికేడ్ అన్నాడు అంటే పవన్ సినిమా కోసం అందరు ఎంతగా వెయిట్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.