రాజశేఖర్ మరో హిట్ అందుకునేలా ఉన్నాడే

26 Feb, 2020 - 07:03 PM

డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం అర్జున. అందాల భామ మరియం జకారియా కథానాయికగా నటించింది. కన్మణి దర్శకత్వం వహించారు. నట్టిస్ ఎంటర్ టైన్మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై నట్టి కరుణ, నట్టి క్రాంతి అందిస్తున్న ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం ఈ చిత్రం ట్రైలర్ ను హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నట్టికుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ, మార్చి 6న ప్రపంచవ్యాప్తంగా భారీఎత్తున 800 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు.