రామ్ డబుల్ కిక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు

28 Feb, 2020 - 07:16 PM

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ #RED. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న #REDTheFilm మూవీ టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. తమిళ రీమేక్ సినిమానే అయినా #REDలో రామ్ మార్క్ క్లియర్ గా కనిపిస్తుంది. టీజర్ మొత్తంలో రామ్ చూపించిన 2 వేరియేషన్స్, అతని లుక్ చేంజ్ చేసిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. రగ్గడ్ లుక్ లో రామ్ పోతినేనిని చూస్తుంటే, ఇస్మార్ట్ శంకర్ ని మరిపించి, దాన్ని మించిన హిట్ ఇచ్చేలా ఉన్నాడు.

#RED టీజర్ లో వచ్చిన మ్యూజిక్ అండ్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మణిశర్మ మ్యూజిక్ మిగిలిన ఎలిమెంట్స్ అన్నింటికన్నా ది బెస్ట్ గా ఉంది. మణిశర్మ, ఇస్మార్ట్ శంకర్ తర్వాత మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేశాడు. రామ్ సొంత బ్యానర్, ప్రొడక్షన్ ఖర్చుకి ఎక్కడ వెనకాడలేదు… మేకింగ్ చాలా రిచ్ గా ఉంది, కాసేపే కనిపించిన నివేద పేతురేజ్ పోలీస్ లుక్ లో కనిపించి మెప్పించింది. సింపుల్ గా చెప్పాలి అంటే ఇస్మార్ట్ శంకర్ సినిమాలో డబుల్ దిమాక్ ఉంది ఇదర్ అనే డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ విజువల్ ఉంటే అది #RED టీజర్ లా ఉంటుంది. హీరో, విలన్ ఒక్కడే కాబట్టి రామ్ పోతినేని… అలియాస్ #RAPO 2.0 #RED సినిమాలో వన్ మాన్ షో చేయడం గ్యారెంటీ.