NewsOrbit
రివ్యూలు

`చిత్ర‌ల‌హ‌రి` రివ్యూ

చిత్రం:  చిత్ర‌ల‌హ‌రి
నిర్మాణ సంస్థ‌:  మైత్రీ మూవీ మేక‌ర్స్‌
న‌టీన‌టులు:  సాయితేజ్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్‌, సునీల్‌, వెన్నెల‌కిశోర్‌, బ్ర‌హ్మాజీ, భ‌ర‌త్ రెడ్డి, పోసాని కృష్ణ‌ముర‌ళి, జ‌య‌ప్ర‌కాష్ త‌దిత‌రులు
సంగీతం:  దేవిశ్రీ ప్ర‌సాద్‌
కెమెరా:  కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని
ఎడిటింగ్‌: శ‌్రీక‌ర్ ప్ర‌సాద్‌
ఆర్ట్‌:  ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌
నిర్మాత‌లు:  న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.విఎం(మోహ‌న్‌)
ద‌ర్శ‌క‌త్వం:  కిశోర్ తిరుమ‌ల‌
విజ‌యానికి ద‌గ్గ‌ర దారులుంటాయా? ఉండ‌వు.. క‌ష్ట‌ప‌డ‌ట‌మే మార్గం. అయితే ప్ర‌య‌త్నంలో విఫ‌ల‌మైతే ఏం చేయాలి?  ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం తెలియ‌కో.. తెలిసి ఓపిక లేక‌నో.. మ‌రేదైనా కార‌ణాల చేత‌నో కొంద‌రు వారి ల‌క్ష్యాల‌ను ప‌క్క‌న పెట్టేసి వెళ్లిపోతూ ఉంటారు. అయితే ప్ర‌య్న‌తమే ఓ విజ‌యం.. ఓటమి ఎదురైన ప్ర‌తిసారి ఏదో ఒక కొత్త విష‌యాన్ని నేర్చుకుని ముందుకు వెళ్లాల్సిందే.. అనే సందేశాన్ని చెప్పడానికి ద‌ర్శ‌కుడు కిశోర్ తిరుమ‌ల చేసిన ప్ర‌య‌త్న‌మే `చిత్ర‌ల‌హ‌రి`. ఓ ఇన్‌స్పైరింగ్ పాయింట్‌కు ద‌ర్శ‌కుడు కాస్త ప్రేమ‌క‌థ‌ను, కామెడీని జోడించి తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు. ఆరు వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఉన్న హీరో సాయిధర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌డం ఒక‌టైతే.. ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ ప్లాప్ త‌ర్వాత కిశోర్ తిరుమ‌ల‌కు కూడా హిట్ అవ‌స‌రం. స‌క్సెస్‌ అవ‌స‌రం అయిన ఓ హీరో.. ద‌ర్శ‌కుడు చేసిన `చిత్ర‌ల‌హ‌రి`. మ‌రి హీరో, ద‌ర్శకుడికి స‌క్సెస్ దక్కిందా?  లేదా?  అనే విష‌యాన్ని తెలుసుకోవాలంటే ముందుగా క‌థేంటో చూద్దాం…

క‌థ‌:
విజ‌య్ కృష్ణ‌(సాయి తేజ్‌) ఎల‌క్ట్రానికి ఇంజ‌నీర్‌. కారు ప్ర‌మాదాల్లో ప్రాణాలు కోల్పోయే వారిని కాపాడ‌టం కోసం ఓ యాప్‌ను క‌నిపెడ‌తాడు. అయితే ఆ ప్రాజెక్ట్‌ని ఎవ‌రూ స్పాన్స‌ర్ చేయ‌రు. ఏ కంపెనీకెళ్లినా దుర‌దృష్టం వెంటాడుతుంటుంది. త‌న బాధ‌ల‌ను మ‌ర‌చిపోవ‌డానిక‌ని మందుకు అల‌వాటు ప‌డ‌తాడు విజ‌య్ . ఓ సంద‌ర్భంలో ల‌హ‌రి(క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమె కోసం ఫ్రెంచ్ క్లాసుల‌కు వెళ్లడం.. ఆమెను ఫాలో అవడం ఇలా త‌న‌దైన స్లైల్లో ఎలాగో అలా.. ఆమె ప్రేమ‌ను సొంతం చేసుకుంటాడు. సాధార‌ణంగా కీల‌క నిర్ణ‌యాల‌కు ఎవ‌రో ఒక‌రిపై ఆధార‌ప‌డే ల‌హ‌రి.. ఎవ‌రినీ సంప్ర‌దించ‌కుండా విజ‌య్‌ను ప్రేమిస్తుంది. ల‌హ‌రికి మందు తాగేవాళ్లంటే ప‌డ‌ద‌ని తెలుసుకున్న విజ‌య్‌, ఆమెకు తాను  మందు తాగుతాన‌ని అబ‌ద్ధం చెప్పి అస‌లు విష‌యాన్ని దాచేస్తాడు. అయితే ల‌హ‌రి స్నేహితురాలు స్వేచ్ఛ‌(నివేదా పేతురాజ్‌) కార‌ణంగా.. విజ‌య్ బార్‌లో మందు తాగుతూ రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ‌టంతో, ల‌హ‌రి, విజ‌య్‌కి బ్రేక‌ప్ అవుతుంది.  అయితే విజ‌య్ త‌న స్నేహితురాలు ల‌హ‌రి ప్రేమికుడ‌నే సంగ‌తి  స్వేచ్ఛ‌కు కూడా తెలియ‌దు. త‌న ప్ర‌య‌త్నాల్లో భాగంగా  విజ‌య్ త‌న యాప్ స్పాన్స‌ర్ షిప్ కోసం స్వేచ్ఛ ప‌నిచేసే కంపెనీకే వెళ‌తాడు.  విజ‌య్ ఐడియా స్వేచ్ఛ‌కు న‌చ్చుతుంది. దాంతో ముంబై హెడ్ ఆఫీస్‌కి విజ‌య్‌ని తీసుకెళుతుంది స్వేచ్ఛ‌. అప్ప‌టికే విజ‌య్ న‌చ్చ‌కుండా ముంబై వ‌చ్చేసిన‌ ల‌హ‌రి మ‌ళ్లీ ముంబైలో ప్రాజెక్ట్ కోసం వ‌చ్చిన అత‌నికే తార‌స‌ప‌డుతుంది.  మ‌రో వైపు ,  అప్ప‌టి వ‌ర‌కు మ‌గాళ్లంటే చెడు అభిప్రాయాన్ని క‌లిగి ఉండే స్వేచ్ఛ‌.. విజ‌య్ చెప్పే మాట‌ల‌తో మారుతూ ..మ‌గాళ్ల‌పై సానుకూల దృక్ప‌థాన్ని ఏర్ప‌రుచుకుంటూ ఉంటుంది. అదే క్ర‌మంలో ల‌హ‌రి బ్రేక‌ప్ విష‌యంలో కూడా తాను త‌ప్పు చేశానేమో అనే ఫీలింగ్‌తో ఉంటుంది. ఈలోపు ముంబైలో కూడా కొన్ని కార‌ణాల‌తో విజ‌య్ ప్రాజెక్ట్ రిజెక్ట్ అవుతుంది. అప్పుడు విజ‌య్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడు?  విజ‌య్ నిర్ణ‌యం వ‌ల్ల క‌థ ఎలాంటి మ‌లుపు తీసుకుంటుంది?   విజ‌య్‌, ల‌హ‌రి క‌లుసుకుంటారా?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
విశ్లేష‌ణ‌:
ముందు న‌టీన‌టుల ప‌రంగా చూస్తే.. హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఆరు ప్లాపుల త‌ర్వాత చేసిన చిత్ర‌మిది. చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. స‌క్సెస్‌ఫుల్ బ్యాన‌ర్ మైత్రీ మూవీ మేక‌ర్స్ సినిమాను నిర్మించ‌డంతో పాటు ఎమోష‌న‌ల్ సీన్స్‌ను చ‌క్క‌గా తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు కిశోర్ తిరుమ‌ల‌పై న‌మ్మ‌కం. క‌థ‌పై ఉన్న న‌మ్మ‌కంతో లుక్ విష‌యంలో,  శ‌రీరాకృతిని మార్చుకునే విష‌యంలో ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. సినిమాలో హీరోయిజం ఎక్క‌డా లేని విజ‌య్ కృష్ణ అనే పాత్ర‌ను చేయ‌డానికి సిద్ధ‌మైయ్యాడు తేజ్‌. పాత్ర‌లో ఒదిగిపోయాడు. గత చిత్రాల కంటే న‌ట‌న ప‌రంగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు. సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్‌లో ల‌హ‌రి పాత్ర‌లో న‌టించిన క‌ల్యాణి ప్రియ‌దర్శ‌న్‌కు, హీరోకు మ‌ధ్య బ‌ల‌మైన ల‌వ్ సీన్స్ క‌న‌ప‌డ‌వు. ఎక్క‌డా రొమాంటిక్ సాంగ్స ఉండ‌వు. సంద‌ర్భానుసారం వ‌చ్చే ప్రేమ వెన్నెల సాంగ్‌లో న‌టించింది. ఈ పాత్ర‌కు పెర్ఫామెన్స్ ప‌రంగా పెద్ద స్కోప్ లేదు. ఇక నివేదా పేతురాజ్ పాత్ర కూడా దాదాపు ఇలాంటిదే.. మ‌గాళ్లంటే త‌ప్పుడు అభిప్రాయాన్ని ఏర్ప‌రుచుకున్న పాత్ర త‌న‌ది. న‌ట‌న ప‌రంగా ఈ పాత్ర‌కు కూడా పెద్ద స్కోప్ లేదు. సునీల్ ఫ‌స్టాఫ్‌లో క‌న‌ప‌డే తాగుబోతు పాత్ర‌లో న‌టించాడు. కాస్తో కూస్తో న‌వ్వించే ప్ర‌య‌త్న‌మైతే చేశాడు. ఇక సెకండాఫ్‌లో వ‌చ్చే త‌మిళియ‌న్ పాత్ర‌లోవెన్నెల‌కిశోర్ పాత్ర ఆక‌ట్టుకుంటుంది. వెన్నెల‌కిశోర్ త‌న‌దైన కామెడీ ఆక‌ట్టుకున్నాడు. ఇక బ్ర‌హ్మాజీ, జ‌య‌ప్ర‌కాష్‌, భ‌ర‌త్ రెడ్డి .. మిగిలిన పాత్ర‌ల‌న్నీ వాటి వాటి ప‌రిధుల మేర చ‌క్క‌గా న‌టించారు. విశ్లేష‌ణ‌:
ముందు న‌టీన‌టుల ప‌రంగా చూస్తే.. హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఆరు ప్లాపుల త‌ర్వాత చేసిన చిత్ర‌మిది. చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. స‌క్సెస్‌ఫుల్ బ్యాన‌ర్ మైత్రీ మూవీ మేక‌ర్స్ సినిమాను నిర్మించ‌డంతో పాటు ఎమోష‌న‌ల్ సీన్స్‌ను చ‌క్క‌గా తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు కిశోర్ తిరుమ‌ల‌పై న‌మ్మ‌కం. క‌థ‌పై ఉన్న న‌మ్మ‌కంతో లుక్ విష‌యంలో,  శ‌రీరాకృతిని మార్చుకునే విష‌యంలో ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. సినిమాలో హీరోయిజం ఎక్క‌డా లేని విజ‌య్ కృష్ణ అనే పాత్ర‌ను చేయ‌డానికి సిద్ధ‌మైయ్యాడు తేజ్‌. పాత్ర‌లో ఒదిగిపోయాడు. గత చిత్రాల కంటే న‌ట‌న ప‌రంగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు. సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్‌లో ల‌హ‌రి పాత్ర‌లో న‌టించిన క‌ల్యాణి ప్రియ‌దర్శ‌న్‌కు, హీరోకు మ‌ధ్య బ‌ల‌మైన ల‌వ్ సీన్స్ క‌న‌ప‌డ‌వు. ఎక్క‌డా రొమాంటిక్ సాంగ్స ఉండ‌వు. సంద‌ర్భానుసారం వ‌చ్చే ప్రేమ వెన్నెల సాంగ్‌లో న‌టించింది. ఈ పాత్ర‌కు పెర్ఫామెన్స్ ప‌రంగా పెద్ద స్కోప్ లేదు. ఇక నివేదా పేతురాజ్ పాత్ర కూడా దాదాపు ఇలాంటిదే.. మ‌గాళ్లంటే త‌ప్పుడు అభిప్రాయాన్ని ఏర్ప‌రుచుకున్న పాత్ర త‌న‌ది. న‌ట‌న ప‌రంగా ఈ పాత్ర‌కు కూడా పెద్ద స్కోప్ లేదు. సునీల్ ఫ‌స్టాఫ్‌లో క‌న‌ప‌డే తాగుబోతు పాత్ర‌లో న‌టించాడు. కాస్తో కూస్తో న‌వ్వించే ప్ర‌య‌త్న‌మైతే చేశాడు. ఇక సెకండాఫ్‌లో వ‌చ్చే త‌మిళియ‌న్ పాత్ర‌లోవెన్నెల‌కిశోర్ పాత్ర ఆక‌ట్టుకుంటుంది. వెన్నెల‌కిశోర్ త‌న‌దైన కామెడీ ఆక‌ట్టుకున్నాడు. ఇక బ్ర‌హ్మాజీ, జ‌య‌ప్ర‌కాష్‌, భ‌ర‌త్ రెడ్డి .. మిగిలిన పాత్ర‌ల‌న్నీ వాటి వాటి ప‌రిధుల మేర చ‌క్క‌గా న‌టించారు.
సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే.. ప్రయ‌త్నమే గొప్ప విజయం ఓట‌మి ఎదురైతే ఆగొద్దు అనే పాయింట్‌ను చెప్ప‌డానికి కిశోర్ తిరుమ‌ల చేసే ప్ర‌య‌త్నంలో ఓ అన్ ల‌క్కీ హీరోను చూపించాడు. అయితే స‌న్నివేశాల్లో అస‌లు హీరో అన్ ల‌క్కీ ఎందుక‌నే దాన్ని ఎక్క‌డా ఎస్టాబ్లిష్ చేయ‌లేదు. అలాగే హీరో తాను దుర‌దృష్ట‌వంతుడ‌న‌ని చెప్పుకునేలా మాట‌లే చెప్పారు కానీ.. వాటి అనుగుణంగా హీరో పాత్ర‌పై సింప‌తీని క్రియేట్ చేసే బ‌ల‌మైన స‌న్నివేశాలు ఎమోష‌న్స్ లేవు. బేసిగ్గా ర‌చ‌యిత అయిన కిశోర్ మ‌రోసారి త‌న పెన్ ప‌వ‌ర్‌ను చూపించాడు. స‌న్నివేశాల‌కు ముఖ్యంగా తండ్రి పోసాని హీరో మ‌ధ్య‌, సాయితేజ్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ బ్రేక‌ప్ సీన్స్ ల్లో బల‌మైన డైలాగ్స్ ప‌డ్డాయి. వీటికి ప్రేక్ష‌కుడు క‌చ్చితంగా క‌నెక్ట్ అవుతాడు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్ మంచి పాట‌ల‌ను అందించాడు. అన్నీ సంద‌ర్భానుసారం వ‌చ్చే పాట‌లే కావ‌డంతో క‌థ‌లో భాగంగానే ఇమిడిపోవ‌డంతో ఆక‌ట్టుకుంటాయి. నేప‌థ్య సంగీతం చాలా బావుంది. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు రిచ్‌నెస్‌ను తీసుకొచ్చింది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.
చివ‌ర‌గా.. చిత్ర‌ల‌హ‌రి.. సందేశం ఉంది.. అయితే డైలాగ్స్‌లో ఉన్న ప‌ట్టు స‌న్నివేశాల్లోని ఎమోష‌న్స్‌లో క‌న‌ప‌డ‌వు
రేటింగ్‌: 2.75/5
author avatar
Siva Prasad

Related posts

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar

Leave a Comment