ప్రేమజంట రివ్యూ
నటీనటులు : రామ్ ప్రణీత్ , సుమయ, షఫీ , స్వాతి నాయుడు , రాజా రవీంద్ర , ఉత్తేజ్ తదితరులు
సంగీతం : నిఖిలేష్
నిర్మాత : మహేష్ మొగులూరి
దర్శకత్వం : నిఖిలేశ్ తోగరి
రేటింగ్: 3/5
పరువు హత్యలు అనే పాయింట్ ఆధారంగా పలు చిత్రాలు రూపొందాయి. అలాంటి నేపథ్యంలో రూపొందిన చిత్రమే `ప్రేమజంట`. తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఓ కథాంశాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు నిఖిలేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రామ్ ప్రణీత్ , సుమయ జంటగా నటించిన ఈ చిత్రానికి నిఖిలేష్ దర్శకత్వం వహించగా మహేష్ నిర్మించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే .
కథ:
నందిని ( సుమయ ) ని టెన్త్ క్లాస్ లోనే ప్రేమించిన చందు (రామ్ ప్రణీత్ ) ప్రేయసిని స్ఫూర్తిగా తీసుకొని జిల్లా ఫస్ట్ వస్తాడు . దాంతో ఐ ఐ టి లో సీటు వచ్చినప్పటికీ తన పేదరికం వల్ల అలాగే తాను ప్రేమించిన అమ్మాయి కాలేజ్ లో జాయిన్ కావడంతో తాను కూడా ఎంపీసీ క్లాస్ లో జాయిన్ అవుతాడు . అయితే తన ప్రేమ విషయం నందిని కి చెప్పడానికి సంశయిస్తుంటే నందిని చొరవ తీసుకొని ప్రేమిస్తే చెప్పుమని అంటుంది చందుతో . సరిగ్గా ఇదే సమయంలో వీళ్ళ ప్రేమ పెద్దలకు తెలియడంతో ఆదిలాబాద్ నుండి పారిపోయి హైదరాబాద్ వస్తారు ఈ మైనర్ ప్రేమికులు . హైదరాబాద్ వచ్చాకా ఈ మైనర్ ప్రేమికులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .
విశ్లేషణ:
మైనర్ ప్రేమకథలు ఇప్పటి నుండే సీతాకోక చిలుక సినిమాల నుండే ఆదరణ పొందుతున్నాయి. అయితే ఇది ఓ కోణంను మాత్రమే తెరపై ఆవిష్కరింప చేసే ప్రయత్నం. అయితే ప్రస్తుతం సమాజంలో పరువు హత్యలు జరుగుతున్నాయి. రీసెంట్గా చిత్తూరు జిల్లాలో జరిగిన పరువు హత్య అయినా, ప్రణమ్ హత్య అయినా.. ఏదైనా పరువు హత్యే. ఇలాంటి పరువు హత్యలను ఆవిష్కరించే ప్రయత్నం` ప్రేమజంట` సినిమాతో దర్శకుడు నిఖిలేశ్ చేశాడు. ప్రధాన జంటగా నటించిన రామ్ ప్రణీత్, సుమయ పాత్రలకు న్యాయం చేశారు. పాటలు బావున్నాయి. తెలంగాణ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించిన విధానం బావుంది. కెమెరా వర్క్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బావుండేది. పిక్చరైజేషన్లో క్వాలిటీ లేదు. హీరో సుమయ నటన ఆకట్టుకుంటుంది. ఇక హీరో ఫ్రెండ్స్ గా నటించిన టిక్ టాక్ దినేష్ తనదైన కామెడీ టైమింగ్ తో , డైలాగ్స్ తో అలరించాడు . ఇక మిగిలిన పాత్రల్లో షఫీ , స్వాతి నాయుడు , రాజా రవీంద్ర , ఉత్తేజ్ లు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు . డైలాగ్స్ బాగున్నాయి .మంచి అంశమే ఎంచుకున్నాడు కానీ స్క్రీన్ ప్లే పరంగా మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది.
చివరగా… ప్రస్తుత సమాజంలో పరువు హత్యల నేపథ్యంలో `ప్రేమజంట`