21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
ట్రెండింగ్ రివ్యూలు

Acharya Movie Review: “ఆచార్య” మూవీ రివ్యూ..!!

Share

Acharya Movie Review: సినిమా పేరు : ఆచార్య
నటీనటులు : చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే తదితరులు
డైరెక్టర్ : కొరటాల శివ
ప్రొడ్యూసర్ : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
రన్ టైమ్ : 2 గంటల 34 నిమిషాలు
రిలీజ్ డేట్ : 29 ఏప్రిల్ 2022Acharya Review, Rating , public talkపరిచయం:

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, చరణ్ కలిసి నటించిన “ఆచార్య” నేడు రిలీజ్ అయింది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమా తెరపై పడటంతో రెండు తెలుగు రాష్ట్రాలలో పండగ వాతావరణం నెలకొంది. చిరంజీవి, చరణ్ కలిసి నటించిన “ఆచార్య”లో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించింది. మొదటి నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా కొరటాల శివ అద్భుత రీతిలో తెరకెక్కించినట్లు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో సినిమా యూనిట్ తెలియజేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో ట్రైలర్, పాటలు…భారీ సెట్ లు సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచడం జరిగింది. ముఖ్యంగా ఒక ఆధ్యాత్మిక వాతావరణం అలుముకున్న ధర్మస్థలి అనే సెట్ కి సినిమా యూనిట్ బాగా ఖర్చు పెట్టడం వంటి విశేషాలు.. ప్రేక్షకులు సినిమాను చూడటానికి దోహదం చేశాయి. అయితే నేడు ప్రపంచవ్యాప్తంగా “ఆచార్య” రిలీజ్ కావడంతో సినిమా టాక్ ఏంటో తెలుసుకొందాం.

Acharya Twitter Review: Is The Chiranjeevi And Ram Charan Starrer Worth The Hype? - Filmibeat
స్టోరీ:
ఆధ్యాత్మికంగా ఎంతో వైభవంగా ధర్మస్థలి(దేవకట్టా) అనే పట్టణానికి మంచి పేరు ఉంటది. అయితే ఈ పట్టణంపై బసవ(సోను సూద్) అనే క్రూరుడు కన్నేసి.. ధర్మస్థలి పట్టణం తన ఆధీనంలో ఉంచుకుంటాడు. మెల్ల మెల్లగా హింసాత్మక చర్యలతో.. ధర్మస్థలి ఆక్రమించి.. దేవాలయాల్లో అక్రమాలకు పాల్పడుతూ అక్కడ ఉన్న ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ..బసవ ఇష్టానుసారంగా చలామణి అవుతాడు. అయితే తర్వాత “ధర్మస్థలి” నీ రక్షించడానికి ఆచార్య (చిరంజీవి) ఒక కారణంతో రావాల్సి ఉంటుంది. ఆ కారణం మరెవరో కాదు సిద్ధ ( రామ్ చరణ్). అసలు సిద్ధ ఎవరు..?, ఆచార్య కి సిద్ద కి సంబంధం ఏమిటి..?, సిద్ధ కోసం ఆచార్య ధర్మస్థలి సమస్యను ఎలా పరిష్కరిస్తారు..? ధర్మస్థలి పట్టణంలో సిద్ధ ఏం చేస్తూ ఉంటాడు..? అసలు ఆచార్య నేపథ్యం ఏమిటి..? అన్న ప్రశ్నలకు “ఆచార్య” చూడాల్సిందే.Acharya' Twitter Review: Check out what Netizens had to say about Chiranjeevi and Ram Charan multi-starrer...! | Telugu Movie News - Times of India
పెర్ఫార్మెన్స్:

యధావిధిగా చిరంజీవి “ఆచార్య” పాత్రకి న్యాయం చేశాడు. కానీ “ఆచార్య” బలమైన కథ కాకపోవడంతో పాటు నడిపించిన విధానం చాలావరకు విఫలమైంది. స్క్రీన్ మీద ఇద్దరు బిగ్ స్టార్స్ అది కూడా చరణ్, చిరంజీవినీ చూడటానికి భారీ అంచనాలు పెట్టుకొని థియేటర్లకు వెళ్లిన అభిమానులకు ఫస్టాఫ్ బలవంతంగా కూర్చోబెట్టి సినిమా చూపించినట్టు ఉంది. చాలావరకు ధర్మస్థలి గురించే స్టోరీ నడిపిస్తూ ఉంటారు. ఫస్టాఫ్ చాలా స్లోగా వెళుతుంది. ఎక్కడా కూడా ఎలివేషన్స్ ఉండవు. అసలు ఇది కొరటాల సినిమా యేనా అనే సందేహం వస్తుందట. ఇక సెకండాఫ్ మాత్రం సినిమాని నిలబెట్టింది అని టాక్. సెకండాఫ్ లో చరణ్, చిరంజీవి ఓకే ఫ్రెమ్ సీన్స్ పూనకాలు తెప్పిస్తాయి అనీ పేర్కొంటున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ రోల్ “ఆచార్య” కి పెద్ద హైలెట్ అని చెబుతున్నారు. ఇంటర్వెల్ సన్నివేశంలో సిద్ధ క్యారెక్టర్ లో చరణ్ పెర్ఫామెన్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది అని చెప్పుకొస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఫస్టాఫ్ పర్వాలేదనిపించినా సెకండాఫ్ “ఆచార్య” కి బిగ్ ప్లస్ అని చూసిన జనాలు అంటున్నారు. సినిమాలో ఫైట్స్, సాంగ్స్ క్లైమాక్స్ లో చిరంజీవి నట విశ్వరూపం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకొస్తున్నారు. ఇక హీరోయిన్ గా పూజా హెగ్డే విషయానికొస్తే ఎందుకు తీసుకున్నారా..? అనిపించింది అని అంటున్నారు. బలమైన స్టార్ హీరోలు తారాగణం ఉన్నాగాని స్టోరీలో దమ్ము లేదని చూసిన ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు.

 

పాజిటివ్ పాయింట్స్ :

భలే బంజారా సాంగ్
తిర్రు సినిమాటోగ్రఫీ

ధర్మస్థలి సన్నివేశాలు, ఆర్ట్ వర్క్ 
ఎలివేషన్ ..ఫైట్స్
కామెడీ సన్నివేశాలు
ఇంటర్వెల్ బ్యాంగ్
రామ్ చరణ్, సోను సూద్ పాత్రలు
క్లైమాక్స్ లో చిరంజీవి డైలాగ్స్.

Acharya Movie Release Live: ప్రేక్షకుల ముందుకు ఆచార్య.. కోలాహలంగా మారిన థియేటర్స్.. అభిమానుల రచ్చ | Acharya Movie Release Live Updates starring Chiranjeevi, Ram Charan, Kajal Aggarwal, Pooja ...

నెగిటివ్ పాయింట్స్ :

మణిశర్మ అందించిన సంగీతం
VFX పనితనం
స్టోరీ
రొటీన్ క్యారెక్టరైజేషన్
క్లైమాక్స్.

మొత్తంగా:

ఎంతటి స్టార్ డైరెక్టర్ అయినా.. తిరుగులేని క్రేజ్ హీరోలు సినిమాలో ఎంత మంది ఉన్నా స్టోరీలో దమ్ము లేక పోతే “ఆచార్య” సినిమా నేర్పుతుంది గుణపాఠాలు.


Share

Related posts

Roasted Food: మాడిన ఆహారాన్ని తింటున్నారా..!? ఈ ప్రాణాంతక వ్యాధి రావచ్చు..!!

bharani jella

Payal Rajput: పాయల్ రాజ్ పుత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..!!

sekhar

RamCharan Birthday Celebrations : చెర్రీ బర్త్ డే సందర్భంగా వరుణ్ తేజ్ పోస్ట్ చేసిన స్పెషల్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది..

bharani jella