NewsOrbit
న్యూస్ రివ్యూలు సినిమా

Aranya Movie Review : ‘అరణ్య’ మూవీ రివ్యూ

Aranya Movie Review Rana Daggubati

Aranya Movie Review : రానా దగ్గుబాటి హీరోగాప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాఅరణ్య‘. విష్ణు విశాల్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. ఈరోస్ ఇంటర్నేషనల్ వారు నిర్మించిన ఈ చిత్రానికి సంతను సంగీతం సమకూర్చారు. మంచి విన్నూత అంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరిఅరణ్యఎలా ఉందో చూద్దామా…?

 

Aranya Movie Review Rana Daggubati
Aranya Movie Review

Aranya Movie Review : కథకథనం

అరణ్యచిత్రం జాదవ్ పయెంగ్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఇతనినిఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాఅని అంటారు. కథ విషయానికి వస్తేఫారెస్ట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ రాజగోపాల్ (అనంత్ మహదేవ్) 60 ఎకరాల విస్తీర్ణంలో ఒక స్మార్ట్ సిటీ నిర్మించేందుకు పూనుకుంటాడు. ఈ టౌన్ షిప్ ని ఒక దట్టమైన అడవి మధ్యలో నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. అయితే అడవిలో ఎక్కడ అయితే ఈ స్మార్ట్ సిటీ నిర్మించాలని అనుకున్నారో అక్కడే అడవి ఏనుగులు నివాసం ఉంటుంటాయి. అవి నీటి కోసం వెళ్లేందుకు ఆ దారినే ఉపయోగిస్తూ ఉంటాయి. ఇక్కడ మనుషులు వచ్చి నివసించేందుకు అవి అడ్డుగా ఉండడం మినిస్టర్ కు సమస్యగా మారుతుంది. అరణ్య (రానా)… ఈ స్మార్ట్ సిటీ నిర్మించబడితే ఏనుగుల ఉనికికే ముప్పు అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన పోరాటాన్ని మొదలు పెడతాడు. అలా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఏనుగులతో కలిసి అరణ్య ఒక వ్యవస్థను ఎలా ఎదిరించాడు అన్నది మిగిలిన కథాంశం.

‘అరణ్య' మూవీ రివ్యూ

ప్లస్ పాయింట్స్ :

  • ఈ చిత్రం కోసం రానా నిజంగానే ప్రాణం పెట్టేసాడు అని చెప్పాలి. అడవి మనిషి లా కనిపించడం కోసం అతను పలికించిన హావభావాలు, డైలాగ్ డెలివరీ ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ. రానాలో మరో కొత్త నటుడిని దర్శకుడు ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు.
  • ఈ చిత్రం విజువల్స్ చాలా బాగున్నాయి. దట్టమైన అడవి మధ్యలో ప్రదేశాలను స్క్రిప్ట్ కు తగ్గట్లు అందంగా చిత్రీకరించారు. ప్రేక్షకులకు సినిమా చూస్తున్నంత సేపు ఆ ప్రపంచంలోనే ఉన్నామన్నట్టు అనిపిస్తుంది.
  • చిత్రానికి సంగీతం భారీ ప్లస్. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే హైలెట్ గా నిలిచింది. సంతను ఎమోషన్స్ కు తగ్గట్లు బాణీలు అందించారు.
  • రానా కి ఏనుగుల కి మధ్య ఉన్న అనుబంధం గురించి వచ్చే సన్నివేశాలు అద్భుతంగా పండాయి. ముఖ్యంగా మొదటి 30 నిమిషాలు చిత్రం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ప్రభు సల్మాన్ ఈ ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి మొదటి 30 నిమిషాల్లో పెట్టిన సన్నివేశాలు అత్యద్భుతంగా ఉన్నాయి.
  • నిర్మాణ విలువలు ఎంత ఉన్నతంగా ఉన్నాయి. ఆస్కార్ అవార్డు విజేత రసూల్ పూకుట్టి చేసిన సౌండ్ డిజైన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆ శబ్దాలు నిజంగానే మనకి అడవి లో తిరుగుతున్న అనుభూతిని కలిగిస్తాయి.

మైనస్ పాయింట్స్ : 

  • ఈ చిత్రాన్ని స్క్రిప్ట్ ప్లే బాగా దెబ్బ తీసింది అని చెప్పాలి. కథనానికి తగ్గట్లు సవ్యంగా వెళ్ళే స్క్రీన్ప్లే రాబట్టలేము కాబట్టి దీని పట్ల ఎక్కువ జాగ్రత్త వహించాలి. డైరెక్టర్ ఈ విషయంలో మాత్రం విఫలమయ్యాడు.
  • ఇటువంటి ఒక సబ్జెక్టు కోసం ఎంతో రీసెర్చ్ అనవసరం. కానీ ఈ సినిమాలో లాజిక్ లేని సీన్లు కొన్ని ఉన్నాయి. ఇవి ప్రేక్షకులకు రుచించకపోవచ్చు. అవి కథ మూడ్ ని దెబ్బ తీసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
  • ఇక ఎడిటింగ్ లో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి. అనవసరమైన సన్నివేశాలుఎటువంటి ముగింపు లేకుండా నడిచే సీక్వెన్స్ లు చాలా తీసివేయవచ్చు అనిపిస్తుంది. చిత్రం నిడివి కూడా కొంచెం తగ్గించి ఉంటే బాగుండేది.
  • సినిమా నడిచే కొద్దీకొన్ని పాత్రలకి మొదట్లో ప్రాధాన్యత ఉన్నట్లు అనిపించినాతర్వాత ఆ పాత్రలు హఠాత్తుగా మాయమవడం…. అలాగే కొన్ని సన్నివేశాలు అసహజంగా అనిపించడం చూడవచ్చు. అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ ఎంత సహజంగా కనిపిస్తుందో కొన్ని యాక్షన్ ఘట్టాల్లో అయితే అదే సహజత్వం లోపించింది.

Rana Daggubati : Is an actor to be study by Heros

Aranya Movie Review : విశ్లేషణ

ఒక మంచి ఆలోచింపజేసే కథనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రానా తన వరకు ఈ సినిమాకు వంద శాతం న్యాయం చేశాడు అని చెప్పాలి. అయితే మంచి స్క్రీన్ ప్లే, సరైన లాజిక్కులు ఉంటే సినిమా ఖచ్చితమైన హిట్ అయ్యేది. ఆలోచన మంచిది అయినప్పటికీ లాజిక్కులు వదిలేయడం మాత్రం ప్రేక్షకులు సహించకపోవచ్చు కానీ ఈ సినిమా విజువల్ గ్రాండియర్ గా ఉంటుంది. గ్రాఫిక్స్ వాడుకున్న విధానం…. అడవుల్లో సినిమా సెట్ చేసిన తీరు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. అడవులపై, పర్యావరణం పై, సామాజిక అంశాల పై ప్రేమ ఉన్నవారు ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. మిగతా వారికి చిత్రం మొత్తం మీద పెద్దగా రుచించకపోవచ్చు.

చివరి మాట : ‘అరణ్య

Related posts

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju