32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
OTT రివ్యూలు

ATM Web Series Review: బస్తీ యువకుడిగా వీజే సన్నీ. ఆ దొంగతనంలో సక్సెస్ అయ్యాడా? ఇన్వెస్టిగేషన్‌లో ఏం జరుగుతుంది?

ATM Telugu Web Series Review
Share

 ATM Web Series Review: ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కథను అందించిన వెబ్ సిరీస్ ‘ఏటీఎం’. ఈ సిరీస్‌ను దిల్ రాజు ప్రొడక్షన్స్ లో నిర్మించారు. దాంతో ప్రేక్షకుల చూపు ఈ సిరీస్‌పై పడింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జీ5’ వేదికగా విడుదలైన ఈ వెబ్‌సిరీస్ ఎలా ఉంది? బస్తీ యువకుడిగా వీజే సన్నీ ఎలా కనిపించాడు? వీజే సన్నీ, పృథ్వీ, సుబ్బరాజ్ యాక్టింగ్ ఎలా ఉంది? స్టోరీ ఎలా ఉంది? సినిమాల్లో సక్సెస్ అందుకున్న దర్శకనిర్మాతలు డిజిటల్ స్క్రీన్‌పై విజయాన్ని అందుకున్నారా? తదితర విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ATM Web Series Review
ATM Web Series Review ZEE58242 Telugu Web Series ATM Review 2023 ATM Telugu Web Series Review

వెబ్‌సిరీస్: ఏటీఎం
నటీనటులు: వీజే సన్ని, సుబ్బరాజు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, కృష్ణ బూరుగుల, రాయల్ శ్రీ, రవిరాజ్, దివి, దివ్యవాణి, హర్షిణి, షఫీ తదితరులు.
కథ, రచన: హరీష్ శంకర్
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సీ.చంద్రమోహన్
ఛాయా గ్రహణం: జీ.మౌనిక్ కుమార్
సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి
సమర్పణ: శిరీష్, హరీష్ శంకర్
ఓటీటీ వేదిక: జీ5
ఎపిసోడ్స్: 8
రిలీజ్ డేట్: 20 జనవరి 2023

 ATM Web Series Review: వెబ్‌సిరీస్ స్టోరీ

జగన్ (వీజే సన్నీ’ హైదరాబాద్‌లోని ఓ బస్తీ యువకుడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జల్సా చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు జగన్ పాత కారును కొట్టేసి అమ్మేస్తాడు. అయితే ఆ కారులో రూ.10 కోట్లు విలువ చేసే డైమండ్స్ ఉంటాయని జగన్‌కు తర్వాత తెలుస్తుంది. డైమండ్ ఓనర్ జగన్, అతని స్నేహితులను పట్టుకుని డైమండ్స్ లేదా రూ.10 కోట్లు డబ్బు ఇవ్వమని, లేదా చంపేస్తానని బెదిరిస్తాడు. 10 రోజుల టైం అడిగిన జగన్.. ఆ క్రమంలో ఏటీఎంకు డబ్బులు తీసుకెళ్లే వాహనాన్ని దొంగలిస్తారు. ఆ వ్యానులో వాళ్లకు రూ.25 కోట్లు దొరుకుతాయి. ఈ చోరీ కేసును ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ హెగ్డే (సుబ్బరాజు)కు పోలీసులు అప్పగిస్తారు. హెగ్డే దొంగలను ఎలా పట్టుకుంటాడు? రూ.25 కోట్లు ఎలా రికవరీ చేశాడు? ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ చేస్తున్న బస్తీ కార్పొరేటర్ గజేంద్ర (పృథ్వీ) ఇన్వాల్‌మెంట్ ఏంటి? డైమండ్ ఓనర్‌ను జగన్ డబ్బులు ఇచ్చాడా? అనేది తెలియాలంటే ఈ వెబ్‌సిరీస్ చూడాల్సిందే..

విశ్లేషణ:
రొటీన్ స్టోరీగా ఉంది. రోజూ వార్తల్లో కనిపించే దొంగతనాల లాగే అనిపిస్తుంది. అయితే ఇందులో హరీష్ శంకర్ హ్యూమర్, సస్పెన్స్ యాడ్ చేశారు. ఫిలాసఫీ చెప్పారు. కోట్లు గుమ్మరించి ఎమ్మెల్యే టికెట్ కొనడం, ఏటీఎం చోరీలు, బస్తీ యువకుల జీవితాలు. పోలీస్ ఇన్వెస్టిగేషన్. ఇలాంటివి నిత్యం మనం వార్తల్లో చూస్తున్నవే. ఈ కోణంలో చాలా వరకు సినిమాలు కూడా స్క్రీన్ మీదికి వచ్చాయి. కానీ హరీష్ శంకర్ ‘ఏటీఎం’ వెబ్‌సిరీస్ ఆలోచన బాగుందనే చెప్పుకోవచ్చు. కొన్ని ట్విస్టులు బాగున్నాయి. లాజికల్ స్క్రీన్ ప్లే అని చెప్పవచ్చు. క్యారెక్టర్స్ ను ఇంటడ్యూస్ చేయడానికి డైరెక్టర్ ఎక్కువ టైమ్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. మొదట కొన్ని ఎపిసోడ్స్ చాలా స్లోగా రన్ అవుతాయి. సీఐ ఉమాదేవి (దివ్యవాణి) క్యారెక్టర్ చిరాకుగా అనిపిస్తాయి. సుబ్బరాజు ఎంట్రీతో క్యూరియాసిటీ మొదలవుతుంది. ఛాయాగ్రహణం, సంగీతం బాగుంది.

ప్లస్ పాయింట్స్:
వీజే సన్నీ, సుబ్బరాజు యాక్టింగ్, పృథ్వీ కామెడీ టైమింగ్.
మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ.
స్టార్టింగ్ ఎపిసోడ్స్ నిదానంగా సాగడం.
రేటింగ్: 2.5/5

గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

 


Share

Related posts

అనుష్క నిశ్శబ్దం : ఇంటర్నెట్ లో మొట్టమొదటి రివ్యూ !!

siddhu

Vadhandhi the fable of Velonie- వధంధీ: ది ఫేబుల్ ఆఫ్ వెలోనీ రివ్యూ, ఎస్.జె. సూర్య వెబ్ సిరీస్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో, ఎలా ఉందంటే?

Ram

‘ప్రేమజంట’ రివ్యూ & రేటింగ్‌ ***

Siva Prasad