NewsOrbit
Entertainment News రివ్యూలు సినిమా

Animal Review: రక్తపాతం సెంటిమెంట్ తో.. రణబీర్ కపూర్ నట విశ్వరూపం… “యానిమల్” సినిమా రివ్యూ..!!

Animal Review: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన “యానిమల్” డిసెంబర్ మొదటి తారీకు విడుదలయ్యింది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ఐదు భాషలలో విడుదలయ్యింది. మరి సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం.
సినిమా: యానిమల్
నటీనటులు : రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి డిమ్రి తదితరులు
దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా
నిర్మాత : భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగ
విడుదల తేదీ : డిసెంబర్ 01, 2023
Bollywood hero Ranbir Kapoor one man show Animal movie full review
పరిచయం:

భారతీయ చలనచిత్ర రంగంలోనే కొత్త తరహాలో సినిమాలు చేస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. 2018లో “అర్జున్ రెడ్డి” సినిమాతో ఓ సంచలనం సృష్టించాడు. అదే సినిమాని బాలీవుడ్ ఇండస్ట్రీలో “కబీర్ సింగ్” గా చిత్రీకరించి అదిరిపోయే విజయాన్ని అందుకోవటం జరిగింది. కొత్తదనంలో సినిమాలు చేస్తూ అందరిని అలరిస్తున్న సందీప్ రెడ్డి వంగా.. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ ని.. ఇప్పటివరకు ఎవరు చూపించని వైలెంట్ పాత్రలో “యానిమల్” సినిమా చేయడం జరిగింది. డిసెంబర్ మొదటి తారీకు ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల అయింది. మరి “యానిమల్” సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

Bollywood hero Ranbir Kapoor one man show Animal movie full review

కథ:

రణ్ విజయ్ సింగ్(రణబీర్ కపూర్) కి చిన్ననాటి నుంచి తండ్రి బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) అంటే చెప్పలేనంత ఇష్టం. కానీ బల్బీర్.. పెద్ద వ్యాపారవేత్త కావడంతో… పిల్లల కోసం టైం కేటాయించలేని పరిస్థితి. దేశంలోనే పెద్ద బిజినెస్ మాన్ కావడంతో..బల్బీర్ కుటుంబ సభ్యుల కోసం పెద్దగా సమయానికి కేటాయించలేకపోయేవాడు. ఇది ఎంతగానో రణ్ విజయ్ సింగ్ నీ బాధకు గురి చేయడం జరుగుద్ది. అయితే చిన్నతనంలో రణ్ విజయ్ చేసిన ఓ తప్పు.. అతన్ని కుటుంబ సభ్యుల నుండి దూరం చేయడం జరుగుద్ది. రణ్ ఎవరినైనా సరే ధైర్యంగా ఎదిరించే రకం అంతే కాదు చాలా దూకుడు మనస్తత్వం ఉన్న మనిషి. దీంతో చాలా సందర్భాలలో కొడుకు విషయంలో బల్బీర్ కోప పడటంతో పాటు కొట్టడం కూడా జరుగుతుంది. ఈ రకంగా తండ్రీ కొడుకుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. అయితే అనుకోకుండా రణ్ విజయ్ సింగ్… గీతాంజలి (రష్మిక మందన) తో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకోవటం జరుగుద్ది. ఈ పెళ్లి రణ్ విజయ్ తండ్రి బల్బీర్ కి నచ్చదు. దీంతో గీతాంజలిని తీసుకుని రణ్ విజయ్ సింగ్.. అమెరికా వెళ్ళిపోతాడు. కాగా విదేశాలలో ఉన్న సమయంలో తండ్రి పై హత్యాయత్నం జరిగిందని తెలుసుకొని రణ్ విజయ్ సింగ్… హుటాహుటిన ఇండియాకి వస్తాడు. తండ్రిపై హత్య చేయాలనుకున్న దుండగులను రణ్ విజయ్ ఎలా గుర్తించాడు..? రణ్ విజయ్ సింగ్.. ఇండియా వచ్చాక ఏం జరిగింది..? విలన్ నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నది మిగతా స్టోరీ.

Bollywood hero Ranbir Kapoor one man show Animal movie full review

విశ్లేషణ:

డైరెక్టర్ సందీప్ రెడ్డి మరోసారి “యానిమల్” లో తన మార్కు చూపించాడు. ఫస్ట్ ఆఫ్ మొత్తం రక్తపాతం సెకండ్ హాఫ్ ఎమోషనల్ సన్నివేశాలతో మూడున్నర గంటలు ప్రేక్షకులను సినిమా చూసేలా చేశాడు. ఎక్కడా కూడా సాగదీత సన్నివేశాలు లేకుండా సినిమాపై బోరింగ్ అనేది రాకుండా… కథని అద్భుతంగా నడిపించాడు. ముఖ్యంగా రణబీర్ కపూర్ నీ ఇప్పటివరకు ఎవరు చూపించని విధంగా.. సందీప్ రెడ్డి వంగ చూపించాడు. హీరో యాటిట్యూడ్ క్యారెక్టర్రైజేషన్… చాలా హైలెట్ గా ఉంటుంది. ఎలాంటి సోది సుత్తి లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనస్తత్వం కలిగిన క్యారెక్టర్ లో రణబీర్ కపూర్ నట విశ్వరూపం చూపించారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సందీప్ రెడ్డి వంగా మొదట బిగినింగ్ మరియు ఎండింగ్ ఎవరు మిస్ కాకూడదని స్పీచ్ ఇవ్వడం తెలిసిందే. కాగా సినిమాలో ఆ రకంగానే బిగినింగ్ మరియు క్లైమాక్స్ లో అదిరిపోయే సన్నివేశాలు పడ్డాయి. క్లైమాక్స్ లో వైలెన్స్ ఎవరు ఊహకు అందని రేంజ్ లో తీయడం జరిగింది. హీరోయిన్ గా రష్మిక మందన పాత్ర ఫస్ట్ ఆఫ్ కంటే సెకండ్ హాఫ్ లో చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటది. ఇక మిగతా పాత్రలు అనిల్ కపూర్, బాబి డియోల్ ఎవరికివారు సినిమాకి న్యాయం చేశారు. కానీ అందరి పాత్రల కంటే హీరో రణబీర్ కపూర్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండటంతో అతనిదే వన్ మాన్ షో అన్నట్టు సినిమా చూశాక ఫీల్ కలుగుద్ది. రష్మిక తో రొమాన్స్ సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ లో తండ్రి కొడుకుల ఎమోషన్స్ సినిమాకి హైలెట్ గా ఉండటమే కాదు.. ఆడియన్స్ కంట్లో నీళ్లు తిరుగుతాయి. సినిమా ముగిసిపోయింది అని అనుకున్న సమయంలో ఓ ట్వీస్ట్ తదుపరి భాగంపై అంచనాలను పెంచే రీతిలో.. ప్రేక్షకుడికి దర్శకుడు కొత్త ఫీల్ కలిగించాడు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella