భారతదేశ వెబ్ సిరీస్ రంగంలో తమిళ్ హీరో ‘మాధవన్’ ప్రధాన పాత్రలో నటించిన బ్రీత్” (2018) అమెజాన్ ప్రైమ్ లో విడుదలైనప్పుడు మొట్టమొదటిసారిగా భారతదేశ చలనచిత్ర ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా తిలకించారు. అంచనాలకు తగ్గట్టుగానే బ్రీత్ కూడా చాలా వినూత్న రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు అదే అమెజాన్ ప్రైమ్ లో అభిషేక్ బచ్చన్ మరియు నిత్యామీనన్ ప్రధాన పాత్రలలో నటించిన ‘బ్రీత్ – ఇంటూ ద షాడోస్’ మిస్టరీ థ్రిల్లర్ తన ప్రీక్వెల్ కి తగ్గ హైప్ ను దక్కించుకుందా లేదా అన్న విషయం చూద్దాం.
కథ విషయానికి వస్తే అవినాష్ సబర్వాల్ (అభిషేక్ బచ్చన్) మరియు అభా (నిత్య మీనన్) మరియు వారి ముద్దుల కూతురు సియా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కింది. ఒక నిందితుడు సియా ను హైజాక్ చేసి ఆమె ప్రాణాలతో ఉండాలన్నా తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరికి రావాలని అవినాష్ (అభిషేక్ బచ్చన్) కొంతమంది ప్రముఖ వ్యక్తులను చంవలసిందిగా సూచిస్తాడు. ఇక మొదటి సీజన్ విషయానికి వస్తే అసలు మాధవన్ ఒక తండ్రి పాత్రలో మరియు కరడుగట్టిన నేరస్థుడిగా నటించిన పర్ఫామెన్స్ పిక్స్ అనే చెప్పాలి. ఇక బ్రీత్ రెండవ సీజన్ కథ కూడా కొద్దిగా మొదటి సీజన్ ను పోలి ఉండగా అసలు తన కుటుంబం కోసం అభిషేక్ బచ్చన్ అనగా అవినాష్ ఎంత దూరం వరకు వెళ్లగలుగుతాడు అన్నది ఇక్కడ పాయింట్.
ఇటువంటి థ్రిల్లర్ లో క్రిమినల్ కు మరియు అభిషేక్ బచ్చన్ కు మధ్య ఉండే సంభాషణలు మరియు తన కూతురు బ్రతికే ఉందని కఫర్మ్ చేసుకునేందుకు అభిషేక్ బచ్చన్ చేసిన సాహసాలు అన్నింటినీ పరిశీలిస్తే డైరెక్టర్ ప్రేక్షకులను తమ టీవీల ముందు మరియు మొబైల్స్ ముందు లేవకుండా ఉండేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. అయితే ఇటువంటి సమయంలోనే ఇన్వెస్టిగేటర్ కబీర్ చాలా అనూహ్య రీతిలో సీన్ లోకి ఎంటర్ కావడం మరియు కొన్ని హత్యలను అభిషేక్ చాలా సులువుగా చేయడం వంటివి ప్రేక్షకులను కొద్దిగా నిరుత్సాహపరుస్తాయి.
నిత్యామీనన్, అభిషేక్ బచ్చన్ మరియు సియా మధ్య ఉన్న బాండింగ్ మరియు రిలేషన్ గురించి దర్శకుడు ఎంత అద్భుతంగా చూపించారు…. ఆ ప్రేమలో నుండి వచ్చిన బయటకు వచ్చిన అభిషేక్ బచ్చన్ యొక్క క్రూరత్వాన్ని ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ గా ప్రేక్షకులకు మలచడంలో డైరెక్టర్ విఫలమయ్యాడనే చెప్పాలి. ఇకపోతే మొదటి సీజన్ 8 ఎపిసోడ్ ల తో చాలా చక్కగా మరియు మంచి పేస్ తో ముగియగా దీనిని 12 ఎపిసోడ్ లకు పొడిగించేందుకు చాలా సబ్ ప్లాట్స్ పెట్టవలసి వచ్చింది. ఈ సబ్ ప్లాట్స్ వల్ల సిరీస్ సాగే కొద్దీ ప్రేక్షకుల్లో మరింత బోర్ ఫీల్ అవుతారు.
ఇక సిరీస్ చివరాంకంలో కిల్లర్ యొక్క సిద్ధాంతాలు మరియు లాజిక్ ఇంకా కొన్ని సీన్లు అయితే బాగా ఇల్లాజికల్ గా అనిపిస్తాయి. బ్రీత్ ఇలాంటి అద్భుతమైన సిరీస్ తర్వాత వచ్చిన ‘ఇంటు ద షాడోస్’ నిజంగానే పేరుకి తగ్గట్టు ముందు సీజన్ నీడలో నడవాల్సిందేనా అని ఒకానొక సమయం లో అనిపిస్తుంది. కానీ నటీనటుల పెర్ఫార్మెన్స్ మరియు ప్రేక్షకులను కట్టిపడేసే మూలకథ దీనిని ఒక యావరేజ్ వెబ్ సిరీస్ గా నిలబెట్టాయి.
చివరి మాట : ‘బ్రీత్ – ఇంటూ ద షాడోస్’ ని మరీ తీసి పారెయ్యలేము కానీ… నిద్రలు మానుకొని బ్రేక్ లేకుండా చూసేంత గొప్ప వెబ్ సిరీస్ అయితే కాదు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!