NewsOrbit
Featured న్యూస్ రివ్యూలు సినిమా

Nithin check movie Review : చెక్ మూవీ రివ్యూ

check movie Review

check movie Review : నితిన్ హీరోగా విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెక్‘ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మనమంతా’ చిత్రం తర్వాత నాలుగేళ్ల గ్యాప్ తో మరొక సరికొత్త కథనంతో ఈ సినిమాను యేలేటి తెరకెక్కించారు. ప్రియా ప్రకాష్ వారియర్ ఈ చిత్రంలో నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది. రకుల్ ప్రీత్ సింగ్ లాయర్ గా ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. సాయి చంద్, మురళి శర్మ, సంపత్ రాజ్, పోసాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. కల్యాణి మాలిక్ సంగీతం సమకూర్చారు.

check movie Review : కథ

సినిమా ఓపెనింగే కోర్టు రూమ్ డ్రామా తో మొదలవుతుంది. ఆదిత్య (నితిన్) టెర్రరిస్టులకు సహాయం చేసినందుకు గాను అతనికి జీవిత ఖైదు విధిస్తారు. అతనికి దేశ ద్రోహిగా ముద్ర వేస్తారు. ఇలాంటి సమయంలో మానస (రకుల్ ప్రీత్ సింగ్) అనే ఒక లాయర్ అనూహ్య పరిస్థితుల్లో ఆదిత్య కేసు టేక్ అప్ చేయవలసి వస్తుంది. అప్పటికే డీలా పడిపోయిన ఆదిత్యకు మానస జీవితంపై ఆశ కల్పిస్తుంది. అలా తన గతాన్ని ఆదిత్య మానస తో షేర్ చేసుకుంటాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఆదిత్య కి యాత్ర (ప్రియా ప్రకాష్) కి మధ్య లవ్ స్టోరీ ఉంటుంది. అయితే ఇంటర్వెల్ భాగానికి ముందు ఒక చిన్న ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. సహజంగా చెస్ క్రీడాకారుడు అయిన ఆదిత్య ఛాంపియన్ షిప్ ఆటలు ఆడేందుకు అర్హత సాధిస్తాడు. అలా ఎన్నో ఛాంపియన్షిప్ గేమ్స్ గెలిచిన ఆదిత్య జైలు గోడల మధ్య మాస్టర్ గా నిలుస్తాడు. తన జైత్రయాత్రను కొనసాగిస్తూ కామన్వెల్త్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ వరకు చేరుకుంటాడు. అలాగే గ్రాండ్ మాస్టర్ టైటిల్ కూడా గెలుచుకుంటాడు. అయితే ఇక్కడే సినిమాకు చెందిన మరికొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ చోటుచేసుకుంటాయి. ఆదిత్య తన అమాయకత్వాన్ని ఎలా ప్రూవ్ చేసుకుంటాడు? అసలు అతనికి టెర్రరిస్టులకి సంబంధం ఏమిటి? చెస్ లో లాగానే తెలివితో ఎత్తులు వేసి జైలు శిక్ష నుండి తప్పించుకోగలిగాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

 

check movie Review
check movie Review

check movie Review : ప్లస్ పాయింట్స్

  • ఈ సినిమాలో ప్రేక్షకులు కొత్త నితిన్ ను చూస్తారు. అద్భుతమైన వేరియేషన్స్ తో నితిన్ ప్రదర్శించిన నటన ఈ సినిమాకి అతి పెద్ద హైలైట్. ఈ సినిమాలో నటుడిగా తనలోని మరో కొత్త కోణాన్ని నితిన్ ఆవిష్కరించాడు అనే చెప్పాలి. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.
  • కొత్త తరహా స్క్రిప్ట్ ఈ సినిమాను మరింత ఇంట్రెస్టింగ్ గా మారుస్తుంది. సాధారణంగా రచనలో చంద్రశేఖర్ ఏలేటి కనబరిచే వైవిధ్యం ఈ సినిమాలో కూడా మరొక మెట్టు ఎక్కువ ఉంటుంది. అలాగే సాయి చంద్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ప్రేక్షకులు అతని పాత్రకు కనెక్ట్ అవుతారు.
  • అన్నింటికన్నా సినిమాకి మేజర్ హైలైట్ స్క్రీన్ ప్లే. రచన గొప్పగా ఉన్నప్పుడు స్క్రీన్ ప్లే కూడా అందుకు తగ్గట్టు ఉంటే ఈ సినిమాలో మంచి ఫీలింగ్ ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయలేదు యేలేటి. థ్రిల్లర్ కథనానికి అవసరమైన అద్భుత స్క్రీన్ప్లే ఈ సినిమాకు ఆయన రాశారు.
  • సినిమా లో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. కళ్యాణి మాలిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా టెన్షన్ రెట్టింపు చేస్తుంది. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉండడంతో పాటుగా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులకు మంచి ఫీలింగ్ ఇస్తాయి.

మైనస్ పాయింట్స్ :

  • సినిమాలో రెండవ అర్ధభాగం కొద్దిగా స్లో గా నడిచినట్లు గా అనిపిస్తుంది. మొదటి అర్ధ భాగంలో స్క్రీన్ప్లే ఎంతో టైట్ గా ఉంటే రెండో అర్ధ భాగంలో ఆ హవా కనిపించలేదు.
  • ఈ సినిమాలో పాత్రల క్యారెక్టరైజేషన్ ఈ విషయంలో యేలేటి ఇంకా శ్రద్ధ వహించాల్సింది. థ్రిల్లర్ కథాంశం కాబట్టి రన్ టైం తక్కువగా ఉంది. 135 సినిమాలో పూర్తిగా క్యారెక్టర్ల గురించి చెప్పేందుకు ఆస్కారం లేకుండా పోయింది అని చెప్పవచ్చు.
  • మాస్ మసాలా సినిమాలు నచ్చే ఆడియన్స్కు ఈ సినిమా పెద్దగా రుచించకపోవచ్చు. పంచ్ డైలాగ్స్, కమర్షియల్ ఫైట్లు లేకుండా పూర్తిగా సినిమా లాజిక్ తో ఆర్ట్ ఫామ్ లో నడుస్తుంది.

విశ్లేషణ : 

చంద్రశేఖర్ ఏలేటి వంటి విలక్షణ దర్శకుడు నుండి ఎలాంటి సినిమా అయితే ప్రేక్షకులు కోరుకుంటారో… అలాంటి ఒక కొత్త సబ్జెక్ట్ తో సినిమా దాదాపుగా బోర్ అనే మాట లేకుండా ఎంతో నీట్ స్క్రీన్ప్లేతో ‘చెక్’ ముందుకు వెళుతుంది. సినిమా మొదటి అర్ధ భాగం సాఫీగా సాగుతుంది. స్క్రీన్ప్లే ఫాస్ట్ గా ఉండి ప్రీ-ఇంటర్వెల్ సమయానికి చిత్రం మరింత ఊపందుకుంటుంది. ప్రీ ఇంటర్వెల్ భాగంలో వచ్చే సన్నివేశాలు కథను మరింత రక్తి కట్టిస్తాయి. మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేట్ చేసే సస్పెన్స్ సీన్లతో సినిమాను బాగా తెరకెక్కించారు. అయితే కథలో ఉన్న లోతు వల్ల సినిమా నిడివి మరికొంత పెంచి ఉండవచ్చు అనిపిస్తుంది. కానీ థ్రిల్లింగ్ కథాంశానికి ఇదే సరైన రన్ టైమ్. ఆ బ్యాలెన్స్ పై దర్శకుడు మరింత ఫోకస్ చేయాల్సింది. లాజిక్ పైన ఎక్కువ ఫోకస్ చేసి ఎమోషన్ కొంచెం తగ్గిన ఈ సినిమాలో సెకండ్ హాఫ్ కాస్త స్లోగా అవుతుంది. అయితే మళ్లీ క్లైమాక్స్ సమయానికి ప్రేక్షకులకు మంచి ఫీలింగ్ అందించేస్తారు. మాస్ మసాలా… రొటీన్ కథాంశాలతో విసిగిపోయిన ప్రేక్షకులకు మంచి రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ‘చెక్’. ఈ వీకెండ్ కు ఈ సినిమా ఫర్ ఫెక్ట్ వాచ్ అనే చెప్పాలి. 2021 లో వచ్చిన అన్నీ సినిమాల్లో ఇదే ది బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు…!

చివరగా : రొటీన్ కథలకి ‘చెక్’ పెట్టి హిట్ కొట్టిన నితిన్…!

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri