21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
Entertainment News రివ్యూలు

GodFather Review: “గాడ్ ఫాదర్” సినిమా రివ్యూ, సరికొత్త లెక్కలు రాస్తున్న చిరంజీవి..!

Share

GodFather Review: సినిమా పేరు: గాడ్ ఫాదర్
దర్శకుడు: మోహన్ రాజా
నటీనటులు: చిరంజీవి, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, నయనతార, సునీల్, జబర్దస్త్ శ్రీను, పూరి జగన్నాథ్ ..తదితరులు.
నిర్మాతలు: ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్
సంగీతం: తమన్
విడుదల తేదీ: 05-10-2022
భాషలు: తెలుగు, హిందీ.

Chiranjeevi godfather movie review
GodFather Review
పరిచయం:

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా “గాడ్ ఫాదర్” నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదలయ్యింది. మలయాళం లో మోహన్ లాల్ నటించిన “లూసిఫర్”కి రీమేక్ గా “గాడ్ ఫాదర్” గా మోహన్ రాజా తెరకెక్కించారు. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టు రీతిలో స్క్రిప్ట్ లో అనేక మార్పులు చేయడం జరిగింది. “ముఠామేస్త్రి” తర్వాత ఆ తరహా ఫ్లేవర్ కలిగిన పొలిటికల్ డ్రామా తరహాలో “గాడ్ ఫాదర్” నీ రూపొందించారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకమైన పాత్రలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించటం సినిమాకి మరో అదనపు ఆకర్షణగా నిలిచింది. ఇంకా సత్యదేవ్, సునీల్, నయనతార లాంటి ఎంతో మంది నటీనటులు నటించిన ఈ సినిమా దసరా రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

Chiranjeevi godfather movie review
GodFather Review
స్టోరీ:

పీకే రామదాస్(PKR) అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటాడు. అయితే అతను అనుకోకుండా ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ వద్ద చనిపోవడం జరుగుతుంది. అయితే ఈ హాస్పిటల్ ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడి కూతురిది కావడంతో.. అసలు సినిమా మొదలవుతుంది. ఈ క్రమంలో చనిపోయిన పీకేఆర్ మరణంతో అధికార పార్టీ జనజాగృతిలో ముఖ్యమంత్రి ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై తర్జనభర్జన జరుగుతుంది. పీకేఆర్ కి అల్లుడు జయదేవ్ (సత్యదేవ్). దీంతో మామ సీఎం కుర్చీని స్వాధీనం చేసుకోవడానికి.. పార్టీలో ఉన్న కొంతమంది దురాశపరులతో ప్లాన్ లు వేస్తాడు. ఇక ఇదే సమయంలో పీకేఆర్ కి అత్యంత సన్నిహితుడు మరియు ప్రజాదరణ కలిగిన నాయకుడు బ్రహ్మ తేజ (చిరంజీవి). బ్రహ్మ తేజ ఎంట్రీతో సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. పీకేఆర్ మరణానికి అసలు కారకులు ఎవరు..? తెలుసుకుంటూ.. ఇంకా జయదేవ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కకుండా తనదైన శైలిలో అడ్డుపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో జై దేవ్ బ్రహ్మతేజని చంపడానికి అనేక కుట్రలు మరియు ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. మరి ఆ కుట్రలను బ్రహ్మ ఎలా ఎదుర్కొన్నాడు..? జై దేవ్ నీచుడు అన్న విషయం జయదేవ్ భార్య సత్యప్రియ (నయనతార)కి ఎలా తెలిసింది..? రాష్ట్రం దుర్మార్గమైన రాజకీయ చేతుల్లో పడకుండా బ్రహ్మ ఎలా అడ్డుపడ్డాడు..? అసలు బ్రహ్మకు ఇంకా పీకేఆర్ కి ఉన్న సంబంధం ఏమిటి…? మధ్యలో సల్మాన్ ఖాన్ ఎందుకు వచ్చాడు అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Chiranjeevi godfather movie review
GodFather Review
విశ్లేషణ:

మలయాళం “లూసిఫర్” సినిమా చాలా స్లోగా ఉంటుంది. కానీ “లూసీఫర్” సినిమాకి రీమేక్ గా తెలుగులో వచ్చిన గాడ్ ఫాదర్.. మొత్తానికి అందుకు భిన్నంగా ఉంది. సినిమా స్టార్ట్ అయిన నాటి నుండి ఇంటర్వెల్ వరకు స్టోరీ చాలా ఆసక్తికరంగా దర్శకుడు మోహన్ రాజా నడిపించిన తీరు అమోఘమని చెప్పవచ్చు. పికేఆర్ మరణంతో.. అసలైన స్టోరీ స్టార్ట్ చేసి దాని చుట్టూ ఉండే పాత్రల తీరుతేన్నులు అద్భుతంగా చూపించాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయ చదరంగంగా సాగే ఈ సినిమాలో సత్యదేవ్ ఇంకా చిరంజీవి నువ్వా నేనా అన్నట్టుగా నటించారు. జయదేవ్ పాత్రలో అధికార దాహం కోసం స్టైలిష్ విలన్ గా సత్యదేవ్ చెలరేగిపోయారు. ప్రమోషన్ కార్యక్రమంలో చెప్పినట్టుగానే సత్యదేవ్ స్క్రీన్ ముందు అరాచకం సృష్టించారు. ఇక బ్రహ్మ పాత్రలో చిరంజీవి వన్ మ్యాన్ షో చూపించడం జరిగింది. హీరోయిజం ఎలివేషన్ తో… అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో “గాడ్ ఫాదర్’ థియేటర్ లు దసరా రోజు దద్దరిల్లుతున్నాయి. సినిమా ఫస్ట్ ఆఫ్ ముఖ్యమంత్రి కుర్చీ కోసం బ్రహ్మ మరియు జయదేవ్ వేసుకునే ప్లాన్స్ నువ్వా నేనా అన్నట్టుగా ఉంటాయి. వర్తమాన రాజకీయాలపై చిరంజీవి వేసే డైలాగులు.. విజిల్స్ వేయించేటట్టు ఉన్నాయి. ఫస్ట ఆఫ్ తర్వాత సల్మాన్ రాకతో సినిమాలో అసలు ట్రిస్టు మొదలవుతుంది. మసూద్ గ్యాంగ్ నాయకుడు పాత్రలో సల్మాన్ కనిపించడం జరిగింది. మసూద్ గ్యాంగ్ చిరంజీవికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సల్మాన్ పాత్రని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు మాత్రమే వాడుకోవడం జరిగింది. ఇంకా నయనతార, బ్రహ్మాజీ, సునీల్, మురళి శర్మ వారి పాత్రలకు తగిన న్యాయం చేశారు. ఇదే సమయంలో పూరి జగన్నాథ్ ఇంకా షఫీ పాత్రలు కూడా సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతా బాగానే ఉన్నా గాని సినిమా ప్రధమార్ధంతో పోలిస్తే సెకండాఫ్ కొద్దిగా స్లో అని చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకుంటే మోహన్ రాజా తెలుగు నేటివిటీకి తగ్గట్టు అద్భుతమైన స్క్రీన్ ప్లే తో “గాడ్ ఫాదర్” నీ చూపించిన విధానం మెగా అభిమానులకు పెద్ద పండగ అని చెప్పవచ్చు.

Chiranjeevi godfather movie review
GodFather Review
సినిమా ప్లస్ పాయింట్స్:-

చిరంజీవి, సత్యదేవ్ ల నటన
డైరెక్షన్
తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్

 

మైనస్ పాయింట్స్:-

సెకండాఫ్ సాగదీత సన్నివేశాలు.
సాంగ్స్, యాక్షన్స్ సన్నివేశాలు
రొటీన్ క్లైమాక్స్.

మొత్తంగా:

 

ఈ ఏడాది ప్రారంభంలో “ఆచార్య” తో నిరాశపరిచిన అభిమానులకు దసరా నాడు మాస్ ఎంటర్టైనర్ గా “గాడ్ ఫాదర్”తో అభిమానులను చిరంజీవి అలరించడం జరిగింది.

 

రేటింగ్: 3.5/5

 

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Share

Related posts

ఐదో రోజు కూడా త‌గ్గేదే లే అంటున్న `కాంతార‌`.. ఇదేం బీభ‌త్సం రా బాబు!

kavya N

Nayan-Vignesh: న‌య‌న్‌-విఘ్నేశ్‌లు హనీమూన్ కోసం ఎక్క‌డికి చెక్కేశారో తెలుసా?

kavya N

Pavitra Lokesh: పోలీస్ కంప్లైంట్ చేసిన పవిత్ర లోకేష్..!!

sekhar