Bhola Shankar Review: మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా “భోళా శంకర్” నేడు విడుదలయ్యింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి చెల్లెల పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించింది. చిరంజీవికి జోడిగా తమన్న హీరోయిన్ గా నటించింది. కుర్ర హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించడం జరిగింది. మరి ఈ సినిమా విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రివ్యూ: భోళా శంకర్
తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, మురళీశర్మ, వెన్నెల కిషోర్, రఘుబాబు, రవిశంకర్, శ్రీముఖి, హైపర్ ఆది, గెటప్‌శ్రీను, సత్య తదితరులు
సినిమాటోగ్రఫీ: డడ్లీ
సంగీతం: మహతి స్వరసాగర్
నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్
స్టోరీ:
శంకర్ (చిరంజీవి) తన చెల్లెలు మహా (కీర్తి సురేష్) చదువు కోసం హైదరాబాద్ నుండి కలకత్తాకి చేరుకోవడం జరుగుద్ది. మహా కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత శంకర్ కలకత్తాలో టాక్సీ డ్రైవర్ గా జీవితం మొదలుపెడతాడు. ఇదే సమయంలో మరోవైపు కలకత్తాలో అమ్మాయిలను కిడ్నాప్ చేసి అక్రమంగా తరలించే అలెగ్జాండర్ (తరుణ్ అరోరా)నీ అంతమొందించడానికి సైలెంట్ గా శంకర్ పని చేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో కాలేజీలో చదువుతున్న మహాతో శ్రీకర్ (సుశాంత్) ప్రేమలో పడతాడు. ఇదిలా ఉంటే మహిళలను అక్రమంగా తరలించే ముఠాతో శంకర్ గొడవ పడటం శ్రీకరి సోదరి క్రిమినల్ లాయర్ లాస్య (తమన్నా) కంట పడటం జరుగుద్ది. ఆ తర్వాత ఏం జరిగింది ఇంతకీ మానవ అక్రమ రవాణా గ్యాంగ్ తో శంకర్..కి మధ్య జరిగినది ఏమిటి..? శంకర్ గతంలో ఏం చేసేవాడు..? మహా ఇంకా శ్రీకర్ జంట పెళ్లి జరిగిందా లేదా…? అనేది సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
తమిళంలో అజిత్ హీరోగా నటించిన “వేదాళం” కి తెలుగు రీమిక్ గా “భోళా శంకర్” గా తెరకెక్కించారు. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. తమిళంలో కథకి ఇంకా అన్నా చెల్లెల మధ్య భావోద్వేగా పరమైన సన్నివేశాలు చూసే ప్రేక్షకులను ఆకట్టుకుంటే తెలుగులో హీరోయిజంకి పెద్దపీట వేసి… తెలుగు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లయింది. తొలిభాగం మొత్తం కలకత్తాలో సాగగా.. చెప్పుకోదగ్గ సన్నివేశాలు ఏమీ లేవు. చిరంజీవి వెన్నెల కిషోర్ మధ్య.. కామెడీ ట్రాక్ నడిపించాలని చేసిన ప్రయత్నం కూడా పెద్దగా ఆకర్షించలేకపోయింది. రొటీన్ యాక్షన్ డ్రామాగా పాతకాలం నాటి స్టోరీ లైన్ తో మెహర్ రమేష్ తీసిన ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ సీన్స్ ఒకటి కూడా లేదని చెప్పవచ్చు. తమన్నాతో చిరంజీవి లవ్ ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. యాంకర్ శ్రీముఖితో నడుము సీన్ కూడా వెండితెర మీద పెద్దగా పండలేదు. సినిమా కథలోని మెయిన్ పాయింట్ ద్వితీయార్థంతోనే ముడిపడి ఉండటంతో ఫస్టాఫ్ మొత్తం బోరింగ్ వ్యవహారంలా అనిపిస్తుంది. అయితే విరామంలో వచ్చే ట్విస్ట్ సెకండాఫ్ ఎలా ఉంటుందోననే ఆసక్తిని కలిగిస్తుంది. సెకండాఫ్ లో చిరంజీవి కామెడీ మరియు యాక్షన్ సీన్స్ పర్వాలేదు అనిపిస్తాయి. ఎమోషన్ సన్నివేశాలలో చిరంజీవి తన తనదైన నటనతో కనపరుస్తాడు. చిరంజీవి చెల్లెల పాత్రలో సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ సన్నివేశాలలో కీర్తి సురేష్ తన నటన విశ్వరూపం చూపించు. హీరోయిన్ తమన్నాకు సినిమాలో అంత ప్రాధాన్యత లేదు ఆమె పాత్ర సాగింది. గెటప్ శ్రీను, తాగుబోతు రమేష్, సత్య, వెన్నెల కిషోర్ కామెడీ అక్కడక్కడా నవ్విస్తుంది. సాంకేతికంగా ఈ సినిమా ఉన్నత ప్రమాణాలతో కనిపిస్తుంది. మహతి స్వరసాగర్ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదనిపిస్తాయి. హీరోగా చిరంజీవి తన వైపు నుండి పూర్తి న్యాయం చేసిన గాని డైరెక్షన్ దెబ్బతినడంతో “భోళా శంకర్” బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్ల పడింది అని చెప్పవచ్చు.

పాజిటివ్ పాయింట్స్:
చిరంజీవి నటన, డాన్స్.
నిర్మాణ విలువలు.
సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్.
మైనస్ పాయింట్స్:
డైరెక్షన్.
రోటీన్ స్టోరీ.
సాగదీత సన్నివేశాలు.
ఫస్టాఫ్.