NewsOrbit
రివ్యూలు

రివ్యూ

బ్యాన‌ర్‌: మ‌ధుర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్
న‌టీన‌టులు:  ఆనంద్ దేవ‌ర‌కొండ‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, క‌న్న‌డ కిశోర్‌, విన‌య్ వ‌ర్మ‌, `ఫిదా` శ‌ర‌ణ్య త‌దిత‌రులు
స‌మ‌ర్ప‌ణ‌:  డి.సురేష్‌బాబు
సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి
ఎడిటర్   : నవీన్ నూలి
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
ఆర్ట్ డైరెక్టర్ : జెకె మూర్తి
కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని
నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని
రచన, దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్రత్రం:  దొర‌సాని

ఈ మ‌ధ్య ఎంట్రీ ఇచ్చిన యువ హీరోల్లో ప్రేక్ష‌కుల‌కు బాగా ఆస‌క్తి రేపిన పేరు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. ప్రేక్ష‌కుల్లో ఇంత ఆస‌క్తి రావ‌డానికి కార‌ణం అతని సోద‌రుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ క్రేజీ స్టార్ త‌మ్ముడిగా ఆనంద్ సినీ రంగ ప్ర‌వేశం చేశాడు. ఎంతైనా త‌న రూట్ త‌న‌దే అనుకున్నా స్టార్టింగ్‌లో అన్న ఇమేజ్ ఎఫెక్ట్ త‌మ్ముడిపై ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. అలాగే మ‌రోవైపు సినీ రంగంలో ఇప్ప‌టికే త‌మ‌కంటూ ఓ స్థానాన్ని క్రియేట్ చేసుకున్న జీవిత‌, రాజ‌శేఖ‌ర్ దంపతుల రెండో కుమార్తె శివాత్మిక రాజ‌శేఖ‌ర్ డెబ్యూ కూడా ఈ సినిమాతోనే కావ‌డం మ‌రో విశేషం. మ‌రి ఈ ఇద్ద‌రిపై ఉన్న అంచ‌నాల‌తో రూపొందిన `దొర‌సాని` సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏ మేర ఆక‌ట్టుకుందో తెలుసుకోవాలంటే సినిమా క‌థేంటో తెలుసుకుందాం.

క‌థ‌:
తెలంగాణ‌లోని ఓ ప‌ల్లెటూరికి చెందిన కుర్రాడు రాజు(ఆనంద్ దేవ‌ర‌కొండ‌) చ‌దువుకోవ‌డానిక‌ని అమ్మ‌మ్మ వాళ్లు ఊరికి వ‌స్తాడు. అప్ప‌టికే ఊరి దొర‌(విన‌య్‌వ‌ర్మ‌) భార్య‌.. పెద్ద దొర‌సాని చ‌నిపోయి ఉంటుంది. అంద‌రూ ఆమె కూతురు చిన్న దొర‌సానిని దేవ‌కి(శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌) ముద్దుగా పెంచుకుంటారు. ఊరి జ‌నాల‌కు ఆమెతో మాట్లాడాలంటే భ‌యం. కార‌ణం ఆమె దొర బిడ్డం. అలాంటి త‌రుణంలో రాజు, ఆమెను ప్రేమిస్తాడు. క్ర‌మంగా ఆమె కూడా రాజుని ప్రేమిస్తుంది. వీరి ప్రేమ విష‌యం తెలిసిన దొర‌.. రాజుని పోలీసుల సాయంతో చంపించాల‌నుకుంటాడు. అయితే న‌క్స‌లైట్ నాయకుడు శంక‌ర‌న్న వారి ప్రేమ‌కు సాయం చేస్తాడు. ఆ క్ర‌మంలో పోలీస్ స్టేష‌న్ నుండి రాజుని త‌ప్పిస్తాడు.రాజు, దొర‌సాని క‌లిసి హైద‌రాబాద్ వ‌చ్చేస్తారు. రాజుతో క‌లిసి దొరసాని త‌న అన్న‌య్య ఇంటికి చేరుకుంటుంది. మ‌రి అక్క‌డ ప‌రిస్థితులేంటి?  రాజు, దేవ‌కిల ప‌రిస్థితేంటి? అనే విష‌యం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:
ప్రేమ‌క‌థ‌ల‌ను ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా తెర‌కెక్కించ‌డం అంటే చూపించే స‌న్నివేశాల‌ను కొత్త‌గా చూపించే ప్ర‌య‌త్నం చేయ‌డమే తొలి ప్ర‌య‌త్న‌మ‌ని చెప్పాలి. అందులో ద‌ర్శ‌కుడు కె.వి.ఆర్ మ‌హేంద్ర సినిమాను తెలంగాణ నేప‌థ్యంలో తెరకెక్కించాల‌ని అనుకోవ‌డ‌మే ప్ల‌స్ అయ్యింది. 1980 స‌మ‌యంలో తెలంగాణ‌లో గ‌డీ నేప‌థ్యం.. తెలంగాణ యాస‌.. ప్రేమ‌కు బాస‌ట‌గా నిలిచిన అప్ప‌టి న‌క్స‌లిజం  ఇవ‌న్నీ సినిమాలో ప్రేక్ష‌కుడికి ఆస‌క్తిని రేపే అంశాలే. సినిమాలో కొత్త‌వారే న‌టించినా, సినిమా నేచుర‌ల్‌గా ఉన్న‌ట్లు అనిపిస్తుంది. పేద‌వాడైన రాజు పాత్ర‌లో ఆనంద్ దేవ‌ర‌కొండ ఒదిగిపోయాడు. తొలి సినిమాలోనే న్యూడ్ సీన్ చేయ‌డానికి ఆనంద్ అంగీక‌రించాడంటే అత‌ని క‌మిట్‌మెంట్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక శివాత్మిక ఎక్స్‌ప్రెష‌న్స్‌తోనే పాత్ర‌కు ప్రాణం పోసింది. ఇక నక్స‌లైట్ నాయ‌కుడిగా కిశోర్ పాత్ర‌కు వంద శాతం న్యాయం చేశారు. ప్ర‌శాంత్ విహారి సంగీతం సినిమాలో స‌హ‌జత్వానికి మ‌రింత ప్రాణం పోసింది. స‌న్నికూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ ప్లస్ పాయింట్‌. ద‌ర్శ‌కుడు మ‌హేంద్ర ఎంచుకున్న నేప‌థ్యం బావుంది. చాలా క్లారిటీతో సినిమాను తెర‌కెక్కించాడు.
చివ‌ర‌గా.. ప్రేమ‌కు ఎప్పుడూ అడ్డుగా ఉండే కుల‌మ‌తాల‌పై ద‌ర్శ‌కుడి మ‌రో కోణ‌మే `దొర‌సాని`
రేటింగ్‌: 3/5
author avatar
Siva Prasad

Related posts

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar

Leave a Comment