NewsOrbit
న్యూస్ రివ్యూలు సినిమా

Gaali Sampath Review : ‘ గాలి సంపత్ ‘ మూవీ రివ్యూ

Gaali Sampath Review : యువ కథానాయకుడు శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్ ప్రముఖ పాత్రలుగా సక్సెస్ దర్శకుడు అనిల్ రావిపూడి స్క్రిప్ట్ అందించిన చిత్రంగాలి సంపత్’. అనీష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అచ్చు ఈ సినిమాకి సంగీత సారధ్యం వహించాడు. అనిల్ రావిపూడి స్క్రిప్ట్ అందించడమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షకుడిగా కూడా వ్యవహరించాడు. సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం

 

Gaali Sampath Review movie
Gaali Sampath Review movie

పాజిటివ్ లు

  • ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ నటన గురించి అతిముఖ్యంగా చెప్పుకోవాలి. ‘నటకిరీటిఅన్న తన బిరుదు తగ్గట్లు రాజేంద్రప్రసాద్ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచారు.
  • అచ్చు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. కామెడీ సీన్లకు మంచి క్రేజీ మ్యూజిక్ ఇచ్చిన అచ్చు…. ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న సీన్లలో అయితే తన టాలెంట్ మొత్తం బయట పెట్టేసాడు.
  • కామెడీ విషయానికి వస్తే…. సత్య ప్రదర్శన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ మధ్య మంచి టైమింగ్ తో స్టార్ కమెడియన్ గా ఎదుగుతున్న సత్య ఈ సినిమా ద్వారా మరిన్ని ఆఫర్లు అందుకుంటాడు. రాజేంద్రప్రసాద్ తో అతని కామెడీ సన్నివేశాలు థియేటర్లో నవ్వుల తెప్పిస్తాయి.
  • సినిమా మొదటి అర్ధ భాగం లో ఉన్న స్ట్రాంగ్ స్టోరీ లైన్ ప్రధాన బలం. బాగా రసవత్తరంగా తెరకెక్కించిన ఫస్ట్ హాఫ్ వల్ల ప్రేక్షకులకు సెకండాఫ్ పైన మంచి ఆసక్తి వస్తుంది.

నెగటివ్ లు

  • ఈ సినిమాకు ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ ఒక రకంగా అవసరం లేదనే చెప్పాలి. అయితే ఆ ఉన్న ఫ్లాష్బ్యాక్ కూడా పెద్దగా కథకు ఉపయోగపడలేదు. ఉన్న రెండు గంటల సినిమా లోనే ఈ ఎపిసోడ్ ప్రేక్షకులకు బోర్ కొట్టించేస్తుంది.
  • స్క్రీన్ ప్లే కూడా చాలా రొటీన్ గా ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా నేపథ్యంలో జరిగే కథకు అవసరమైన స్క్రీన్ప్లే ను అనిల్ రావిపూడి సమకూర్చలేకపోయారు.
  • సినిమాకి ముఖ్యమైన ఎమోషనల్ కనెక్టివిటీ కూడా ప్రేక్షకులకి లభించలేదు. కథలో బలం ఉన్నప్పటికీ రాజేంద్రప్రసాద్, శ్రీ విష్ణు మధ్య జరిగే ఎమోషనల్ సీన్లు మరింత మెరుగ్గా ఉండాల్సింది.
  • చిత్రం రెండవ అర్ధ భాగం మొత్తం చప్పగా సాగుతుంది. తన స్ట్రాంగ్ జోనర్ అయిన కామెడీ ని పక్కన పెట్టి అనిల్ రావిపూడి తొలిసారి సస్పెన్స్ డ్రామా వైపు మళ్లితే అది కాస్త పూర్తిగా బెడిసికొట్టింది. రెండవ అర్ధ భాగం మొత్తం థియేటర్లలో జనాలు నీరసపడిపోతారు.

Gaali Sampath Review – కథ :

సంపత్ (రాజేంద్రప్రసాద్) కు గతంలో జరిగిన ఒక ఘోరమైన ఆక్సిడెంట్ కారణంగా అతని స్వరపేటిక దెబ్బతింటుంది. ఇక తను మాట్లాడేటప్పుడు..’ అనే సౌండ్ తప్ప మాటలు బయటికి రావు. అందుకే అప్పటి నుండి అతనికి ఊరి వారంతాగాలి సంపత్అని పేరు పెట్టారు. తన వైకల్యాన్ని కూడా పట్టించుకోకుండా సంపత్ ఎప్పటికైనా ఒక మంచి నటుడు కావాలి అనే తన కల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతను చేసే విశ్వప్రయత్నాల వల్ల అతడి కొడుకు సూరి (శ్రీ విష్ణు) చిక్కుల్లో పడతాడు. చివరికి సంపత్ చేసిన తప్పు వల్ల అతను ప్రాణంగా ప్రేమించిన సిరితో ప్రేమ వివాహం కూడా రద్దు అవుతుంది. దీంతో తండ్రి మీద కోపంతో అతనిని వదిలేస్తాడు. ఇటువంటి సమయంలో ఒకరోజు సంపత్ తన ఇంటి వెనకాల ఉండే లోతైన గోతిలో పడి పోతాడు. అతను మాట్లాడితే కేవలం గాలి బయటకు వస్తుంది కాబట్టి సహాయం అడగలేని పరిస్థితి. ఇంతలోనే వర్షం. మరి సంపత్ ఆ గోతి నుండి బయటపడగలడాలేదా? అనేదే మిగిలిన కథాంశం.

విశ్లేషణ :

కమర్షియల్ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడైన అనిల్ రావిపూడితొలిసారి సస్పెన్స్ థ్రిల్లర్ ను ట్రై చేశాడు. కాన్సెప్టు బలమైంది అయినప్పటికీ ఈ సినిమాలో రావిపూడి థ్రిల్లర్ జోనర్ లో అనుభవలేమి వల్ల బాగా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్ అద్భుతమైన నటన కనబరిచినప్పటికీ నరేషన్ విషయంలో దర్శకుడు తడబడ్డాడు. రెండవ అర్ధ భాగంలో ఆసక్తికర స్క్రీన్ ప్లే రాయడం లో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి. క్యారెక్టర్లకు, ఎమోషన్స్ కు ప్రేక్షకులు అసలు కనెక్ట్ కాలేరు. మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ దానిని ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించే విషయంలో దర్శకులు భారీగా విఫలమయ్యారు.

Gaali Sampath Review – ఇంతకీ చూడొచ్చా..? మొదటి అర్ధ భాగంలో ఉండే కామెడీ రాజేంద్ర ప్రసాద్ నటన తప్పించిసినిమాలో పెద్దగా చెప్పుకోవాల్సిన అంశాలు లేవు. ఈ సినిమా ఓటిటి లో వచ్చే వరకు ఆగితే బెటరేమో….

Related posts

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri