కరోనా తర్వాత థియేటర్లు పూర్తిస్థాయిలో మూతపడగా… ఓటిటి ప్లాట్‌ఫామ్స్ అన్నీ చిన్న బడ్జెట్ సినిమాలకు తోడుగా నిలుస్తున్నాయి. థియేటర్లలో ఇవి ఎంతవరకూ కలెక్షన్లు సాధిస్తాయని తెలియదు కానీ ఓటిటి లో మాత్రం మంచి లాభాలను చవిచూసాయి. అయితే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం చాలా శాతం విఫలమయ్యాయనే చెప్పాలి. తాజాగా ఓటిటి ఫ్లాట్‌పామ్ ద్వారా విడుదలైన చిన్న బడ్జెట్ సినిమా ‘గతం’. అమెరికాలోని కొంతమంది టెకీ లు కలిసి నిర్మించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలైంది. ఇక ఈ చిత్రం విషయానికి వస్తే…
కథ :
రిషి (రాకేష్) ఒక యాక్సిడెంట్ లో తన గతాన్ని మరచి పోతాడు. అతనికి క్రిటికల్ బ్రెయిన్ డ్యామేజ్ ప్రాబ్లం వస్తుంది. అతని అలనా పాలనా అతని గర్ల్ ఫ్రెండ్ అదితి (పూజిత) చూసుకుంటూ ఉంటుంది. ఒక రోజు రిషి, అదితి… రిషి వాళ్ళ నాన్న ను కలిసేందుకు వెళ్తుంటే మధ్యలో కార్ ట్రబుల్ ఇస్తుంది. ఇక అప్పుడే అర్జున్ (భార్గవ్) వారిద్దరిని కిడ్నాప్ చేసి ఒక ఇంటిలో బంధిస్తాడు. అసలు వారిద్దరిని అతను కిడ్నాప్ చేయవలసిన అవసరం ఏమిటి…? రిషి గతం ఏమిటి అన్నది సినిమా.
ప్లస్ లు
విజువల్స్
సౌండింగ్
ఉత్కంఠభరితమైన కొన్ని సన్నివేశాలు
భార్గవ్ పర్ఫార్మెన్స్
మైనస్ లు
అదే పాతచింతకాయ థ్రిల్లర్
బోరింగ్ స్క్రీన్ ప్లే
డైరెక్షన్
సన్నివేశాల్లో సరిపడా థ్రిల్ లేకపోవడం
విశ్లేషణ
థ్రిల్లర్ సినిమాకు రాకేష్, భార్గవ్, పూజిత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే డైరెక్టర్ కిరణ్ మాత్రం సబ్జెక్ట్‌ను చాలా సింపుల్ గా స్ట్రైట్ గా తీయడం పెద్దగా ఆకట్టుకోలేదు. మొదటి 20 నిమిషాలు మంచి సస్పెన్స్ తో మొదలైన కథ తర్వాత ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు వచ్చేటప్పటికి ఫ్లో కోల్పోతుంది. ఇక మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు అయితే చాలా ఊహించదగినవి ఇంకా సంబంధం లేకుండా ఉంటాయి. మేకింగ్ విషయంలో సక్సెస్ అయిన కిరణ్ నరేషన్ లో మాత్రం బాగా ఇబ్బంది పడ్డాడు. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, సౌండింగ్ కొద్దిగా సినిమాను నిలబెట్టాయి. శ్రీ చరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది కానీ కేవలం గంటా 42 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా కి లాగ్ అనేది కూడా పెద్ద మైనస్ అని చెప్పాలి
చివరి మాట : గతం గతః
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!