హాలీవుడ్ చిత్రాల్లో యాక్షన్ సినిమాలు, వార్ సినిమాలు, యానిమేషన్ చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే వీటితో పాటు విఎఫ్ఎక్స్ ద్వారా అతిపెద్ద జీవచ్చరాలను క్రియేట్ చేసి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తీశారు. జురాసిక్ పార్క్, కింగ్ కాంగ్, గాడ్జిల్లా వంటి ఎన్నో తరహా చిత్రాలను ప్రముఖ సంస్థలు నిర్మించాయి. ఇప్పుడు వార్నర్ బ్రదర్స్ నిర్మాణంలో ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్‘ చిత్రం విడుదల కాబోతుంది. 2021 సంవత్సరంలోనే రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. అది ఎలా ఉందో చూద్దాం…
ముందుగా కింగ్ కాంగ్ గొరిల్లా జాతికి చెందిన అతి పెద్ద జంతువు అని అందరికీ తెలిసిందే. దాదాపు కొన్ని వందల అడుగుల ఎత్తు తో పాటు అతి భయంకరమైన ఆకారంలో ఉండే కింగ్ కాంగ్ పైన ఎన్నో చిత్రాలు వచ్చాయి. అలాగే నీళ్ళ లో నివసించే మరో కల్పిత జీవచ్చరం గాడ్జిల్లా పైన కూడా చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య సమరాన్ని చూపిస్తూ విడుదల చేసిన ట్రైలర్ లో ఒక గాడ్జిల్లా సముద్రం లో విధ్వంసం సృష్టించిన తర్వాత ప్రపంచ నగరాల పైన మనుషులని నాశనం చేసేందుకు వస్తుంది.
దాని పైన హెలికాప్టర్లు, యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు ఎన్ని దాడులు చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇక మానవులకు తమ ఉనికిని కాపాడుకునేందుకు ఉండే ఒకే ఒక్క ఆశ ‘కింగ్ కాంగ్’ అని చెబుతారు. ఈ కింగ్ కాంగ్ ని గాడ్జిల్లా తో యుద్ధం చేయించేందుకు వారికి ఒక చిన్న పాప సహాయం చేస్తుంది. ఆ చిన్న పాపకి ఈ కింగ్ కాంగ్ కు ఉన్న రిలేషన్ ఏమిటి? అతి భయంకరమైన గాడ్జిల్లా ను కింగ్ కాంగ్ ఎలా ఎదుర్కొంటుంది దాని బారి నుండి మానవులని కాపాడుతుందా లేదా అన్నదే చిత్ర కథాంశం అని ట్రైలర్ లో అర్థమైంది.
ట్రైలర్ లో ఒళ్ళు గగ్గుర్పొడిచే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. సముద్రంలో గాడ్జిల్లా పైకి ఎన్నో క్షిపణులు, బాంబులు వేసినా కూడా అది నౌకలను యుద్ధ విమానాలను నాశనం చేస్తూనే ఉంటుంది. ఇక కింగ్ కాంగ్…. గాడ్జిల్లా లాంటి శక్తివంతమైన జీవచ్ఛవాన్ని ఎదుర్కొనే విధానం లో రూపొందించిన ఫైట్లు థియేటర్లలో ప్రేక్షకుల చేత కచ్చితంగా విజిల్స్ వేస్తాయి. రెండు భారీ జీవచ్చరాలు పోరాడుతుంటే మిగతా ప్రపంచం మొత్తం చాలా చిన్నదిగా కనిపిస్తుంది.
గాడ్జిల్లా తన నోటి నుండి నిప్పు జ్వాలని వదిలే తీరు, నగరాలని క్షణాల్లో నాశనం చేసే విధానం చూస్తుంటే ఎవరికైనా భయం వేస్తుంది. అటువంటి భయంకరమైన గాడ్జిల్లా తో దాదాపు మనిషిని పోలి ఉండే ఆకారంలో ఉండే ఉండే కింగ్ కాంగ్ మనుషుల కోసం చేసిన పోరాట సన్నివేశాలు బాగా మెప్పించాయి. మొత్తానికి ఎంతో అద్భుతంగా కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు తారాస్థాయికి పెంచేసిందనే చెప్పాలి.