18.7 C
Hyderabad
January 29, 2023
NewsOrbit
న్యూస్ రివ్యూలు సినిమా

India Lockdown Movie Review: ఆసక్తి రేకెత్తించి తుస్సుమనిపించిన ‘ఇండియా లాక్‌డౌన్’ మూవీ.. శ్వేతా బసు ప్రసాద్ కోసం ఓసారి చూడొచ్చు!

Share

India Lockdown Movie Review: కరోనా సమయంలో అకస్మాత్తుగా ఇండియాలో అమలు చేసిన లాక్‌డౌన్ వల్ల ప్రజల జీవితాలు తలకిందులయ్యాయి. అయితే ఆ సమయంలో ప్రజలు ఎంతగా ఎఫెక్ట్ అయ్యారో కళ్ళకు కట్టి చూపించేందుకు డైరెక్టర్ మధుర్ భండార్కర్ ‘ఇండియా లాక్‌డౌన్’ అనే సినిమా రూపొందించాడు. హిందీ భాషలో తీసిన ఈ మూవీ 2022, డిసెంబర్ 2న ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉంది? ఇది చూడదగిన సినిమానా, కాదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

India Lockdown Movie Review: సినిమా కథ ఏంటి

India Lockdown Movie Review

ఇండియా లాక్‌డౌన్ మూవీలో లాక్‌డౌన్ తర్వాత వివిధ నగరాల్లో చిక్కుకున్న తండ్రి-కూతురు, ఒక సెక్స్ వర్కర్.. ఆమె కష్టాలు, వనరులు లేని వలస కార్మికుడు, ఒక ఎయిర్‌హోస్టెస్.. ఇలా ఫోర్ డిఫరెంట్ స్టోరీస్‌ను ఎమోషనల్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ మధుర్ భండార్కర్.

మూవీలో ప్లస్, మైనస్ ఏంటి

India Lockdown Movie Review

ఈ సినిమాలో లాక్‌డౌన్ తర్వాత, వలస కార్మికులు, సెక్స్ వర్కర్ల పరిస్థితి ఎంత దుర్భరంగా మారిందో బాగా చూపించారు. ఆ సన్నివేశాలు చూస్తున్నప్పుడు ఎవరైనా సరే కాస్త ఎమోషనల్ అవ్వాల్సిందే. నిజానికి రెండేళ్ల క్రితం ప్రజలు బాధపడ్డారు. మళ్లీ ఇప్పుడు పరిస్థితి నార్మల్ అయిపోయింది. అందువల్ల ఈ మూవీ కాస్త ఔట్‌డేటెట్‌గా అనిపించవచ్చు. ఇక లాక్‌డౌన్ సమయంలో చాలా నేషనల్ మీడియా సంస్థలు అందరి సిట్యుయేషన్లను దాదాపు కవర్ చేశాయి. వాటినే ఈ డైరెక్టర్ మరింత ఎమోషనల్‌గా తీశాడు. అంటే ప్రేక్షకులకు కొత్తగా ఆఫర్ చేసేందేమీ లేదు కాబట్టి ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. దానికి తోడు ఈ మూవీ ఒక డాక్యుమెంటరీ లాగా ఉంటుంది. సో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనేది అంతగా ఆకట్టుకోలేదు. దీనివల్ల సినిమాలో ఇన్వాల్వ్ కావడానికి కాస్త కష్టంగా అనిపిస్తుంది. అలానే సినిమాలో కొన్ని సన్నివేశాలు అస్సలు చూడాలనిపించదు.

చూడాలా వద్దా

India Lockdown Movie Review

2 గంటల 33 నిమిషాల నిడివి గల ఇండియా లాక్‌డౌన్ మూవీలో ప్రేక్షకుడిని బాగా లీనమయ్యేలా చేసే ట్విస్టులు గానీ సర్‌ప్రైజింగ్ సీన్స్ గానీ ఎక్కడా కనిపించవు. ఇందులో నటీనటుల పర్ఫామెన్స్ మాత్రం చాలా బాగుంది. ఈ మూవీలో శ్వేతా బసు ప్రసాద్ వేశ్య మెహ్రూగా అద్భుతంగా నటించింది. అప్పుడప్పుడు కొన్ని జోక్స్ కూడా వేస్తూ ఆమె ఈ సినిమాలో కాస్త ఎంటర్టైన్ పంచింది. చాలా రోజుల తర్వాత ఆమె వేసినా మంచి రోల్ చూడాలనుకుంటే ఈ మూవీ ని ఒకసారి చూడొచ్చు. అలానే అహనా కుమ్రా, ప్రతీక్ బబ్బర్, సాయి తంహంకర్, ప్రకాష్ బెలవాడి తమ క్యారెక్టర్లలో ఒదిగిపోయారు.

India Lockdown Movie Review

దాదాపు మూడేళ్ల క్రితం లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఎలా బాధలు పడ్డారో, సెక్స్ వర్కర్ జీవితం ఎంత దయనీయంగా మారిందో, వలస కార్మికుల కష్టాలు ఏంటో, ఇంకా సామాన్యుల జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ సినిమా ఒకసారి కచ్చితంగా చూడొచ్చు. అదే మీరు ఆల్రెడీ ఈ సమస్యలను తెలుసుకొని ఉంటే ఈ సినిమా చూడాల్సిన అవసరం లేదు.


Share

Related posts

National Green Tribunal: రాయలసీమ లిఫ్ట్ పనులు చేపడితే సీఎస్ ను జైలుకు పంపుతామంటూ ఎన్జీటీ హెచ్చరిక..!!

somaraju sharma

దేశంలో ఉన్నత దాత..! నాలుగు భాషల్లో సినిమా.., ఈ కథ తెలుసుకోవాల్సిందే..!!

bharani jella

childrens: పిల్లలకు దిష్టి దోషాలు ఉన్నాయి అని అనిపిస్తే.. వారిచే పక్షులకు  వీటిని పెట్టించండి !!!!

siddhu