NewsOrbit
Featured న్యూస్ రివ్యూలు సినిమా

Jathi Ratnalu review : ‘జాతిరత్నాలు’ మూవీ రివ్యూ

Jathi Ratnalu review : నవీన్ పోలిశెట్టి హీరోగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలోఫరీదా అబ్దుల్లా హీరోయిన్ గా నటించినజాతిరత్నాలుసినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుదీప్ కె.వి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం అతి భారీ ప్రీరిలీజ్ హైప్ సంపాదించింది. ‘చిట్టిసాంగ్ వైరల్ కావడం…. అత్యద్భుతమైన ప్రమోషన్స్ తో బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం థియేటర్లలో ఎలా ఉందో చూద్దాం

 

Jathi Ratnalu review
Jathi Ratnalu review

 

పాజిటివ్ లు

  • ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి నటన నిజంగా హైలెట్ ఒక స్మాల్ టౌన్ కుర్రాడిగా సమాజంలోని ఎంతో మంది యూత్ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్లో నవీన్ అద్భుతమైన నటన కనబరిచాడు. అతని కామెడీ టైమింగ్ సూపర్ అని చెప్పాలి.
  • అనుదీప్ కె.వి రైటింగ్ లో మంచి ప్రతిభ కనబరిచాడు. ట్రెండింగ్ పంచ్ లు…. నేటి తరానికి సరిపోయే కామెడీ లో తన రచన చక్కగా ఉంది.
  • సినిమా ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ ఆధారంగా నడుస్తుంది. చాలామంది కుర్రాళ్ళకి ఈ కామెడీ ఈజీగా కనెక్ట్ అవుతుంది/ సినిమా మొత్తం మంచి ఫ్లో లో ఎక్కడా బోర్ కొట్టకుండా ముందుకు వెళుతుంది.
  • మొదటి అర్ధ భాగంలోకథ ఒక్క చోట కూడా ఫ్లాట్ లైన్ నుండి పక్కకు వెళ్ళలేదు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు.

నెగటివ్ లు

  • సినిమాలో రచన బాగున్నప్పటికీ ఈ కథకు నిడివి ఎంతో తగ్గించవచ్చు. అనవసరంగా సినిమాను ఎక్కువ టైమింగ్ తో తీసారు అని అనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకా మెరుగుపడవచ్చు.
  • క్లైమాక్స్ కు వచ్చేసరికి సినిమా డల్ అయిపోతుంది. మొదటి అర్ధ భాగంలో ఇచ్చిన కిక్ రెండవ భాగంలో ప్రేక్షకులకు దొరకదు. పైగా మూవీ ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ఈ సినిమాకు పెద్ద మైనస్.
  • కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాలో లాజిక్ లు ఆశించడం అత్యాశ అయినప్పటికీ ఈ సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలు మరీ ఘోరంగా ఉంటాయి. అసలు కనీస రియాలిటీకి దగ్గరగా లేకుండా కేవలం కథను ముందుకు నడిపించడం కోసం ఏ సంబంధం లేకుండా వస్తాయి.

Jathi Ratnalu review : కథ 

నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి జీవితంలో ఎదగడానికి హైదరాబాద్ వస్తారు. బేసిక్ గా నిర్లక్ష్యపు కుర్రకారుని సూచించే విధంగా ఉండే వీరి క్యారెక్టర్లు అనుకోని పరిస్థితుల్లో ఇబ్బందుల్లో పడతాయి. లోకల్ ఎమ్మెల్యే అయిన మురళీ శర్మ ను చంపడానికి వీరు ముగ్గురూ మర్డర్ చేసేందుకు ప్రయత్నించారని వీరిపై కేసు నమోదు చేసి జైల్లో వేస్తారు. అసలు ఈ మర్డర్ కేసులో వీళ్ళు ఎలా చిక్కుకున్నారు..? చివరికి ఈ జాతిరత్నాలు జైలు నుండి బయటపడ్డారాలేదా…. అనేదే మిగిలిన కథ.

Jathi Ratnalu review : విశ్లేషణ 

మొదటి అర్ధ భాగం ఎంతో బాగా మంచి ఫ్లో లో కొనసాగిపోతుంది. ముగ్గురు హీరోలు అద్భుతంగా నటించారు. వీరిలో నవీన్ పోలిశెట్టి నటన మేజర్ హైలైట్. మొదట్లో అంతా కామెడీ సీన్లతో సినిమా అలా వెళ్ళిపోతుంది. ఇక రెండవ అర్ధ భాగంలో కి వచ్చేసరికి కామెడీ మీద అతి శ్రద్ధ పెట్టి కథను పక్కదారి పట్టించాడు దర్శకుడు. కనీస సీరియస్ నెస్ డిమాండ్ చేసే సన్నివేశాలను కూడా కామెడీ పరంగా చిత్రీకరించి దర్శకుడు తప్పు చేశాడు. అది ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ కి వచ్చేసరికి ప్రేక్షకులకు పూర్తి లాజిక్ లెస్ గా అనిపిస్తుంది. ఇక చివర్లో వచ్చే నవ్వులు సినిమాను కొద్దిగా పైకి లేపుతాయి. అయితే మొత్తానికి ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎటువంటి కొదవ ఉండదు.

ఇంతకీ చూడొచ్చా? – యూత్ ‘జాతిరత్నాలు’ సినిమాను విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. టైంపాస్ గా హాయిగా నవ్వుకోవడానికి అయితే వెళ్ళొచ్చు తప్ప పెద్ద కథేం ఉండదు. ఇక మిగిలిన ఆడియన్స్ మాత్రం ఒకసారి చూడవచ్చు.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri