NewsOrbit
రివ్యూలు

`జెర్సీ` రివ్యూ

 

 

సినిమా: జెర్సీ
తారాగ‌ణం: నాని (అర్జున్‌), సారా (శ్ర‌ద్ధా శ్రీనాథ్‌), స‌త్య‌రాజ్ (మూర్తి), రావు ర‌మేష్ (లాయ‌ర్‌), ప్ర‌వీణ్ (ఫ్రెండ్‌), సంప‌త్ రాజ్ (కోచ్‌) త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: `మ‌ళ్లీ రావా` ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి
సంస్థ‌: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
నిర్మాత‌: సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ
సంగీతం: అనిరుద్‌
పాట‌లు: కెకె
కెమెరా: సాను వ‌ర్గీస్‌
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
రిలీజ్ డేట్: 19.04.2019
నానికి నేచుర‌ల్ స్టార్ అని పేరు. ఎలాంటి క‌థ‌లో అయినా ఇట్టే ఇమిడిపోయి న‌టిస్తాడ‌ని అత‌న్ని అంద‌రూ అలా పిలుస్తారు. తాజాగా `జెర్సీ` ట్రైల‌ర్‌లో అత‌ని న‌ట‌న చూస్తే వంద శాతం క‌రెక్టే అనిపిస్తుంది. మ‌రి ఆ న‌ట‌న సినిమాలో ఇంకే రూపంలో ఉంటుంది? ఇంకెంత బాగా న‌టించాడు నాని… అనేది అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించే విష‌యం. దాంతో పాటు రియ‌ల్ లైఫ్‌లోనూ తండ్రి అయిన నాని, రీల్ లైఫ్‌లో తండ్రిగా మెప్పిస్తారా లేదా? `మ‌ళ్లీరావా`తో సుమంత్‌కు హిట్ ఇచ్చిన గౌత‌మ్ తిన్న‌నూరి ఈ సారి ఎమోష‌న్స్ ప్ర‌ధానంగా అల్లుకున్న `జెర్సీ`ని ఎలా చూపించారు?… ఆల‌స్య‌మెందుకు `జెర్సీ` రివ్యూ మీకోస‌మే.
క‌థ
చిన్న‌ప్ప‌టి నుంచి క్రికెటే ప్ర‌పంచంగా పెరిగిన వ్య‌క్తి అర్జున్ (నాని). అత‌నికి అసిస్టెంట్ కోచ్ మూర్తి (స‌త్య‌రాజ్‌) అండ‌దండ‌లుంటాయి. ఇండియ‌న్ క్రికెట్ టీమ్‌తో స‌హా… ఎక్క‌డా అర్జున్ అంత బాగా ఆడే ప్లేయ‌ర్‌ను చూడ‌లేద‌ని అంటాడు మూర్తి. రంజీ ట్రోఫీల్లో అంత పేరు తెచ్చుకున్న అర్జున్ పేరు ఇండియ‌న్ టీమ్‌కి వెళ్లే షార్ట్ లిస్ట్ లో ఉండ‌దు. దాంతో విర‌క్తి చెందిన అత‌ను వెంట‌న క్రికెట్ నుంచి క్విట్ అవుతాడు. ఫుడ్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా జాయిన్ అవుతాడు. అక్క‌డో స‌మ‌స్య వ‌చ్చి ఉద్యోగం నుంచి ప‌క్క‌కు జ‌ర‌గాల్సి వ‌స్తుంది. అప్ప‌టి నుంచి భార్య సంపాద‌న మీదే అంతా న‌డుస్తుంది. కొడుకు పుట్టిన‌రోజుకు గిఫ్ట్ కొనాల్సి వ‌చ్చిన‌ప్పుడు మాత్రం త‌న ప‌రిస్థితి అత‌నికి బాగా అర్థ‌మ‌వుతుంది. దాంతో మ‌ళ్లీ బ్యాట్ ప‌డ‌తాడు. ఆ బ్యాట్ అత‌ని జీవితాన్ని ఏ మలుపులు తిప్పింది? అత‌ను కోరిన స్థాయికి తీసుకెళ్లిందా? లేదా? అనేది ఆస‌క్తిక‌రం
ప్ల‌స్ పాయింట్లు
– నాని, శ్ర‌ద్ధ‌, రోణ‌క్‌, విశ్వంత్ న‌ట‌న‌
– అనిరుద్ నేప‌థ్య సంగీతం
– భావోద్వేగాలు
– కెమెరా
– లొకేష‌న్లు
మైన‌స్ పాయింట్లు
– అర్థం ప‌ర్థం లేని హీరో మౌనం
– సాగ‌దీత‌గా ఉన్న ఫ‌స్టాఫ్‌
– క‌న్విన్సింగ్‌గా లేని కొన్ని సీన్స్
– కొన్ని వేస్ట్ సీన్లు

విశ్లేష‌ణ‌
ఈ సినిమాలో న‌టీన‌టుల ప‌నిత‌నం బావుంది. ద‌ర్శ‌కుడు బాగా తీశాడు. వెండితెర‌మీద లావిష్‌గా క్రికెట్‌ను చూపించారు. టీమ్ ప‌డ్డ కృషి తెర‌మీద క‌నిపిస్తూనే ఉంది. కానీ క‌థ‌లోనే కొన్ని లాజిక్కులు మిస్ అయిన‌ట్టు అనిపిస్తుంది. హీరో ఎంత‌గానే ప్రేమించిన క్రికెట్ కాద‌నుకుని ఉద్యోగంలో చేరుతాడు. అక్క‌డ స‌స్పెన్ష‌న్ వేటు ప‌డ్డ త‌ర్వాత కేవ‌లం భార్య మీదే ఆధార‌ప‌డ‌తాడు. ఇంకే ఉద్యోగానికీ ప్ర‌య‌త్నించ‌డం. కొడుక్కి గిఫ్ట్ కొన‌డానికి రూ.500 లేక‌పోతే వాళ్ల‌నీ వీళ్ల‌నీ అడ‌గ‌డానికి నామోషీ ప‌డ‌డు కానీ, అసిస్టెంట్ కోచ్‌గా చేయ‌డానికి మాత్రం ఎందుకో విముఖ‌త చూపిస్తాడు. ఒక‌వేళ అత‌నికి నిజంగా కొడుకు మీద అంత ప్రేమే ఉంటే, ఉద్యోగంలో ఎందుకు చేర‌డు అనేది మ‌రో ప్ర‌శ్న‌. జీవితంలో అత్యంత ఆనంద‌క‌ర‌మైన క్ష‌ణాలు అత‌నికి క‌నిపించిన‌ప్పుడు కొడుకు హ‌త్తుకోవాలి, భార్య‌తో పంచుకోవాలే గానీ, ఖైర‌తాబాద్ రైల్వేస్టేష‌న్‌లో రైలు చ‌ప్పుడు అవుతున్నంత సేపు అర‌వాల్సిన అవ‌స‌రం ఏంటో అర్థం కాదు. ఇలాంటి లాజిక్కులు ప‌క్క‌న‌పెట్టి, కేవ‌లం ఎమోష‌న్స్ మాత్రం కేల్కిలేట్ చేసి చూస్తే జెర్సీ బావుంది. ర‌క‌ర‌కాల కాలాల‌ను చూపించిన తీరు బావుంది. తండ్రి పాత్ర‌లో నాని, త‌ల్లిగా సారా మెప్పించారు. వాళ్లిద్ద‌రూ ల‌వ‌ర్స్ గా ఉన్న‌ప్పుడు స‌న్నివేశాల‌ను కూడా చ‌క్క‌గా తెర‌కెక్కించారు. దీనికి తోడు కెమెరా ప‌నిత‌నం, రీరికార్డింగ్ బావున్నాయి. అక్క‌డ‌క్క‌డా డైలాగులు కూడా బావున్నాయి. స‌మ్మ‌ర్‌లో చూసేయొచ్చు జెర్సీని. ఎప్పుడూ టీవీల్లోచూసే క్రికెట్‌ని కాసేపు వెండితెర‌మీద కూడా చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది.
రేటింగ్‌: 2.75
బాట‌మ్ లైన్‌: జెర్సీ… ఎమోష‌న‌ల్ మూవీ

author avatar
Siva Prasad

Related posts

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar

Saindhav Review: విక్టరీ వెంకటేష్ కెరియర్ లో 75వ చిత్రం “సైంధవ్” మూవీ రివ్యూ..!!

sekhar

Guntur Kaaram Review: పుష్కరకాలం తర్వాత త్రివిక్రమ్ మహేష్ కలయికలో వచ్చిన మూవీ.. “గుంటూరు కారం” సినిమా ఫుల్ రివ్యూ..!!

sekhar

Hanuman Review: సంక్రాంతి ఫస్ట్ హిట్..థియేటర్ లో హనుమాన్ భక్తులకు పూనకాలే.. “హనుమాన్” మూవీ రివ్యూ..!!

sekhar

Salaar: ప్రభాస్ అభిమానుల ఆకలి తీర్చిన ప్రశాంత్ నీల్.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట “సలార్” మూవీ రివ్యూ..!!

sekhar

Dunki Review: 2023 షారుక్ ఖాన్ దే.. రెండు యాక్షన్స్ తో బ్లాక్ బస్టర్స్…ఇప్పుడు ఎమోషన్ తో హ్యాట్రిక్..”డంకీ” సినిమా రివ్యూ..!!

sekhar

Leave a Comment