33.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit
రివ్యూలు సినిమా

జ్యోతిక  ’36 వయసులో’ ట్రైలర్ రివ్యూ…!

Share

కోలీవుడ్ హీరోయిన్ జ్యోతిక ప్రధానపాత్రలో నటించిన 36 వయసులో చిత్రం యొక్క తెలుగు ట్రైలర్ యూట్యూబ్లో తాజాగా రిలీజ్ అయింది. రోషన్ అండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళం చిత్రం అయినా హౌ ఓల్డ్ ఆర్ యు చిత్రానికి రీమేక్. జ్యోతి భర్త, ప్రముఖ సినీ నటుడు అయిన సూర్య తన సొంత బ్యానర్ అయిన 2D ఎంటర్టైన్మెంట్ మీద ఈ ప్రాజెక్ట్ ను నిర్మించగా…. సంతోష్ నారాయణ్ బాణీలు సమకూర్చారు. ఇకపోతే ఈ సినిమా ని తెలుగు లో 24వ తేదీన అల్లు అరవింద్ కు చెందిన ఆహా యాప్ లో చూడవచ్చు

 

ఓటిటి ప్లాట్ఫామ్ లో రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రేక్షకులంతా సరదాగా ఇంట్లో కూర్చొని కుటుంబంతో కలిసి చూసేందుకు సరైన మెటీరియల్ గా చెప్పవచ్చు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే మధ్య వయస్కురాలైన జ్యోతిక ఎప్పటిలాగే తన పాత్రలో ఒదిగిపోయింది. ఈ చిత్రంలో జ్యోతిక యొక్క పాత్ర ద్వారా మధ్య వయసులో ఉన్న ఆడవారు కూడా తమ కలలను సాకారం చేసుకునేందుకు ఆస్కారం ఉంటుందని వారికి కావాల్సిందల్లా కొద్దిగా స్ఫూర్తి మరియు తోడుగా ఉండే వ్యక్తులు అని చెప్పడం జరిగింది.

ఈ ట్రైలర్లో జ్యోతిక ఎప్పటిలాగే అద్భుతంగా నటించగా ఆమెకు తోడుగా మంజు వారియర్ ప్రముఖ పాత్రలో నటించనుందని తెలుస్తోంది. రెహమాన్, అమ్ము అభిరమి, ఢిల్లీ గణేశన్ కూడా ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలు చేశారు. ఇంతకీ జ్యోతి లక్ష్యం ఏమిటి…? దాని కోసం ఎన్ని కష్టాలు పడింది? చివరికి వాటిని ఎలా సాధించింది…? తన వయసులో ఉన్న మిగిలిన వారికి ఎలా స్ఫూర్తినిచ్చింది….? అన్న విషయాలు తెలుసుకోవాలంటే 24 వ తేదీన ఆహా యాప్ ఓపెన్ చేయాల్సిందే.

 


Share

Related posts

ఇద్ద‌రితో తేజ్ పోటీ

Siva Prasad

RRR: “ఆర్ఆర్ఆర్” కలెక్షన్ పై కేంద్రమంత్రి వైరల్ కామెంట్స్..!!

sekhar

pushpa 2: `పుష్ప 2`లో న‌టించాల‌నుందా..? అయితే ఇదిగో బిగ్ ఆఫ‌ర్‌!

kavya N