కరోనా లాక్ డౌన్ తర్వాత కీర్తి సురేష్ వరుసగా తన రెండవ చిత్రాన్ని ఓటిటి ప్లాట్ఫామ్ నేపథ్యంలో విడుదల చేసింది. నరేంద్రనాథ్ అనే నూతన దర్శకుడి దర్శకత్వం లో ఉమెన్ ఎంపవర్మెంట్ కాన్సెప్ట్ మీద తెరకెక్కిన ఆ చిత్రం నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ ద్వారా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇక సినిమా విషయానికి వస్తే…
కథ :
మానస సంయుక్త (కీర్తి సురేష్) లంబసింగి, వైజాగ్ లో జన్మించిన యువతి. ఆమెకు చిన్నప్పటి నుండి మంచి వ్యాపారవేత్త అనిపించుకోవాలని ఒక కల ఉండేది. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆమె ఉద్యోగంలో చేరింది. తన ఉద్యోగం పట్ల అసంతృప్తి లేకపోవడంతో ఉద్యోగాన్ని వదిలేసి అమెరికాలో ఒక టీ తయారీ కంపెనీ స్థాపించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని నిర్ణయించుకుంది. అయితే ఆమెకు పోటీగా ఉండే మరొక కంపెనీ కీర్తి సురేష్ కంపెనీ ఎదుగుదలకు అడ్డుకట్ట వేస్తుంది. ఇలాంటి ఛాలెంజింగ్ సమయంలో ఆమె ఒత్తిడికి ఎదురొడ్డి నిలబడిందా లేదా అన్నదే మిగిలిన కథాంశం..!
ప్లస్ లు :
కీర్తి సురేష్
తమన్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం
సుజిత్ అందించిన విజువల్స్
మైనస్ లు :
కథ
చాలా ఆర్డినరీ స్క్రీన్ ప్లే
వీక్ ఎమోషన్స్
ఎక్కువ నిడివి ఉండే రన్ టైం
విశ్లేషణ :
పెంగ్విన్ తర్వాత కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ వంటి చిత్రం ద్వారా మళ్లీ పుంజుకుంటుంది అని అందరూ ఆశించారు. అయితే మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తీసుకున్నప్పటికీ దానిని వర్కౌట్ చేయడంలో డైరెక్టర్ ఘోరంగా విఫలమయ్యాడు అనే చెప్పాలి. స్క్రీన్ ప్లే అయితే ప్రేక్షకులకు మరింత విసుగు తెప్పిస్తుంది. అక్కడక్కడ హై మొమెంట్స్ ఉన్నప్పటికీ చివరాకరికి బోరింగ్ ఫీలింగ్ తెప్పిస్తుంది. మొదటి అర్ధ భాగంలో నడిపించిన లవ్ స్టోరీ అయితే కథకు సంబంధం లేకుండా ఉంది. ఒక క్యారెక్టర్ ను ప్రజలకు తెలియజేయడం లో…. ఎమోషనల్ కనెక్టివిటీ అందిండంలో కూడా పరిపూర్ణత పూర్తిగా లోపించింది. ప్రొడక్షన్ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నప్పటికీ వాటిని మ్యాచ్ చేసే కథ దర్శకుడి వద్ద లేకపోవడం చాలా పెద్ద దెబ్బ.
చివరి మాట : ‘బిగ్ మిస్’ ఇండియా…