21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
Entertainment News రివ్యూలు సినిమా

The Ghost Movie Review: నాగార్జున “ది ఘోస్ట్” సినిమా రివ్యూ..!!

Share

The Ghost Movie Review: సినిమా పేరు: “ది ఘోస్ట్”
దర్శకుడు: ప్రవీణ్ సత్తార్
నటీనటులు: అక్కినేని నాగార్జున, సోనాలి చౌహాన్, గుల్ పంగ్, అనీఖా సురేంద్రన్.. తదితరులు.
సంగీతం: మార్క్ కే రాబిన్, భరత్ సౌరబ్
విడుదల తేదీ: 05-10-2022

ఇంట్రడక్షన్:

కింగ్ నాగార్జున వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ యాడాదిలో రెండు సినిమాలు విడుదల చేయడం జరిగింది. బంగార్రాజు, బ్రహ్మాస్త్రం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున నేడు దసరా పండుగ నేపథ్యంలో “ది ఘోస్ట్”తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తరుకెక్కిన ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాలి చౌహాన్ హీరోయిన్ గా నటించింది. ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో నాగార్జున నటించిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం..

King Nagarjuna The Ghost Movie Review
The Ghost Movie Review
కథ:-

 

ఇంటర్ పోల్ ఆఫీసర్ లుగా విక్రమ్ (నాగార్జున), ప్రియా(సోనాలి చౌహాన్) తూర్పు అరేబియాలో పనిచేస్తుంటారు. పై అధికారులు వీళ్ళిద్దరికీ ఎటువంటి ఆపరేషన్ అప్పజెప్పిన ఏమాత్రం ఫెయిలవ్వకుండా అద్భుతంగా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో విక్రం మరియు ప్రియా లీవ్ ఇన్ రిలేషన్ లో ఉంటారు. కానీ అనూహ్యంగా వీరిద్దరూ కలిసి చేపట్టిన ఓ ఆపరేషన్ ఫెయిల్ అవుద్ది. ఆపరేషన్ లో ఇండియన్ ఫ్యామిలీకి చెందిన ఓ పిల్లాడిని టెర్రరిస్టులు అతికిరాతకంగా చంపేస్తారు. దీంతో ఎంతో మనస్థాపానికి గురై విక్రమ్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ఇక ఇదే సమయంలో ప్రియా తన మాట విక్రమ్ వినటం లేదని ముంబైలో ఎన్సీబీలో జాయిన్ అవుద్ది. దాదాపు 5 సంవత్సరాలు పాటు వీరిద్దరూ కూడా ఒకరితో మరొకరు మాట్లాడుకోరు. కానీ అనూహ్యంగా అను (గుల్ పనాగ్) నుండి విక్రమ్ కి ఫోన్ వస్తది. తన జీవితం మరియు కూతురు లైఫ్ రిస్క్ లో ఉందని తెలియజేస్తది. కొంతమంది చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు విక్రమ్ దృష్టికి తీసుకురావడం జరుగుద్ది. దీంతో వెంటనే హుటాహుటిన విక్రమ్ ఊటీలో ఉన్న అను దగ్గర ల్యాండ్ అవుతాడు. అప్పటినుండి అను ఆమె పాప యొక్క భద్రతను దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. అను కుటుంబానికి విక్రమ్ ఒక సెక్యూరిటీగా ఉంటాడు. అసలు విక్రమ్ కి అనుకి ఉన్న సంబంధం ఏమిటి..? ఉద్యోగానికి రాజీనామా చేసి సైలెంట్ గా ఉన్న విక్రం ఒక్కసారిగా అను ఫోన్ కాల్ కి అంతా ప్రతిస్పందించడానికి కారణం ఏమిటి..? అనుకి  విక్రమ్ కి అసలు సంబంధం ఏమిటి..? విక్రమ్ నీ వదిలేసి వెళ్లిపోయిన ప్రియా మళ్ళీ అతన్ని ఎలా కలుసుకుంది..? ఈ మొత్తం తెలుసుకోవాలంటే “ది ఘోస్ట్” సినిమా చూడాల్సిందే.

King Nagarjuna The Ghost Movie Review
The Ghost Movie Review
విశ్లేషణ:-

గత ఏడాది యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన “వైల్డ్ డాగ్” లో నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్ పాత్ర చేయడం తెలిసిందే. “వైల్డ్ డాగ్” కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. కానీ అదే తరహా ఫ్లేవర్ కలిగిన “ది ఘోస్ట్”లో ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో నాగార్జున అద్భుతంగా నటించారు. పైగా సినిమా స్టోరీని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో దర్శకుడు ప్రవీణ్ సత్తార్ నడిపించిన విధానం అద్భుతమని చెప్పవచ్చు. నాగార్జున- సోనాలి చౌహాన్ మధ్య రొమాన్స్ సీన్స్…  ఇంకా అనుతో వచ్చే సన్నివేశాలను కుటుంబ ప్రేక్షకులను అలరించే రీతిలో ఉన్నాయ్. మరోపక్క విలన్ లను నాగ్ మట్టుపెట్టే రీతిలో చూపించిన విధానం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకొనేవిధంగా ఉన్నాయి. ఇలా మూడు రకాలుగా నాగార్జునని ఒకే సినిమాలో… అందరికీ నచ్చేలా చూపించారు. కార్పొరేట్ క్రైమ్ తరహాలో రొటీన్ యాక్షన్ త్రిల్లర్ లాగా కాకుండా కొత్తరకంగా “ది ఘోస్ట్” లో రకరకాల అంశాలను జోడించి అద్భుతంగా ప్రోజెక్ట్ చేశారు. యాక్షన్స్ సన్నివేశాలలో నాగార్జున మరోసారి చెలరేగిపోయారు. ఈ వయసులోనూ నాగార్జున ఫుల్ ఫీట్ గా ఉన్నారని “ది ఘోస్ట్” సినిమా నిరూపించింది. అక్కినేని అభిమానులను ఆకట్టుకునే రీతిలో నాగార్జున బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యే రీతిలో యాక్షన్ సీన్స్ తో  పాటు రొమాంటిక్ సన్నివేశాలు జోడించడం సినిమాకి ప్లస్ అయ్యింది. అదేవిధంగా ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో సెంటిమెంట్ సన్నివేశాలకి కూడా స్క్రిప్ట్ లో పెద్దపీట వేశారు. ఇక లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అందరిని ఆశ్చర్యపరుస్తది. ముఖ్యంగా గ్లామర్ డాల్ ఇమేజ్ కలిగిన సోనాలి చౌహాన్ .. యాక్షన్ సన్నివేశాలలో చెలరేగిపోయింది. అను పాత్రలో గుల్ పనాగ్, కూతురు పాత్రలో అనిఖా సురేంద్రన్ తగిన న్యాయం చేశారు. మొత్తంగా చూసుకుంటే “ది ఘోస్ట్” అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన సినిమా అని చెప్పవచ్చు.

King Nagarjuna The Ghost Movie Review
The Ghost Movie Review
సినిమా ప్లస్ పాయింట్స్:-

సినిమా బ్యాక్ డ్రాప్
యాక్షన్ సన్నివేశాలు
నాగార్జున లుక్

 

మైనస్ పాయింట్స్:-

హీరో క్యారెక్టరైజేషన్
రొటీన్ ఫ్లాష్ బ్యాక్
స్టార్టింగ్ ఓపెనింగ్ సన్నివేశాలు

రేటింగ్: 3.5/5
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Share

Related posts

అల్లుళ్లు బాగా నవ్వించారు

Siva Prasad

ఇద్ద‌రు కాదు.. ఒక‌రే!

Siva Prasad

Nandita swetha : డైరెక్టర్లు నన్ను నమ్మితే చాలు… ఎంతో సంతృప్తిగా ఉంటుందన్న.. నందితా శ్వేత..!

Teja