NewsOrbit
Entertainment News రివ్యూలు

Meter Movie Review: కిరణ్ అబ్బవరం “మీటర్” మూవీ రివ్యూ విశేషాలు..!!

Share

Meter Movie Review: రమేష్ కదూరి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా మీటర్ ఏప్రిల్ ఏడవ తారీఖు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా విశేషాలు ఏమిటో ఒకసారి లుక్కెద్దాం.

మూవీ పేరు: మీటర్
నటీనటులు: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి, ధనుష్ పవన్
నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు
దర్శకుడు: రమేష్ కదూరి
సినిమా నిడివి: రెండు గంటలు ఏడు నిమిషాలు.
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
విడుదల తేదీ: ఏప్రిల్ 7

పరిచయం:

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ ఉంటాడు. 2019 రాజావారు రాణి గారు చిత్రంతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్… మొదటి సినిమాతోనే పరవాలేదు అనిపించుకున్నారు. ఆ తర్వాత వినరో భాగ్యము విష్ణు కథ మూవీతో ప్రేక్షకులను అలరించడం జరిగింది. కాగా తాజాగా ఏప్రిల్ 7వ తారీకు మీటర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాలో ఆతుల్య రవి హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ వంటి పెద్ద బ్యానర్ పై దర్శకుడు రమేష్ కదూరి తీసిన “మీటర్” మూవీ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం.

Kiran Abbavaram Meter Movie Review Highlights

సినిమా స్టోరీ:

వెంకటరత్నం నిజాయితీ గల ఓ కానిస్టేబుల్. దీంతో సహచరుల పోలీస్ అధికారులతో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ క్రమంలో తన కుమారుడు అర్జున్ కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) నీ పెద్ద పోలీస్ ఆఫీసర్ గా ఎస్సైగా చూడాలన్నది తండ్రి కోరిక. కానీ హీరోకు అసలు పోలీస్ జాబ్ అంటేనే ఇష్టం ఉండదు. అటువంటిది అనూహ్యంగా ఎస్ఐ జాబ్ కొట్టేస్తాడు. అయితే జాబ్ వచ్చినా గాని ఎప్పుడెప్పుడు మానేయాలా.. అనే ఉద్దేశంతోనే ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఊహించని విధంగా మంచి పోలీసు అధికారిగా డిపార్ట్మెంట్ లో గుర్తింపు పొందుతాడు. ఇదిలా ఉంటే అసలు అబ్బాయిలు అంటేనే ఇష్టం ఉండదు హీరోయిన్ ఆతుల్య రవికి. అటువంటి ఆమెతో హీరో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో హోం మంత్రితో హీరోకి గొడవ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అతడు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళిన సమయంలో పోలీస్ వ్యవస్థను విమర్శలకు గురి చేసే విధంగా వ్యవహరిస్తాడు. అయితే హోం మంత్రి వేసే ప్లాన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్సైగా ఉన్న అర్జున్ ఎలా చేదించాడు అన్నది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

రొటీన్ స్టోరీ నేపథ్యంలో సినిమా ఉండటంతో సన్నివేశాలను ముందుగానే ప్రేక్షకులు అంచనా వేయచ్చు. చిన్నప్పుడే కొడుకుని ఎస్ఐ అవ్వాలని అనటంతో తండ్రి కోరికను కాదనలేక పెద్దయ్యాక ఎస్సై జాబ్స్ ఇష్టం లేక నలిగిపోయే హీరో. ఈ క్రమంలో ఎస్ఐ అవ్వకుండా తొలి 15 నిమిషాలు సినిమాలో హీరో చేసే ప్రయత్నాలు కాస్త కామెడీ తెప్పిస్తాయి. ఆ తర్వాత హీరోయిన్ లవ్ ట్రాక్… అనంతరం ఎస్సై ఉద్యోగం నుండి డిస్మిస్ అయ్యేందుకు అర్థం చేసే ప్రయత్నాలు అలాగా స్లోగా సినిమా తీసుకెళతాయి. సినిమా చూస్తున్నంత సేపు బలవంతంగా చూస్తున్నట్లు ఉంటది. కామెడీ సన్నివేశాలు కొన్ని చోట్ల మరి అతిగా ఉంటాయి. పేలని పంచ్ డైలాగులు ఇంకా అనవసరమైన ట్రాక్ .. సన్నివేశాలు సినిమాల్లో చాలానే ఉన్నాయి. ఇంకా విలన్ హీరో మధ్య జరిగే రివెంజ్ డ్రామా ఎపిసోడ్ కూడా పెద్దగా ఆసక్తిగా ఏమి ఉండదు. సినిమా ఒక్కసారిగా పైకి లెగుస్తుంది అని అనుకున్న టైములో మళ్లీ యధావిధిగా సినిమాని నడిపించడం దర్శకుడిగా రమేష్ కాదూరి చూసే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టాడు అన్న రీతిలో ఉంటది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ కారణంగా సినిమా మొత్తాన్ని నడిపించాలని డైరెక్టర్ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. యాక్షన్ సన్నివేశాలు ఎలివేషన్స్.. కిరణ్ ఇమేజ్ కి నుంచి ఉండటంతో చూసే ప్రేక్షకుడికి కాస్త అతిగా అనిపించింది. ఆ సందర్భమైన పాటలు మరియు యాక్షన్ ఎపిసోడ్స్ అసలు సినిమా స్టోరీకి పొంతన లేకుండా ఉన్నాయి. సినిమాలో సప్తగిరి ఇంకా పోసాని కృష్ణమురళి మధ్య వచ్చే సంభాషణ కాస్త కామెడీగా ఉంటాయి. హీరోయిన్ పాత్రకి కూడా పెద్దగా ఆస్కారం ఏమీ లేదు.

Kiran Abbavaram Meter Movie Review Highlights

ప్లస్ పాయింట్స్:

హీరో క్యారెక్టర్
విరామ సన్నివేశాలు.

మైనస్ పాయింట్స్:

రొటీన్ స్టోరీ
సెకండాఫ్
హీరో హీరోయిన్ లవ్ ట్రాక్
స్క్రీన్ ప్లే.

మొత్తంగా: “మీటర్” సినిమాలో పెద్ద మ్యాటర్ లేదని చెప్పవచ్చు.

Share

Related posts

Game Changer: చరణ్ బర్తడే నేపథ్యంలో శంకర్ సినిమా టైటిల్ ప్రకటించిన మేకర్స్..!!

sekhar

Avunu Valliddaru Ista Paddaru: మనోజ్ కాళ్లు పట్టుకొని నిజం చెప్పిన ఢిల్లీ.. మనోజ్ కళావతి కలుస్తారా..

bharani jella

హైదరాబాద్ లో ఫుల్ బిజీగా రజినీకాంత్..??

sekhar