NewsOrbit
రివ్యూలు సినిమా

Kshana Kshanam Review : ‘ క్షణ క్షణం ‘ సినిమా రివ్యూ

Kshana Kshanam Review : ఉదయ్ శంకర్, ‘అర్జున్ రెడ్డిఫేమ్ జియా శర్మ, రఘు కుంచె, రవి ప్రకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రంక్షణక్షణం‘. కార్తీక్ మేడికొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రోషన్ సాలుర్ సంగీతం అందించిన ఈ సినిమా చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసింది. అలాగే అల్లు అరవింద్ కి చెందినగీతా ఆర్ట్స్  వారు ఈ సినిమా ని డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై అంచనాలు కనీస పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం

 

Kshana Kshanam Review movie review
Kshana Kshanam Review movie review

Kshana Kshanam Review : కథ 

సినిమా మొత్తం వైజాగ్ లోనే సాగుతుంది. సత్య (ఉదయ్ శంకర్) ఒక అనాధ. అతను మరొక నాథ అయిన ప్రీతి (జియా శర్మ) ను పెళ్లి చేసుకుని చాలా సామాన్య జీవితం గడుపుతుంటాడు. అయితే ప్రీతికి డబ్బు అంటే పిచ్చి. సత్య సంపాదిస్తున్న సంపాదనతో ఆమె తృప్తి చెందదు. ఇలాగే వారిద్దరి మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. విడాకులు తీసుకునే ఆలోచనలో కూడా ఉంటారు. ఇలాంటి సమయంలోనే సత్య చేపల వ్యాపారం లో భారీగా నష్టపోతాడు. అప్పులు వచ్చి నెత్తిమీద కూర్చుంటాయి. దాని నుండి అతను బయట పడాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే ఒక డేటింగ్ యాప్ లో పెళ్లి అయిన అమ్మాయి మాయ (శృతి సింగ్) తో అతనికి పరిచయం అవుతుంది. అతనిని బాగా ఆకర్షించిన ఆమె ఒకరోజు ఇంటికి పిలిచి సరదాగా గడుపుదామని చెబుతుంది. అయితే సత్య ఆమె ఇంటికి వెళ్లేసరికి మాయ చనిపోయి ఉంటుంది. వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తాడు సత్య. వచ్చిన ఎస్సై కృష్ణ మనోహర్ (రవి ప్రకాష్) సత్య ను అనుమానించడం మొదలుపెడతాడు. ఇక చివరికి సత్య పరిస్థితి ఏమైంది…? అతను ఆ కేసు నుండి బయటపడగలడా? అతని దాంపత్య జీవితం నిలబడిందా? లేదా విడాకులతో ఆగిపోయిందా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే

ప్లస్ పాయింట్స్

ఒక ఫెయిల్యూర్ పర్సన్ పాత్రలో ఉదయ్ శంకర్ చక్కగా నటించాడు. ముఖ్యంగా అతని నిస్సహాయతను తెలిపే సీన్లలో…. మర్డర్ జరిగిన తర్వాత అతని నటన బాగా ఆకట్టుకుంటుంది. అర్జున్ రెడ్డి లో ఉన్న జియా శర్మ కూడా చాలా మంచి పాత్రలో నటించింది.

క్లైమాక్స్ లో జరిగే ట్విస్ట్ సినిమా మొత్తానికి మంచి హైలైట్ అని చెప్పాలి. సినిమా మొత్తంలో లో ఆ ఒక్క ట్విస్ట్ ఎంతో బాగా ఎలివేట్ అయ్యింది.

సీనియర్ సంగీత దర్శకుడు కోటి చేసిన లాయర్ పాత్ర కూడా బాగుంటుంది. రెండవ అర్ధ భాగం అక్కడక్కడ మంచి సన్నివేశాలతో పాటు రవిప్రకాష్, రఘు కుంచె పాత్రలు కూడా బాగానే క్లిక్ అయ్యాయి.

మైనస్ పాయింట్స్

సినిమా స్టోరీ లైన్ చాలా ఆర్డినరీ గా ఉంటుంది. అంత ఎక్సైటింగ్ గా ఉండే కథనం అయితే కాదు.

కథను ఎలా ఉన్నా దానిని చెప్పే విషయంలో దర్శకుడు భారీగా ఫెయిల్ అయ్యాడు.

మొదటి అర్ధ భాగం చాలా స్లోగా నడుస్తుంది. అలాగే క్యారెక్టర్లను ప్రేక్షకులకు పరిచయం పూర్తిగా చేసేందుకు కూడా దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు.

రెండవ అర్ధ భాగం అక్కడక్కడ పర్వాలేదనిపించిందిఅప్పటికీ మధ్యలో వచ్చే సాంగ్స్ స్పీడ్ బ్రేకర్ల లాగా ఉంటాయి. క్లైమాక్స్ ముందు మెయిన్ క్యారెక్టర్ లు అందరూ చాలా సిల్లీగా కథలోకి వచ్చేస్తారు.

Kshana Kshanam Review : విశ్లేషణ 

మొత్తంమీదక్షణ క్షణంఅని ఒక ఫేమస్ థ్రిల్లర్ కథ టైటిల్ పెట్టుకున్న ఈ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్ కలిగించడంలో ఘోరంగా విఫలమైంది. క్లైమాక్స్ ట్విస్ట్ మినహాయించి సినిమాలో చెప్పుకోవలసిన విషయం ఒక్కటి కూడా లేదు అంటే అతిశయోక్తి కాదు. కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేద్దాం అనే ఉద్దేశంతో సినిమా చూసే వాళ్ళు ఎంత తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అంత మంచిది.

చివరిగా : క్షణ క్షణం నరకం

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N