21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
రివ్యూలు సినిమా

Love Today Telugu Review: లవ్ టుడే తెలుగు రివ్యూ 4 స్టార్ రేటింగ్ అసాధారణ కథ కొత్త కాన్సెప్ట్ తో కిక్ ఇచ్చాడు ప్రదీప్.!

Love Today Movie Telugu review
Share

Love Today Telugu Review: లవ్ టుడే తెలుగు రివ్యూ…రొటీన్ సినిమాలను ప్రేక్షకులు దూరం పెడుతూ.. కంటెంట్ బాగుంటే చాలు.. కాన్సెప్ట్ బాగుంటే చాలు.. హీరోతో పనేలేదు సినిమాను ప్రేక్షకులు చూసి హిట్ చేస్తున్నారు.. అలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రమే లవ్ టుడే..! పైగా హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమాలు కూడా ఈ మధ్య బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి నిన్న కాంతార అయితే నేడు లవ్ టు డే.. తమిళంలో విడుదలైన ఈ సినిమా ఫన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తి ఘన విజయాన్ని అందుకుంది.. నేడు ఈ సినిమాను దిల్ రాజు తెలుగులో విడుదల చేశారు..! ఈ సినిమా కథ ఏంటి.! ఎందుకు ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారో ఇప్పుడు చూద్దాం.!

Love Today Telugu Review:  లవ్ టుడే తెలుగు రివ్యూ - నటీనటులు ఇవానా, ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan), రవీనా రవి- Love Today Cast, Love Today Telugu gets a positive review with a 4 star rating from NewsOrbit.
Love Today Telugu Review లవ్ టుడే తెలుగు రివ్యూ 8211 నటీనటులు ఇవానా ప్రదీప్ రంగనాథన్ Pradeep Ranganathan రవీనా రవి Love Today Cast Love Today Telugu gets a positive review with a 4 star rating from NewsOrbit

Love Today Telugu Review: లవ్ టుడే తెలుగు కథ

ఇదో సింపుల్ స్టోరీ లైన్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్), నికిత (ఇవాన) కు ఇంట్లో వాళ్ళకు తమ ప్రేమ గురించి చెప్పాల్సిన సమయం వచ్చేసింది ఎందుకంటే నికితకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు దాంతో వెంటనే తన తండ్రి తో మాట్లాడమని ప్రదీప్ ని ఆదేశిస్తుంది అయితే ఈ లోగా నికిత తండ్రి వేణు శాస్త్రి వీరి ప్రేమ విషయం తెలిసిపోతుంది దాంతో వేణుని ఇంటికి పిలిచి..

Love Today Telugu review: నటీనటులు ఇవానా, ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan), రవీనా రవి- Love Today Cast, Love Today Telugu gets a positive review with a 4 star rating from NewsOrbit.
Love Today Telugu review: నటీనటులు ఇవానా, ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan), రవీనా రవి- Love Today Cast, Love Today Telugu gets a positive review with a 4 star rating from NewsOrbit.

నేను మీ ప్రేమకు అడ్డం కానని కాకపోతే ఓ చిన్న కండిషన్ అని చెబుతాడు అదేమిటంటే ఒకరోజు ఇద్దరూ తమ ఫోన్స్ ను మార్చుకోవాలని చెబుతాడు దాంతో ఇద్దరూ భయపడతారు కానీ వేరే ఆప్షన్ లేక వేణు శాస్త్రి చెప్పిన కండిషన్కు ఓకే చెప్పి ఫోన్ మార్చుకుంటారు అలా ఫోన్స్ మారిన క్షణం నుంచి ఆ ప్రేమికుల జీవితాల్లో ఎలాంటి మార్పులు జరిగాయి ఒకరి గురించి మరొకరికి ఎలాంటి డార్క్ సీక్రెట్స్ తెలిసాయి చివరకు వారి ప్రేమ కథ ఎలా ఓ కొలిక్కి వచ్చింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

 

Love Today Telugu Review November 25th
Love Today Telugu Review November 25th

లవ్ టుడే లో ఇప్పటి యూత్ ఎలా ఉంటారు. ముఖ్యంగా సెల్ ఫోన్ వారి ప్రపంచం గా భావించే వారి గురించి సెటైర్లు వేస్తూనే.. కడుపుబ్బ నవ్వించాడు దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. ఈ కాలంలో మనిషి నిజస్వరూపం గురించి తెలుసుకోవాలంటే అతని పూర్తిగా పరిశీలించిన అక్కర్లేదు. అతడి సెల్ ఫోన్ ఒక్కటి స్టడీ చేస్తే చాలు మనిషి ముసుగు తొలగిపోతుందని దర్శకుడు ఈ చిత్రంతో పరోక్షంగా చెప్పాడు. ఇప్పటి యూత్ సోషల్ మీడియాను ఏ రేంజ్ లో వాడతారు సైబర్ క్రైమ్స్ ప్రభావం మనుషులపై ఎలా పడుతుంది అనే చిన్న చిన్న అంశాలను కూడా స్పృశించాడు. యూత్ పై సెల్ ఫోన్ ప్రభావం ఎలా ఉంటుందో కథ కథనం అంతా ఇప్పటికి రెండుకు తగ్గట్టుగానే తెరకెక్కించాడు ప్రదీప్.

Love Today Telugu Movie Review: లవ్ టుడే తెలుగు రివ్యూ
Love Today Telugu Movie Review: లవ్ టుడే తెలుగు రివ్యూ

ఈ చిత్రంలో ఎంత కామెడీ ఉంటుందో అదే స్థాయిలో ఎమోషన్స్ సీన్స్ కూడా పండించారు. ఫోన్ ఎక్స్చేంజ్ అనే కాన్సెప్ట్ చాలా సింపుల్ గా ఉన్న దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో.. ఈ సినిమాతో కళ్ళకు కట్టినట్లుగా చూపించిన తీరు ప్రశంసనీయం. ఇప్పటి బంధాలు, బంధుత్వాలు సెల్ ఫోన్ తో ఎలా మోడీపై ఉన్నాయో చూపించారు. సోషల్ మీడియాలో మెసేజ్లు అమ్మాయిలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో, సోషల్ మీడియా వేదికగా అమ్మాయి అబ్బాయి అప్రోచ్ అయ్యే విధానం ఆసక్తిగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్. మొత్తానికి ఈ సినిమాతో హీరోగా ప్రదీప్ రంగనాథన్ మంచి సక్సెస్ అందుకున్నారు అని చెప్పొచ్చు.

View this post on Instagram

A post shared by Ivana (@i__ivana_)

హీరోయిన్ గా ఇవానా ఈ కాలం అమ్మాయిలు ఎలా ఉంటారో.. తన నటనతో కళ్ళకు కట్టినట్లుగా చూపించి మెప్పించింది. ఈ సినిమాలో సీనియర్ నటులు సత్యరాజ్, రాధిక నటన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కాలం తల్లిదండ్రులు పిల్లలు తో ఎలా ఉంటారు వారు ఎదుర్కొంటున్న సమస్యలను తమ నటనతో పండించారు. యోగిబాబు , రవి వారవి కామెడీ హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ, వర్క్ ఆర్ట్ అన్ని సమపాలల్లో సరిపోయాయి. యువన్ శంకర్ తనాదైన స్టైల్ లో సంగీతం తో మెస్మరైజ్ చేశారు. ఫన్నీ ఎమోషనల్ సీన్లలో నేపద్య సంగీతంతో సూపర్ అనిపించాడు. మొత్తానికి లవ్ టుడే ఈ కాలం ఉన్న పరిస్థితులు, సోషల్ మీడియా వల్ల జరిగే నష్టాలు చెబుతూ నవ్విస్తూనే ఆలోచింపజేసే విధంగా చూపించారు దర్శకుడు.

Related Link: Love Today Actress Ivana Photo Story

Ivana Actress Photo Story: These Cool and Casual Pictures of Ivana are ‘A Treat For Your Sour Eyes’

లవ్ టుడే తెలుగు రివ్యూ ఒక్క మాటలో చెప్పాలంటే..

గతంలో నువ్వేంటో చెప్పాలంటే నీ స్నేహితులు ఎవరో చెప్పమనేవారు.. ప్రెసెంట్ నువ్వేంటో నీ సెల్ ఫోన్, నీ బ్రౌజింగ్ హిస్టరీ చూస్తే చాలు నీ జీవిత చరిత్ర మొత్తం తెలుసుకోవచ్చు..


Share

Related posts

కూతుర్ని తలుచుకొని నాగబాబు ఎమోష‌న‌ల్ .. వైరల్‌గా మారిన పోస్ట్!

Teja

Nithya menen: నాకోసమే వాళ్ళందరూ వస్తారు..ఆ అవసరం నాకు లేదు..

GRK

పవన్ “వకీల్ సాబ్” సినిమా గురించి సంచలన కామెంట్స్ శృతి హాసన్..!!

sekhar