21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
రివ్యూలు సినిమా

Sarkaru Vaari Paata Review: మహేష్ “సర్కారు వారి పాట” రివ్యూ..!!

Share

Sarkaru Vaari Paata Review: మహేష్ “సర్కారు వారి పాట” రివ్యూ..!!

సినిమా పేరు : సర్కారు వారి పాట
నటీనటులు : మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిశోర్, సముద్ర ఖని, సుబ్బరాజు తదితరులు
దర్శకుడు : పరుశురాం
ప్రొడ్యూసర్ : నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట.
సంగీత దర్శకుడు: తమన్
రిలీజ్ డేట్ : 12 మే 2022.

Mahesh Babu Sarkaru Vaari Paata Review

పరిచయం :

మహేష్ బాబు ఫస్ట్ టైం కొద్దిపాటి క్రేజ్ కలిగిన డైరెక్టర్ పరుశురాం చెప్పిన స్టోరీ నచ్చడం సినిమా ఒకే చేయడం అందరికీ షాక్ కి గురి చేసింది.పైగా ప్రమోషన్ టైమ్ లో మరో “పోకిరి” అని చెప్పటంతో థియేటర్లకు అభిమానులు పోటెత్తుతున్నారు. సినిమాలో చాలా మాస్ లుక్ లో కనిపించడంతో పాటు ఉత్తరాది యాసలో మహేష్ డైలాగులు చెప్పడం సినిమా పై మరింత ఇంట్రెస్ట్ సామాన్య ప్రేక్షకులకు కూడా కలిగింది. ఫస్ట్ టైం సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా చేయడం జరిగింది. పైగా ఈ సినిమా నిర్మించిన 14 రీల్స్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మాతలు గతంలోనే మహేష్ తో దూకుడు, శ్రీమంతుడు చేయటంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది. దీంతో సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున జరిగాయి. ఇక ఇదే సమయంలో “సర్కారు వారి పాట” లోని కళావతి, పెన్నీ, మా మా మహేష్.. పాటలు, ట్రైలర్ అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. సో అని విధాలా చూసుకుంటే టైటిల్ ప్రకటించిన నాటి నుండి సినిమా ప్రమోషన్ ల వరకు అంతా పాజిటివ్ టాక్ తో SVPజర్నీ సాగుతూ ఎట్టకేలకు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదల కావడంతో సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

Mahesh Babu Sarkaru Vaari Paata Review
స్టోరీ:

మహేష్(మహేష్ బాబు) అమెరికాలో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు. తన దగ్గర అప్పు తీసుకున్న వారు ఎంతటి వారైనా సరే .. ఎక్కడున్నా సరే వాళ్ల దగ్గర నుంచి వడ్డీతో సహా వసూలు చేయడం మనోడి స్టయిల్. ఇక ఇదే సమయంలో ఎవరికి కూడా బ్యాక్ గ్రౌండ్ చూడకుండా మహేష్ అప్పు ఇవ్వడు. కానీ తొలిచూపులోనే మహేష్ కళావతి (కీర్తి సురేష్)పై మనసు పడటంతో.. అమెరికాలో ఉన్నత చదువు కోసం వచ్చిన కళావతికి అప్పు ఇవ్వటం జరుగుతుంది. కానీ కళావతి చదువుకోకుండా అక్కడ మధ్యానికి, జూదానికి బానిస అవుద్ది. ఈ క్రమంలో చదువు కోసం అంటూ మహేష్ బాబు దగ్గర డబ్బులు అప్పు తీసుకుని తన జల్సా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటది. కానీ కళావతి అబద్ధాలు ఆడుతున్నట్లూ… మహేష్ కి తెలిసిపోతుంది. పైగా తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గోటి.. వైజాగ్ లో ఉన్న తన తండ్రి రాజేంద్రనాథ్ (సముద్రఖని) దగ్గరికి పారిపోతది. దీంతో తాను కళావతికి ఇచ్చిన పది వేల డాలర్ల అప్పు వసూలు చేయడం కోసం.. ఇండియాకి వచ్చిన మహేష్.. కళావతికి ఇచ్చిన అప్పు పై ఫోకస్ చేయకుండా ఆమె తండ్రి రాజేంద్రనాథ్(సముద్ర ఖని) తనకి పదివేల కోట్లు ఇవ్వాలని కొత్త ట్విస్ట్ ఇస్తాడు..? ఇంతకీ ఇండియాలో ఉండే రాజేంద్రనాథ్..అమెరికాలో ఉన్న మహేష్ దగ్గర 10 వేల కోట్లు అప్పు ఎలా చేశాడు..? ఇంతకీ కళావతికి మహేష్ డబ్బులిస్తే రాజేంద్రనాథ్ దగ్గర మహేష్ పెద్ద అమౌంట్ వసూలు చేయడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాడు..? అంత డబ్బుని మహేష్ వసూలు చేసుకున్నాడా..? అసలు మహేష్ గతం ఏమిటి..? కళావతి తండ్రి రాజేంద్రనాథ్.. మహేష్ మధ్య అసలు ఏం జరిగింది..? ఈ విషయాలు తెలియాలంటే సినిమా తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

సినిమాలో మెయింటెన్ చేయలేకపోతున్నా… దూల తీరిపోతుంది అని మహేష్ డైలాగ్ చెప్పినట్టే.. గత సినిమాల కంటే మరింత గ్లామర్ యంగ్ గా “సర్కారు వారి పాట”లో మహేష్ కనిపించాడు. పోకిరి, ఖలేజా, దూకుడు సినిమాలో మహేష్ ఎనర్జీ ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ “సర్కారు వారి పాట”లో గత సినిమాలకంటే మహేష్ ఎనర్జీ డబుల్ త్రిబుల్ గా ఉంది. ఫుల్ జోష్ తో డైలాగులు, కామెడీ టైం పరంగా అన్ని రకాలుగా న్యాయం చేశాడు. ముఖ్యంగా డాన్స్ పరంగా గతంలో మాదిరిగా రొటీన్ స్టెప్ లు వేయకుండా …చాలా స్టైలిష్…రిథమిక్ గా భిన్నంగా ఫుల్ ఎనర్జీ తో స్టెప్పులు వేయడం సినిమాకి మరింత గ్లామర్ తీసుకొచ్చినట్లు అయింది. ఇక దర్శకుడి పనితనం గురుంచి చెప్పాల్సి వస్తే డైరెక్టర్ పరుశురాం ఒక చిన్న థీమ్ తో స్టోరీని అల్లటం.. మాత్రమే కాదు దాన్ని కంటిన్యూ చేస్తూ చివరిదాకా.. అద్భుతంగా స్క్రీన్ మీద చూపించారు. కమర్షియల్ కామెడీ ఎంటర్ టైనర్ గా.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే రీతిలో పబ్లిక్ కి మెసేజ్ ఇచ్చేలా స్టోరీని నడిపించారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ యధావిధిగా ఇటీవల వచ్చిన సినిమాలకు తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో.. ఎలా న్యాయం చేశాడో… అదే రీతిలో “సర్కారు వారి పాట”కి కూడా.. ది బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. ఇక పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా విడుదల కాకముందే.. అనేక రికార్డులు సృష్టించడం జరిగింది. ఆ రీతిగానే సినిమాలో పాటలు చిత్రీకరణ జరిగాయి. ఇక హీరోయిన్ కీర్తి సురేష్ గురించి చెబితే ఆమె నటించిన “మహానటి” ఒక జోనర్ అయితే… “సర్కారు వారి పాట” పూర్తిగా డిఫరెంట్. స్టోరీకి తగ్గ రీతిలో అన్ని విధాలుగా కీర్తి సురేష్ న్యాయం చేసింది. దూకుడు తరహాలోనే ఈ సినిమాకి కూడా వెన్నెల కిషోర్ కామెడీ.. ప్లస్ పాయింట్. ఇక విలన్ సముద్రకని మరోసారి తన యాక్టింగ్ తో.. స్క్రీన్ మీద చెలరేగిపోయారు. బడా బడా బాబులకు బ్యాంకులు అండగా ఉండటం.. అదే బ్యాంకులు పేదవారికి అప్పులిచ్చి సతాయించడం… స్టోరీలైన్ తో డైరెక్టర్ పరశురామ్ అద్భుతంగా తెరకెక్కించారు. ఓవరాల్ గా చూసుకుంటే జనాలకి మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలో “సర్కారు వారి పాట” నీ తెరకెక్కించి అన్ని రకాల ఎలిమెంట్స్ తో… అందరినీ ఎంటర్టైన్ చేయడం జరిగింది. చాలావరకు సినిమాకి మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు బాగా కనెక్ట్ అవుతారు. టోటల్ గా రెండు సంవత్సరాలు ఆకలి మీద ఉన్న మహేష్ ఫాన్స్ కి  “సర్కారు వారి పాట” ఫుల్ బొనాంజా.

ప్లస్ పాయింట్స్:

సినిమా స్టోరీ
మహేష్ గ్లామర్, స్టెప్ లు, డైలాగులు, ఫైట్స్
కామెడీ సన్నివేశాలు.
హీరో హీరోయిన్ కెమిస్ట్రీ

మైనస్ పాయింట్స్:

సెకండాఫ్ సాగదీసినట్లు ఉండటం.
అనవసరమైన కొన్ని సన్నివేశాలు.

థమన్ బ్యాక్ గ్రౌండ్  మ్యూజిక్

Mahesh Babu Sarkaru Vaari Paata Review

ఓవరాల్ :

చిన్నపాటి స్టోరీ లైన్ తో .. పబ్లిక్ కి మెసేజ్ … సినిమా చూసే ప్రేక్షకుడికి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్.. “సర్కారు వారి పాట”.


Share

Related posts

‘రూలర్‌’ ఓ మంచి ప్రయత్నం : నందమూరి బాలకృష్ణ

Siva Prasad

Dj tillu: 12 ఏళ్ల తర్వాత విజయం నన్ను వరించింది: DJ టిల్లు

Ram

సూర్య – మోహ‌న్‌బాబు… ట్విట్టర్‌లో!

Siva Prasad