NewsOrbit
రివ్యూలు

‘సరిలేరు నీకెవ్వరు’ రివ్యూ & రేటింగ్

స‌మ‌ర్ప‌ణ‌: శ‌్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ దిల్‌రాజు
బ్యాన‌ర్స్‌: జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
న‌టీన‌టులు: మహేశ్‌, ర‌ష్మిక మంద‌న్న‌, విజ‌య‌శాంతి, ప్ర‌కాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేశ్‌, స‌త్య‌దేవ్‌, పోసాని, సంగీత‌, హ‌రితేజ‌, సుబ్బ‌రాజు, అజ‌య్‌, వెన్నెల‌కిషోర్‌, ర‌ఘుబాబు, బండ్ల‌గ‌ణేశ్‌, ప‌విత్ర లోకేశ్, రోహిణి, త‌మ‌న్నా త‌దిత‌రులు
సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్
కెమెరా: ర‌త్న‌వేలు
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు
నిర్మాత‌: రామబ్ర‌హ్మం సుంక‌ర‌
ద‌ర్శ‌క‌త్వం: అనిల్ రావిపూడి
సెన్సార్‌: యు/ఎ
వ్య‌వ‌థి: 169 నిమిషాలు

క‌మ‌ర్షియ‌ల్ సినిమాలంటే ఆరు పాటలు, ఆరు ఫైట్స్ అనే దానికి మీనింగ్ నేటి సినిమా డైరెక్ట‌ర్స్ మార్చేస్తున్నారు. హీరో ఇమేజ్‌ను హైప్ చేస్తూనే ఏదైనా ఓ మంచి మెసేజ్‌ను తమ సినిమాలతో ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నేటి త‌రం ద‌ర్శ‌కులు. ప్రేక్ష‌కులు కూడా అలాంటి సినిమాల‌నే ఆద‌రిస్తున్నారు. దీంతో సూప‌ర్‌స్టార్స్ అంద‌రూ అలాంటి సినిమాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపుతున్నారు. ఇప్పుడు అలాంటి క‌మ‌ర్సియ‌ల్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌. ప‌టాస్‌, రాజాదిగ్రేట్‌, సుప్రీమ్‌, ఎఫ్ 2.. వంటి క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో వ‌రుస స‌క్సెస్‌ల‌ను సొంతం చేసుకున్న డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను డైరెక్ట‌ర్ చేశాడు. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగు సినిమాలు స‌రిగ్గా ఆడ‌వు అనే సెంటిమెంట్ ఉన్న నేప‌థ్యంలో.. ఈ సినిమాలో హీరో మ‌హేశ్‌ను ఆర్మీ ఆఫీస‌ర్‌గా చూపించిన అనిల్ రావిపూడి.. ఇన్నేళ్లు ఉన్న సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి స‌క్సెస్‌ను అందించాడా? లేదా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే ముందుగా క‌థ‌లోకి వెళ‌దాం..

క‌థ‌:
మేజ‌ర్ అజ‌య్ కృష్ణ‌(మ‌హేశ్‌) కాశ్మీర్‌లో డ్యూటీ చేస్తుంటాడు. త‌నొక అనాథ‌. అత‌ను ప‌నిచేసే రెజిమెంట్‌కి మ‌రో ఆఫీస‌ర్ వ‌స్తాడు. అత‌ని పేరు కూడా అజ‌య్‌(స‌త్య‌దేవ్‌). ఓ రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో అజ‌య్‌(స‌త్య‌దేవ్‌) గాయ‌ప‌డి కోమాలోకి వెళ్లిపోతాడు. అత‌ను చ‌నిపోతాడ‌ని డాక్ట‌ర్లు చెబుతారు. ఈ విషయాన్ని వాళ్ల ఇంట్లో వాళ్ల‌కి అర్థ‌మ‌య్యేలా చెప్పాల‌ని ఆర్మీ నిర్ణ‌యించుకుని అజ‌య్ కృష్ణ‌ను క‌ర్నూలు పంపుతుంది. చ‌నిపోయిన అజ‌య్ త‌ల్లి.. భార‌తి(విజ‌య‌శాంతి) ఓ మెడిక‌ల్ కాలేజ్ ప్రొఫెస‌ర్‌. చాలా నిజాయ‌తీగా ఉండే ఆమెను క‌లుసుకోవ‌డానికి కర్నూలు వ‌చ్చిన అజ‌య్ కృష్ణ‌కి భారతి, వాళ్ల కుటుంబం ప్ర‌మాదంలో ఉంద‌ని తెలుస్తుంది. మినిస్ట‌ర్ నాగేంద్ర‌(ప్ర‌కాశ్‌రాజ్‌) వాళ్ల‌ని చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటాడు. దాంతో అజ‌య్ వాళ్ల‌ని కాపాడ‌టానికి నిర్ణ‌యించుకుంటాడు. నాగేంద్ర‌కు ఎదురెళ‌తాడు. ఆ క్ర‌మంలో అజ‌య్ ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటాడు? భార‌తిని, ఆమె కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు. సంస్కృతి(ర‌ష్మిక‌) ఎవ‌రు? ఆమె అజ‌య్‌ను ఎందుకు ప్రేమిస్తుంది? చివ‌ర‌కు అజ‌య్ నాగేంద్ర ఏం చేశాడు? సంస్కృతి ప్రేమ స‌క్సెస్ అవుతుందా? లేదా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

ప్ల‌స్‌పాయింట్లు
– న‌టీన‌టుల పెర్ఫార్మెన్స్
– మ‌హేష్‌, విజ‌య‌శాంతి సీన్స్
– అక్క‌డ‌క్క‌డా కామెడీ
– క్లైమాక్స్ ఫైట్‌
– పాట‌లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌
– కెమెరా
నెగ‌టివ్ పాయింట్స్
– ఆర్మీ ఎపిసోడ్ ఇంకాస్త స్ట్రాంగ్‌గా ఉండాల్సింది
– స్క్రీన్‌ప్లే
– ముందే ఊహ‌కు అందే క‌థ‌
– క్లైమాక్స్ తేలిపోయిందివిశ్లేష‌ణ‌:
సాధార‌ణంగా క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌డం ఇప్ప‌టి ట్రెండ్‌లో క‌ష్ట‌మేన‌ని చెప్పాలి. ఎందుకంటే ఇప్ప‌టికే ఇలాంటి ఫార్మేట్స్‌లో చాలా సినిమాలే వ‌చ్చాయి. అందుక‌నే ప్రేక్ష‌కుడు కొత్త త‌ర‌హా సినిమాల‌ను చూడ‌టానికి ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్నాడు. అయితే యంగ్ టైగ‌ర్ అనిల్ రావిపూడి మాత్రం క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు ఆక‌ట్టుకునేలా తెర‌కెక్కిస్తున్నాడు. తొలి చిత్రం నుండి స‌రిలేరు నీకెవ్వ‌రు వ‌ర‌కు అనిల్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌నే చేశాడు. ప్ర‌తి సినిమా మంచి విజ‌యాన్నే సాధించింది. ఇప్పుడు మ‌హేశ్‌ను కూడా అలాంటి ఓ క‌మ‌ర్షియ‌ల్ పార్మేట్ సినిమాలోనే చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. దానికి ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌ను తీసుకున్నాడు. దేశం కోసం సైనికులు ప్రాణాలు ఇస్తుంటే.. ఇక్క‌డ మాత్రం స్వార్థ రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారు. అనే అంశాన్ని త‌న‌దైన స్టైయిల్లో తెర‌కెక్కించాడు. ఇక సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌కు ఉన్న ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మేజ‌ర్ అజ‌య్ కృష్ణ పాత్ర‌లో ఒదిగిపోయాడు. యాక్ష‌న్ సీన్స్‌లో అల‌రించ‌డ‌మే కాదు.. త‌న‌దైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాడు. ప్రాత‌ల మేన‌రిజంతో కామెడీ జ‌న‌రేట్ చేయ‌గ‌ల నేటి త‌రం ద‌ర్శ‌కుల్లో అనిల్ రావిపూడి ముందు వ‌రుస‌లో ఉన్నాడు. మ‌హేశ్ పాత్ర నుండి రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేశ్‌, ర‌ష్మిక‌, సంగీత, హ‌రితేజ, ఇద్ద‌రు పిల్ల‌లు, వెన్నెల కిషోర్‌, సుబ్బ‌రాజు, ప్ర‌కాశ్‌రాజ్‌, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి ఇలా ప్ర‌తి పాత్ర‌ను డిఫ‌రెంట్‌గా కామెడీ టింగ్‌తో తెర‌పై ఆస‌క్తిక‌రంగా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. త‌ద్వారా వ‌చ్చే కామెడీ ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తుంది. అయితే ఈ కామెడీ కొన్ని చోట్ల డ్రెమ‌టిక్‌గా అనిపిస్తుంది. బండ్ల గ‌ణేష్ కొద్ది సేపే తెర‌పై క‌నిపించిన‌ప్ప‌టికీ కామెడీతో న‌వ్వించాడు. ప్ర‌కాశ్ రాజ్ విల‌నిజాన్ని ప‌స్టాఫ్‌లో ప‌వ‌ర్‌ఫుల్‌గానే చూపించారు కానీ.. సెకండాఫ్‌లో దాన్ని క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌లోకామెడీ  చేసేశాడు.
సాంగ్స్ విష‌యానికి రెండు సాంగ్స్ మిన‌హా మ‌రో సాంగ్ ఏదీ ఆక‌ట్టుకోదు. బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ఎడిటింగ్ బావుంది. గాయం విలువ తెలిసిన‌వాడే సాయం చేస్తాడు.. నువ్వు మా అమ్మ‌నుండి తిట్ట‌డం స్టార్ట్ చేశావ్.. కానీ నేను నిన్ను ఏమీ అన‌లేదురా.. ఎందుకంటే నాకు మీ అమ్మ అంటే కూడా గౌర‌వ‌మే(టెర్ర‌రిస్ట్ ఉద్దేశించి).. అడ‌వాళ్లు చాలాగొప్ప‌వాళ్లు దేన్ని అయినా భ‌రిస్తారు. అందుకే దేశాన్ని అమ్మ‌తో పోల్చుతారు. …ఇలా కొన్ని డైలాగ్స్ బావున్నాయి. ఫ‌స్టాఫ్‌లో ట్రెయిన్ కామెడీ ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తుంది. ఇక సెకండాప్ ఎమోష‌న‌ల్‌గా సాగుతుంది. న‌ల్ల‌మ‌ల అడ‌వుల్లో ఫైట్ బావుంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.బోట‌మ్ లైన్‌:  సరిలేరు నీకెవ్వ‌రు…అభిమానుల‌కు బొమ్మ ద‌ద్ద‌రిల్లిపోద్ది
రేటింగ్‌: 3/5

author avatar
Siva Prasad

Related posts

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar

Leave a Comment