32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
ట్రెండింగ్ రివ్యూలు సినిమా

Nanpakal Nerathu: నన్పకల్ నేరతు సినిమా రివ్యూ తెలుగులో.. సినిమా హిట్టా.!? ఫ్లాపా.!?

Mammootty Nanpakal Nerathu Mayakkam review in Telugu
Share

Nanpakal Nerathu: మలయాళ సూపర్ స్టార్ ముమ్ముట్టి నటించిన లేటెస్ట్ చిత్రం నన్పకల్ నేరతు.. ఈ సినిమాకి 27వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ కేరళలో ప్రపంచ ప్రీమియర్ గా 2023 లో అత్యధికంగా వేచి చూస్తున్న సినిమాలలో ఇది కూడా ఒకటి.. జనవరి 19 2023న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైంది.. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని లిజో జోస్ పెల్లిసరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడ్రుదలైన ప్రీమియర్ షో నుంచి మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

Mammootty Nanpakal Nerathu Mayakkam review in Telugu
Mammootty Nanpakal Nerathu Mayakkam review in Telugu

కథ.. నన్పకల్ నేరతు మయాక్కం తమిళ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. వేలాంకన్ని నుండి తిరిగి వెళ్ళేటప్పుడు మా అన్నయ్యని థియేటర్ ఆర్టిస్ట్ సమూహాన్ని తీసుకువెళ్లే బస్సు వారిలో ఒకరు జేమ్స్ వెళతాడు. ఈ సినిమాలో మమ్ముట్టి బస్ లో ఓ ప్రయాణికుడిలా కనిపిస్తాడు .. నన్పకల్ నేరతు మయాక్కామా నుండి వేలాంకన్ని కేరళ వరకు వెళ్తున్న బస్ లో మధ్యలో ముమ్ముట్టి  మేల్కొన్న వెంటనే తమిళనాడులో ఒక గ్రామానికి వెళ్లే మార్గాన్ని చెప్పి డ్రైవర్ ను అక్కడికి తీసుకు వెళ్ళమని అడుగుతాడు. అతను కొంతకాలం క్రితం తప్పిపోయిన సుండరాం లాగా ప్రవర్తించడం మొదలుపెడతాడు. అతని నడక నుండి సుందరం లైఫ్ స్టైల్ ,మాట్లాడే విధానం మొత్తం అతనిలో మార్పులు వస్తాయి. అతనిని చూసి నిజంగా గ్రామస్తులు అతనే వచ్చాడేమో అని భావిస్తారు. మరి కొంతమంది అతనిలో ఏదైనా ఆత్మలాగా ఉందేమోనని అనుమానపడతారు..

ఈ సినిమా మొత్తం గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. దర్శకుడు ప్రేక్షకులను ఓ గ్రామీణ ప్రపంచంలోకి పల్లె వాతావరణన్ని పరిచయం చేస్తాడు. సినిమా చూస్తున్నంత సేపు నిజంగా మనం కూడా ఆ గ్రామంలో ఉన్న మేము నన్న అనుభూతి కలుగుతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా అద్భుతంగా సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగుంటుంది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. మధ్య మధ్యలో కొన్ని బోరింగ్ సన్నివేశాలు ఉంటాయి. సినిమాలో కామెడీ సీన్స్ చాలా హైలెట్ గా నిలిచాయి ముమ్ముట్టితో పాటు వచ్చే కామెడీ సీన్స్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. ముమ్ముట్టి ఈ సినిమాలో వన్ మాన్ షో చేశారనే చెప్పొచ్చు. సినిమా మొదటి నుంచి చివరి వరకు తనదైన శైలిలో ప్రేక్షకుల్ని మరోసారి మెప్పించారు.

కామెడీ ఎంటర్ టైనర్ సాగిన నన్పకల్ నేరతు సినిమా తమిళ ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని అందించింది ఈ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను వసూలు చేసింది తమిళ స్టార్ హీరోల నుంచి డైరెక్టర్ల వరకు ఈ సినిమా చూసి తమదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. నన్పకల్ నేరతు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఓటిటీ వచ్చిన తర్వాత సినిమా లో కంటెంట్ ఉంటే బాషతో సంబంధం లేకుండా సినీ ప్రేక్షకులందరూ చూస్తున్నారు అలాంటి చూడదగిన చక్కటి సినిమానే నన్పకల్ నేరతు.. మమ్ముట్టి నటించిన నన్పకల్ నేరతు సినిమా మీరు కూడా ఓ సారి వీక్షించండి.


Share

Related posts

బిగ్ బాస్ 4: అడ్డంగా దొరికిపోయిన అవినాష్, అతనిది ఫేక్ గేమ్ అని తేలిపోయింది..??

sekhar

Radhe shyam: ప్రభాస్‌కు సోలో డేట్..కానీ, సంక్రాంతికి రావడం పెద్ద రిస్కే అంటున్నారు..

GRK

WhatsApp :మరో ఇంట్రస్టింగ్ ఫీచర్ ను పరిచయం చేసిన వాట్సాప్.!!

bharani jella