NewsOrbit
రివ్యూలు

‘మ‌న్మ‌థుడు 2’ రివ్యూ

`మన్మథుడు 2` రివ్యూ

కొన్ని క్లాసిక్‌ చిత్రాలు అలా కుదిరిపోతుంటాయి. వాటిని ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోలేరు. అలాంటి చిత్రాల్లో 2002లో విడుదలైన ‘మన్మథుడు’ ఒకటి. నాగార్జున అక్కినేని, త్రివిక్రమ్‌, కె.విజయ్‌భాస్కర్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘మన్మథుడు’ బ్యూటీఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచిపోయింది. దాదాపు 17 సంవత్సరాలు తర్వాత నాగార్జునే హీరోగా ‘మన్మథుడు 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది సీక్వెలా? కాదా? అసలు మన్మథుడు 2 అనే టైటిల్‌ ఎందుకు పెట్టారు?. కేవలం ఒక సినిమాను మాత్రమే డైరెక్ట్‌ చేసిన రాహుల్‌ రవీంద్రన్‌కి ఈ సినిమాను డైరెక్ట్‌ చేసే అవకాశం ఎందుకిచ్చారు? అనే విషయాలను తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం…

చిత్రం: మ‌న్మ‌థుడు 2
వ్య‌వ‌థి: 155.10 నిమిషాలు
నిర్మాణ సంస్థ‌లు: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వయాకామ్ 18 స్టూడియోస్‌
న‌టీన‌టులు: నాగార్జున అక్కినేని, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ల‌క్ష్మి, వెన్నెల‌కిషోర్‌, రావు ర‌మేష్‌, ఝాన్సీ, దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు
డైలాగ్స్‌:  కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌
ఎడిట‌ర్స్‌:  ఛోటా కె.ప్ర‌సాద్‌, బి.నాగేశ్వ‌ర రెడ్డి
స్క్రీన్‌ప్లే:  రాహుల్ ర‌వీంద్ర‌న్, స‌త్యానంద్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్స్‌:  ఎస్‌.రామ‌కృష్ణ‌, మౌనిక‌
మ్యూజిక్:  చైత‌న్య  భ‌రద్వాజ్‌
సినిమాటోగ్ర‌ఫీ:  ఎం.సుకుమార్‌
నిర్మాత‌లు:  నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌
ద‌ర్శ‌క‌త్వం:  రాహుల్ ర‌వీంద్ర‌న్‌

కథ:
సాంబశివరావు అలియాస్‌ సామ్‌(నాగార్జున అక్కినేని), తన అసిస్టెంట్‌ కిషోర్‌(వెన్నెలకిషోర్‌)తో కలిసి పెర్‌ఫ్యూమ్స్‌ తయారుచేస్తుంటాడు. తల్లి(లక్ష్మి), అక్కలు(ఝాన్సీ, దేవదర్శిని), చెల్లెలు(నిశాంతి)లతో కలిసి ఉండడు. దానికొక చిన్నపాటి కామెడీ ఫ్లాష్‌ బ్యాక్‌ కూడా ఉంటుందనుకోండి. మూడు తరాల నుండి పోర్చుగల్‌లో సెటిలైన తెలుగువాళ్ల కుటుంబం వాళ్లది. ప్లేబాయ్‌ అయిన సామ్‌ తన వ్యవహారాలను ఇంట్లో తెలియకుండా జాగ్రత్తలు పడుతుంటాడు. అన్నీ అవసరాలు తీరిపోతుండటంతో పెళ్లి ఎందుకు? అనే ఆలోచనలో ఉంటాడు. అయితే తోడు జీవితంలో తప్పకుండా అవసరం అని భావించిన అతని కుటుంబ సభ్యులు అతనికి పెళ్లి చేయాలని అనుకుంటారు. పెళ్లి ఎలాగైనా చేసుకోకూడదనే ఆలోచనతో పోర్చుగల్‌లో ఉండే మరో తెలుగు అమ్మాయి అవంతిక(రకుల్‌ ప్రీత్‌ సింగ్‌)తో ఓ డీల్‌ కుదుర్చుకుంటాడు. పెళ్లి ముందురోజు ఆమె పెళ్లి నుండి వెళ్లిపోవాలనే కండీషన్‌ పెట్టుకుంటాడు. అన్నట్లుగానే రకుల్‌ వెళ్లిపోతుంది. అయితే షాక్‌తో సామ్‌ తల్లి హాస్పిటల్‌ పాలవుతుంది. దాంతో అవంతికను సామ్‌ మళ్లీ తీసుకొస్తాడు. చివరకు ఏం జరుగుతుంది? అవంతిక వచ్చిన తర్వాత సామ్‌ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? అసలు అవంతిక సామ్‌ డీల్‌కు ఎందుకు ఒప్పుకుంటుంది? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
స‌మీక్ష‌
కొడుకులు హీరోలుగా ఎదిగిన స‌మ‌యంలో తండ్రుల‌కు మంచి క‌థ‌లు దొర‌క‌డం క‌ష్ట‌మ‌వుతుంది. అలాంటి ఇబ్బందే నాగార్జున‌కు కూడా ఉంది. ఒక‌ర‌కంగా రొమాంటిక్ కామెడీ చిత్రాల‌కు దూర‌మ‌వుదామ‌ని ఆయ‌న అనుకుంటున్న స‌మ‌యంలో ఆయ‌న‌కు దొరికిన స‌బ్జెక్ట్ `మ‌న్మ‌థుడు2`. నాగార్జున కెరీర్‌లో `మ‌న్మ‌థుడు` చిత్రానికి చాలా ప్ర‌త్యేక‌త ఉంది. విజ‌య‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంతో పాటు త్రివిక్ర‌మ్ డైలాగులుకూడా ఆ సినిమా అత్యంత ప్ల‌స్ అయ్యాయి. ఆ సినిమా విడుద‌లైన ఇన్నేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ నాగార్జున అదే పేరుతో కాక‌పోతే దానికి 2 అనే సంఖ్య‌ను త‌గిలించి రూపొందించిన చిత్రం `మ‌న్మ‌థుడు2`. `చి.ల.సౌ` అనే చిన్న చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రాహుల్ ర‌వీంద్ర‌న్‌ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడిని చేశారు. ఫ్రెంచ్ సినిమా ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. త‌న తొలి ప్రేమ దూర‌మైంద‌న్న కోపంతో పెళ్లి వ‌ద్ద‌నుకునే ఓ అబ్బాయి. అత‌నికి వ‌య‌సు మీద ప‌డి మ‌ధ్య వ‌య‌స్సులోకి వెళ్తాడు. అత‌నికి ముగ్గురు అక్క‌జెల్లెళ్లు. త‌ల్లి క‌టుంబ పెద్ద‌. తల్లికి రోజురోజుకీ అనారోగ్యం ముదురుతున్న సంగ‌తి తెలుస్తూనే ఉంటుంది. ఎలాగోలా కొడుకు పెళ్లి చేయాల‌ని క‌రాఖండిగా చెప్పేస్తుంది. ఆమె గురించి ఆలోచిస్తూ వెళ్తున్న కొడుక్కి ఒకమ్మాయి త‌న‌కు న‌చ్చ‌ని చ‌దువు చ‌ద‌వ‌కుండా తండ్రి ముందు నాటకం ఆడి త‌ప్పించుకోవ‌డం క‌నిపిస్తుంది. తాను కూడా అలాంటి నాట‌కం ఆడి, ఇంట్లో వాళ్ల ద‌గ్గ‌ర పెళ్లి ప్ర‌స్తావ‌న లేకుండా చేసుకోవాల‌నుకుంటాడు. అంత వ‌ర‌కూ బాగానే ఉంది కానీ, కుటుంబ‌స‌భ్యుల‌కోసం నాట‌కాలు ఆడ‌టం, ప్రేయ‌సిగా మ‌రో అమ్మాయిని తీసుకొచ్చి ప‌రిచ‌యం చేయ‌డం మ‌న‌కు కొత్తేం కాదు. ఈ సినిమాలో జ‌రిగింది అదే. ప్రేయ‌సిగా న‌టించడానికి ఒప్పుకున్న అమ్మాయికి బోలెడంత ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. అయినా క‌లిసి ఒక‌రికొరు బ‌తికే క్ర‌మంలో అవ‌న్నీ తెలుస్తాయి. అంత వ‌ర‌కూ ఓకే అనుకుంటే చిరాకు క‌లిగించే అంశాలు సినిమాలో చాలానే ఉన్నాయి. హీరోకున్న ఓసీడీ చూస్తే న‌వ్వు రావాల్సింది పోయి చిరాకు క‌లుగుతుంది. పోర్చుగ‌ల్‌లో తెలుగువారు మాట్లాడే కాస్త స్ప‌ష్ట‌మైన తెలుగు భాష‌ను వీళ్లు ఉప‌యోగించిన తీరు చూస్తే ప్రేక్ష‌కులు కొత్త‌ద‌నం ఫీల్ కావాల్సిన చోట విసుగ్గా భావిస్తారు. నాగార్జున అందం మీద అన్ని డైలాగులు వేయ‌డం బాగోలేదు. ర‌కుల్ – ఝాన్సీ మ‌ధ్య లిప్‌లాక్ స‌న్నివేశం నిజానికి సినిమాకు అంత అవ‌స‌రం లేదు. కానీ ఎందుకుపెట్టారో, ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నారో అర్థం కాదు. ఏదైమైనా `చి.ల‌.సౌ` తీసిన రాహుల్ రవీంద్ర‌న్ తెర‌కెక్కించిన చిత్రమిది అని అంటే న‌మ్మ‌బుద్ధి పుట్ట‌దు. డ‌బుల్ మీనింగ్ డైలాగును ఎంజాయ్ చేసేవాళ్లు చేసినా, కొంద‌రికి వెగ‌టు క‌లిగిస్తాయి. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎంత మెప్పిస్తుందో చూడాలి మ‌రి.
రేటింగ్‌: 2/5
బాట‌మ్ లైన్‌: `మ‌న్మ‌థుడు`కి… దీనికీ పొంత‌నే లేదు!
author avatar
Siva Prasad

Related posts

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar

Leave a Comment