Tiger Nageswara Rao Review: ఫస్ట్ టైం మాస్ మహారాజ రవితేజ పాన్ ఇండియా నేపథ్యంలో నటించిన సినిమా “టైగర్ నాగేశ్వరరావు”. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 20వ తారీకు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం
నటీనటులు: రవితేజ, అనుపమ్ ఖేర్, గాయత్రి భరద్వాజ్, నుపుర్ సనన్, రేణు దేశాయ్, నాసర్, మురళీశర్మ, జిస్సు సేన్‌గుప్తా, సుదేవ్ నాయర్, హరీష్‌పెరాడి మరియు ఇతరులు
దర్శకుడు : వంశీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: ఆర్. మధి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
పరిచయం:
తెలుగు చలనచిత్ర రంగంలో జయప్రజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో మాస్ మహారాజ రవితేజ దూసుకుపోతూ ఉంటాడు. కరోనా తర్వాత సీనియర్ హీరోలతో పాటు రవితేజ వరుస పెట్టి సినిమాలు విడుదల చేస్తున్నారు. తాజాగా వంశీ దర్శకత్వంలో రవితేజ నటించిన “టైగర్ నాగేశ్వరరావు” విడుదల కావడం జరిగింది. స్టువర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. ఫస్ట్ టైం రవితేజ కెరియార్ లో పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన “టైగర్ నాగేశ్వరరావు” సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
స్టోరీ:
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టువర్టపురం అంటే పోలీస్ వ్యవస్థకు ప్రజలకు హడల్. ఎందుకంటే ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు దొంగతనాన్ని వృత్తిగా చేసుకుని బతుకుతారు. ఆ ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు 1970, 80 దశాబ్దాలలో పేరుగాంచిన దొంగ. పోలీస్ వ్యవస్థకే సవాళ్లు విసిరి.. ఎన్నో విలువైన వస్తువులను దొంగతనం చేయడం అతని నైజం. నాగేశ్వరరావు దొంగతనం చేసే ప్రాంతాన్ని టైగర్ జోన్ అని పిలవబడేది. ఈ రకంగా టైగర్ నాగేశ్వరరావు అనే పేరు సంపాదిస్తాడు. నాగేశ్వరరావు ఎనిమిది సంవత్సరాల వయసులో దొంగతనం చేసే క్రమంలో సొంత తండ్రి తలని నరికేసి మారిపోతాడు. అంతకరుడుగట్టిన మనిషి. ఏమాత్రం జాలి దయ లేకుండా.. బతుకుతుంటాడు. బెజ్జల ప్రసాద్ (నాజర్) స్టువర్టపురంలో దొంగలకు గురువు. అతని దగ్గరే నాగేశ్వరరావు శిష్యరికం చేస్తాడు. దొంగతనం దోపిడీలు చేస్తూ జీవించే నాగేశ్వరరావు సారా(సుప్పూర్ సన్నన్) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో తన నేరపూరిత జీవితం వల్ల ఆమెను కోల్పోతాడు. ఎలాంటి దొంగతనం ఇంక నేరం చెయ్యాలని అనుకుంటే ముందుగానే ప్రకటించి పని ముగించే అలవాటు నాగేశ్వరరావు స్టైల్. అలా ప్రధాని ఇందిరా గాంధీ ఇంట్లో చొరబడి ఒక వస్తువు కాజేసి ఆమె దృష్టిని కూడా ఆకర్షిస్తాడు. అయితే ఆ పని చేసిన నాగేశ్వరరావు జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి..? ఇంతకీ నాగేశ్వరావు సాధించాలనుకున్నది ఏమిటి..? చివర ఆఖరికి అతడు అనుకున్నది సాధించాడా లేదా అనేది మిగిలిన స్టోరీ.
విశ్లేషణ:
టైటిల్ రోల్ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ ఇట్టే ఒదిగిపోయాడు. వాస్తవ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన గాని ఈ సినిమాలో వాస్తవాలు కంటే కల్పితాలే ఎక్కువ. దీంతో సినిమా చూసే ప్రేక్షకుడు కొంత అయోమయానికి గురికావడం జరిగింది. సినిమాలో కొన్ని సన్నివేశాలు పరవాలేదు అనిపించిన గాని కొన్ని.. సీన్స్ చూస్తే… ఇంత దరిద్రంగా హీరో క్యారెక్టర్ ఉంటుందా అన్నా ఫీలింగ్ కూడా కలుగుద్ది. చిన్న వయసులోనే తండ్రి తల నరకటం.. కొన్ని సన్నివేశాలు హీరో క్యారెక్టర్ ని దెబ్బతీశాయి. అటువంటి మనిషి ఎలా మార్పు చెందాడు అనేది వెండి తెరపై చూపించడంలో దర్శకుడు వంశీ విఫలమయ్యాడని చెప్పవచ్చు. స్టువర్టపురం నాగేశ్వరరావు దొంగతనాలు గురించి కథలు కథలుగా చెప్పుకునే పరిస్థితిలో ఆ తరహా కంటెంట్ సినిమాలో మిస్ అయిందని చెప్పవచ్చు. ప్రధాని ఇంటిలో దొంగతనం చేసే సత్తా కలిగిన వ్యక్తిలో తెలివితేటలు అతని సాహసాలు సరైన రీతిలో చూపించలేకపోయారు. స్క్రీన్ ప్లే మరియు సినిమాలో అనవసరమైన సన్నివేశాలు రిపీటెడ్ సీన్స్ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షకు గురిచేస్తాయి. కొన్ని ఫేక్ ఎమోషన్స్ కూడా సినిమాకి మైనస్ గా నిలిచాయి. స్టువర్టుపురం నేర సామ్రాజ్యం నేపథ్యంలో సినిమా ప్రారంభ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా విజువల్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఎంతో ఉత్కంఠ భరితమైన స్టోరీ తీసుకోవడంలో సక్సెస్ అయిన డైరెక్టర్ వంశీ.. దాన్ని తెరపై సరైన రీతిలో చూపించడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ తన పరిధి మేరకు న్యాయం చేశాడు. సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు అనిపిస్తది. ఎక్కడ సినిమా బ్యూటీ తగ్గకుండా అద్భుతంగా తీర్చిదిద్దారు. అభిషేక్ అగర్వాల్ నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.