NewsOrbit
Entertainment News రివ్యూలు సినిమా

Virupaksha Movie Review: మెగా హీరో సాయిధరమ్ తేజ్ “విరూపాక్ష” ఫుల్ రివ్యూ డీటెయిల్స్..!!

Share

Virupaksha Movie Review: దాదాపు ఏడాదిన్నర తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా “విరూపాక్ష” సినిమా రిలీజ్ కావటం జరిగింది. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత.. విడుదలైన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు సాయిధరమ్ తేజ్ హర్రర్ జోనర్ ని టచ్ చేయలేదు. “విరూపాక్ష” హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ. పైగా ఈ సినిమాని డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు తీశారు. అంతేకాదు ఈ సినిమాకి సుకుమార్ స్క్రీన్ ప్లే కూడా అందించటం జరిగింది.

సినిమా: విరూపాక్ష
నటినటులు: సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, బ్రహ్మాజి, రాజీవ్ కనకాల, సునీల్, అజయ్ తదితరులు
కెమెరా: శాందత్ సాయినుద్దీన్
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: అజనీష్ లోకనాథ్
నిర్మాత: బి.ఎస్.ఎన్ ప్రసాద్
దర్శకత్వం: కార్తీక్ వర్మ దండు
విడుదల తేదీ: 21 ఏప్రిల్ 2023

Mega Hero Saidharam Tej Virupaksha Full Review Details

పరిచయం:

రోడ్డు ప్రమాదం తర్వాత మెగా హీరో సాయి ధరంతేజ్ నటించిన సినిమా “విరూపాక్ష”. ఫస్ట్ టైం హర్రర్ జోనర్ లో సాయిధరమ్ తేజ్ నటించిన ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించటం ఆయన శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించడంతో సినిమా పై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ మరియు ట్రైలర్ విడుదలయ్యాక ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 21 వ తారీకు నేడు విడుదలైన ఈ సినిమా… టాక్ ఏంటో తెలుసుకుందాం.

స్టోరీ:

ఈ సినిమా కథ క్షుద్ర పూజల నేపథ్యంలో సాగే సినిమా. 1979 వ సంవత్సరంలో రుద్రవనం అనే గ్రామంలో క్షుద్ర పూజలు చేస్తూ చిన్నపిల్లల ప్రాణాలు తీసేస్తున్నారన్నే అనుమానంతో ఆ ఊరి జనం ఓ కుటుంబాన్ని దారుణంగా కొట్టి చంపేస్తారు. ఇక అదే కుటుంబానికి చెందిన సూర్య (సాయి ధరమ్ తేజ్) అనే చిన్న పిల్లాడిని ఆ ఊరి సర్పంచ్ హరిచంద్ర(రాజీవ్ కనకాల) ఓ అనాధాశ్రమంలో జాయిన్ చేస్తాడు. పుష్కరకాల ముగిసిన తర్వాత. సూర్య తన తల్లితో కలిసి మళ్ళీ రుద్రవనం గ్రామానికి చేరుకుంటాడు. ఆ సమయంలో గ్రామంలో.. జాతర జరుగుతూ ఉండటంతో… 15 రోజుల అక్కడే ఉండాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఆ ఊరి సర్పంచ్ హరిచంద్ర కూతురు నందిని (సంయుక్త మీనన్) తో సూర్య ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను గెలవడం కోసం సూర్య చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా రుద్రవనం గ్రామంలో… జాతర జరుగుతున్న సమయంలో కొన్ని ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి. దీంతో ఆ ఊరి పూజారి గ్రామాన్ని అష్టదిగ్బంధన చేయాలని 8 పగలు 8 రాత్రులు ఊరిని దిగ్బంధనం చేయాలని… గ్రామ పెద్దలకు తెలియజేస్తాడు. అయినా గాని అనుమానాస్పద మరణాల సంఖ్య పెరిగిపోతూ ఉండటంతో ఊరి ప్రజలంతా భయంతో వణికి పోతారు. సూర్య పెదనాన్న కూతురు పార్వతి (యాంకర్ శ్యామల) కూడా ఉంటుంది. ఈ పరిణామంతో అసలు ఆ ఊరిని పట్టిపీడేస్తున్న ఆ దుష్టశక్తి ఏమిటి…? ఆ ఊరి చావుల వెనకాల రహస్యం ఏమిటి..? ప్రేమించిన అమ్మాయి నందిని కోసం సూర్య ఏం చేశాడు..? అసలు సూర్య గతం ఏమిటి..? భయపడుతున్న ఊరి ప్రజలకు సూర్య ఏ విధంగా బాసటగా నిలిచాడు..? చివరికి ఏం జరిగింది అనేది సినిమా చూడాల్సిందే.

Mega Hero Saidharam Tej Virupaksha Full Review Details

విశ్లేషణ:

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చేతబడి నేపథ్యంలో సినిమాలు వచ్చి చాలా కాలం అయిపోయాయి. అయితే మళ్లీ అటువంటి జోనర్ నీ టచ్ చేస్తూ సరికొత్త లవ్ స్టోరీ అటాచ్ చేసి అద్భుతమైన స్టోరీతో కార్తీక్ దండు “విరూపాక్ష” మొదటి నుండి చివరి వరకు ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా నడిపించడంలో సక్సెస్ సాధించాడు. హర్రర్ సీన్స్… థ్రిల్లింగ్ ఎలిమెంట్స్..తో అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో స్టోరీని వెండితెరపై ఆవిష్కరించడంలో సక్సెస్ సాధించాడు. యావరేజ్ నటీనటుల నుండి అద్భుతమైన ఇన్ పుట్ లాగాడని చెప్పవచ్చు. ప్రతి ఒక్క క్యారెక్టర్ తెరపై సినిమాకి ప్రాణం పోసింది. “విరూపాక్ష” సినిమా మొత్తానికి హైలైట్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్. చాలా కాలం తర్వాత తెలుగులో థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ తో హర్రర్.. థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన మూవీ. అక్కడక్కడ కొన్ని సాగదీత సన్నివేశాలు అనిపించిన గాని… సినిమా కాన్సెప్ట్.. చివరి వరకు ఇంట్రెస్ట్ గా చూపించడంలో సక్సెస్ సాధించడం జరిగింది. ఇక స్క్రీన్ ప్లేలో సుకుమార్ వంద శాతం విజయం సాధించారు. చూసే ప్రేక్షకుడిలో సస్పెన్స్… క్యూరియాసిటీ కలిగించటంలో.. తన నైపుణ్యం ఏంటో మరోసారి వెండితెరపై నిరూపించారు. లవ్ స్టోరీ మరియు లాజిక్ సీన్స్ కొన్ని సన్నివేశాలలో బోర్ కొట్టిస్తాయి. క్లైమాక్స్ కి ముందు కొంత ఎపిసోడ్ అనవసరం అనిపించింది. కానీ క్లైమాక్స్ చివరిలో ట్విస్ట్ అదిరిపోతుంది. హర్రర్ చిత్రాలను ఇష్టపడే ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు “విరూపాక్ష” ఒక ఫుల్ మీల్స్ సినిమా అని చెప్పవచ్చు. యాక్సిడెంట్ తర్వాత ఈ సినిమాలో నటుడిగా సాయిధరమ్ తేజ్ సూర్య పాత్రలో అద్భుతంగా నటించాడు. హీరోయిజంకి అంత స్కోప్ లేకపోయినా కానీ తన పాత్రకి న్యాయం చేశాడు. మిగతా పాత్రలు సైతం ఎవరికి వారు… తమ బెస్ట్ ఇవ్వటం జరిగింది.

ప్లస్ పాయింట్స్:

స్టోరీ
సంగీతం
స్క్రీన్ ప్లే
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
ప్రధాన పాత్రలు

మైనస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్ లో కొన్ని సాగదీత సన్నివేశాలు

చివరిగా: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలా సంవత్సరాల తర్వాత డీసెంట్ హర్రర్ త్రిల్లర్ “విరూపాక్ష” అని చెప్పవచ్చు.

Share

Related posts

Pawan Kalyan Hari Hara Veera Mallu: అసలెవరీ ‘హరిహర వీరమల్లు’? అతని గొప్పతనం చెప్పే కథ ఇదే….!

arun kanna

మొదలైన నిహారిక ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్..!

Teja

Waltair Veerayya: “అన్ స్టాపబుల్” షోపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..!!

sekhar