NewsOrbit
రివ్యూలు సినిమా

ఫస్ట్ రివ్యూ: మిడిల్ క్లాస్ మెలోడీస్ – అమెజాన్ ప్రైమ్

థియేటర్లన్నీ అర్ధాంతరంగా మూసివేసిన తర్వాత వాటి ద్వారా విడుదలైన సినిమాలు అన్నింటిలో దాదాపు ఏదీ జనాలను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక మరికొద్ది రోజుల్లో థియేటర్లు తెరుస్తారు అనగా వరుసబెట్టి హిట్ చిత్రాలు రావడం మొదలయ్యాయి. ఇదే సెంటిమెంట్ తో తెలుగు నుండి మరొక చిన్న బడ్జెట్ చిత్రం అయిన మిడిల్ క్లాస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుందో చూద్దాం

 

Middle Class Melodies: Vijay Deverakonda and Rashmika Mandanna unveil the  trailer of the Anand Deverakonda and Varsha Bollamma starrer

కథ :

హీరో రాఘవ (ఆనంద్ దేవరకొండ) తన అమ్మ లక్ష్మి (సురభి ప్రభావతి) దగ్గర నుండి నేర్చుకున్న బొంబాయి చెట్ని చేయడంలో సిద్ధహస్తుడు. ఇక అతను తనకు వచ్చిన ఆ బొంబాయి చెట్ని ని గుంటూరు మొత్తం ఫేమస్ చేద్దామని డిసైడ్ అవుతాడు. ఇక అతని తండ్రి కొండల్ రావు (గోపరాజు రమణ) కి నోటి దురుసు ఎక్కువ. ఇక అదే వైఖరి అతని కొడుకుకి కూడా వచ్చింది. చిన్న టిఫిన్ సెంటర్ పెట్తుకొని జీవనం సాగించే కొండలరావు, అతని కొడుకు ఎన్నో ఆశలతో నగరానికి వస్తారు. ఇక సంధ్య (వర్ష బొల్లమ్మ) తో రాఘవ కొద్ది సంవత్సరాల నుండి ప్రేమాయణం నడుపుతుంటాడు. అయితే వారిద్దరూ కలవడానికి మాత్రం నానా ఇబ్బందులు పడుతుంటారు. ఇక సంధ్య కన్నా బొంబాయి చెట్ని ఫేమస్ చేయడమే రాఘవ మొదటి లక్ష్యం. ఇక అక్కడి నుండి అతను తన ఆశయాన్ని రాఘవ సాధించాడా లేదా..? మధ్యలో అతని ప్రేమ కథ ఏమైంది అన్నదే చిత్రం….

Middle Class Melodies - Wikipedia

ప్లస్ లు:

హీరో తండ్రి కొండలరావు క్యారెక్టర్

హీరో ఫ్రెండ్ లవ్ ట్రాక్

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

Middle Class Melodies 2020 Telugu Mp3 Naa Songs Download

మైనస్ లు:

హీరో పర్ఫార్మెన్స్

స్క్రీన్ ప్లే

నరేషన్

సైడ్ క్యారెక్టర్స్ సెలక్షన్

Middle Class Melodies on Amazon Prime: Know Release Date, Time, Cast, Plot  and Trailer - See Latest

విశ్లేషణ:

హీరో ఆనంద్ దేవరకొండ కి మొదటి చిత్రం ఫ్లాప్ అయిన తర్వాత ఇది మంచి కం బ్యాక్ అనే చెప్పాలి. ఆనంద్ నటుడిగా పర్వాలేదు అనిపిస్తే వర్ష బొల్లమ్మ మాత్రం పూర్తి మార్కులు కొట్టేసింది. డైరెక్టర్ వినోద్ అనంతోజు బాగా ప్రశాంతమైన వాతావరణాన్ని స్క్రీన్ పైన చక్కగా చూపించాడు. ఇక ఇందులో ప్లస్ పాయింట్ ఏమిటంటే మనం రోజు చూసే క్యారెక్టర్లను చాలా అందంగా మనకు తీర్చిదిద్దడమే. ప్రతి సన్నివేశం రాఘవ కథను, ఆశయాన్ని మరింత బలపరుస్తుంది. ఎక్కడా ఎమోషన్ ఓవర్ కు పోకుండా కామెడీని. కోపాన్ని రెండింటిని చాలా సహజంగా చిత్రీకరిస్తూ, బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు ప్రదర్శించే నైపుణ్యం చాలా బాగుంది. తరుణ్ భాస్కర్ కామియో చిత్రానికి ప్రధాన ఆకర్షణ. జనార్థన్ పసుమర్తి డైలాగ్స్, స్వీకర్ అగస్తి మ్యూజిక్ ఈ చిత్రానికి ఊపిరి పోశాయి. అయితే కథలో కొంచెం హీరోయిజం లోపించడం, కొన్నిచోట్ల మ్యూజిక్ తేలిపోవడం ప్రేక్షకులకు కొద్దిగా ఫీల్ లోపించినట్లు ఉంటుంది. ఇక కొన్ని అనవసరమైన ట్రాక్లు కూడా స్క్రీన్ ప్లే ను సాగదీసినట్లు ఉంటాయి. రెండో భాగం కన్నా మొదటి భాగం చాలా బాగా ఉండడంతో ప్రేక్షకుడికి కొద్దిగా అసంతృప్తి ఉంటుంది కానీ మొత్తానికి చిత్రం మాత్రం చాలా చక్కగా, అందంగా మొదలవుతుంది…. కొనసాగుతుంది…. ముగుస్తుంది.

చివరి మాట : రాఘవప్రేమతో చేసిన బొంబాయి చెట్ని టేస్టు బాగుందండోయ్….

Related posts

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri