Mosagallu review : మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘మోసగాళ్ళు‘. ఈ సినిమాలో వీరిద్దరూ అన్నా చెల్లెళ్ళు గా నటించారు. రియల్ లైఫ్ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి హాలీవుడ్ ఫిలిం మేకర్ జెఫ్రీ గి చిన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ను మంచు విష్ణు స్వయంగా నిర్మించారు. మరి ఈ చిత్రం అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.
Mosagallu review : కథ
అర్జున్ (విష్ణు), అను (కాజల్) సిడ్ (నవీన్ చంద్ర), విజయ్ (నవదీప్) నలుగురు కలిసి ఒక మల్టీ మిలియన్ స్కామ్ చేసేందుకు సిద్ధం అవుతారు. ఇక వీరంతా కలిసి ఈ దేశంలో కాకుండా అమెరికన్స్ ను బోల్తా కొట్టించేందుకు ప్లాన్ వేస్తారు. తాము ఐఆర్ఎస్ ఏజెంట్లు అని వారిని ఇంటర్నెట్ ద్వారానే నమ్మించి వారి దగ్గర డబ్బులు కొట్టేస్తుంటారు. ఇది కాస్తా యూఎస్ యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ దృష్టికి వెళుతుంది. ఇదంతా చేసింది ఇండియన్స్ అని తెలిసి వారి ప్రోద్బలంతో ఇక్కడే ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ సునీల్ శెట్టి ని నియమిస్తారు. ఆ తర్వాత జరిగే పరిణామాలే ఈ సినిమా కథ
ప్లస్ లు
- మంచు విష్ణు చెప్పినట్లు ఈ సినిమాకి భారీ బడ్జెట్ పెట్టారు అని ఆ విజువల్స్ చూస్తేనే అర్థం అవుతుంది. హాలీవుడ్ డైరెక్టర్ కాబట్టి విజువల్స్ బాగా రిచ్ గా ఉన్నాయి.
- కాజల్ అగర్వాల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మిగిలిన నటీనటులతో పోలిస్తే ఆమె క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది. తను కూడా తన పరిధిలో అత్యద్భుతంగా నటించింది.
- సామ్ సి.ఎస్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అక్కడక్కడా వచ్చే కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలకు ఇది మంచిగా తోడయింది.
మైనస్ లు
- తెలుగు ప్రేక్షకులకు ఈ కథ పెద్దగా నచ్చకపోవచ్చు. మొత్తం టెక్నాలజీ, డాలర్లు, అమెరికా, స్కామ్, ఐ ఆర్ ఎస్ అనే టెక్నికల్ పదాలు మన నేటివిటీకి బాగా దూరంగా ఉంటాయి.
- ఒక హాలీవుడ్ దర్శకుడితో తెలుగు చిత్రం తీస్తే చిత్రీకరణ విషయంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. సరిగ్గా మోసగాళ్లు విషయంలో కూడా అదే జరిగింది. నరేషన్ అయితే అస్సలు బాగోలేదు.
- విష్ణు కథ పైన సంవత్సరాలు వర్క్ చేశాము అని చెప్పారు కానీ స్టొరీ లైన్ బలంగా ఉన్నా…. దాని చుట్టూ రాసుకున్న సీన్స్ లాజిక్ లేని విధంగా ఉన్నాయి.
- సినిమాలో అత్యంత కీలకమైన స్కామ్ ఎపిసోడ్ తేలిపోయింది. ఏదో మామూలు సీన్ లాగా దీనిని చిత్రీకరించడం తోనే సినిమా డౌన్ అయిపోయింది. దర్శకత్వం కూడా పెద్ద గొప్పగా ఏమీ లేదు.
- ప్రీ క్లైమాక్స్ ముందు భాగం మొత్తం భారీగా సాగదీశారు అసలే విసిగిపోయిన ప్రేక్షకులకు ఇది మరింత చిరాకు తెప్పించే అంశం.
Mosagallu review : విశ్లేషణ
‘మోసగాళ్లు‘ సినిమా ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ అని చెప్పిన మంచు విష్ణు మాటలకి ఇక్కడ స్క్రీన్ పైన బొమ్మకి అసలు పొంతనే లేదు. ఎక్కడా కూడా సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కనిపించలేదు. గ్రిప్పింగ్ సన్నివేశాలు దీనిలో పూర్తిగా కరువయ్యాయి. అసలు ఇది రియల్ లైఫ్ స్కామ్ అని నమ్మశక్యం కాని రీతిలో సీన్లు రాసుకున్నారు. లాజిక్ లేని సన్నివేశాల మధ్య సినిమా సాగుతూ ఉంటుంది. కాజల్ పర్ఫార్మెన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు. బాక్సాఫీస్ వద్ద మంచు విష్ణు హిట్ కోసం మరిన్ని సంవత్సరాలు ఆగాల్సిందే.