‘రంగం‘ సినిమాతో తెలుగువారికి బాగా దగ్గరైన హీరో ‘జీవా‘ ఆ తర్వాత తీసిన సినిమాలకు టాలీవుడ్ జనాలు పెద్దగా ఆకర్షితులు కాలేదు. అయితే ఇప్పుడు రాజు మురుగన్ దర్శకత్వంలో అతను చేసిన ఈ ‘జిప్సీ‘ చిత్రం అల్లు అరవింద్ కు చెందిన తెలుగు ఓటింగ్ ప్లాట్ఫార్మ్ అయిన ‘ఆహా‘ లో విడుదల అయింది. ఈ చిత్రం జిప్సీ ట్రైలర్ తో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా మొత్తానికి సినిమా పరంగా డిజిటల్ ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో తెలుసుకుందాం…
కథ
జిప్సీ (జీవా) పసిబిడ్డగా ఉన్నప్పుడే ఒక బాటసారి అతని బాధ్యతను అనుకోని పరిస్థితుల్లో తీసుకుంటాడు. జిప్సీ అంటేనే దేశం మొత్తం తిరిగే నిత్య బాటసారి అని అర్థం. జీవా ని కూడా అతని పేరుకి తగ్గట్టే పెంచుతాడు ఆ బాటసారి. ఇక ఇద్దరూ ఒక గుర్రాన్ని వెంటబెట్టుకుని ఇలా దేశం మొత్తం తిరుగుతూ ఉన్న క్రమంలో వైహిదా (నటాషా సింగ్) ను జిప్సీ చూడడం మొదటి చూపులోనే అతనికి ఆమె పై ప్రేమ కలగడం జరుగుతుంది. ఇంతలోనే వైహిదా కు పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఆమె కూడా జ్ప్సి ని ప్రేమించడం తో ఇద్దరూ లేచి పోతారు.
ఇక్కడి వరకూ కథ ఒక రకంగా ఉంటుంది. కానీ ఆ తర్వాత ఇద్దరూ ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు వైహిదా నెల తప్పుతుంది. ఆమె డెలివరీ సమయం దగ్గర పడగా పెద్ద అల్లర్లు అదే సమయంలో చోటు చేసుకుంటాయి. ఆ తర్వాత కొన్ని ఊహించని పరిణామాలతో జిప్సీ, వైహిదా విడిపోతారు. అసలు వాళ్ళు విడిపోవడానికి కారణం ఎవరు? అల్లర్లకు వీరికి ఏమిటి సంబంధం? వీరి బంధానికి అవి అడ్డు ఎలా పడ్డాయి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
ప్లస్ పాయింట్స్
‘రంగం‘ సినిమా తర్వాత జీవ నటుడిగా ఎదిగేందుకు స్కోప్ ఉన్న ఏ ఒక్క చిత్రం అతనికి రాలేదనే చెప్పాలి. అయితే ఈ సినిమా మాత్రం జీవా లోని నటుడి స్థాయిని అతని క్యారెక్టర్ పెంచింది. కొన్ని సీన్స్ దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. ఇక జీవా నటనే ఈ చిత్రానికి మేజర్ హైలైట్. ఈ చిత్రంతో జీవా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. ఒక బాటసారి పాత్రలో కనిపించడం మరియు ఆడియన్స్ ను అలా కన్విన్స్ చేయడం చాలా కష్టమైన విషయం. అయితే ప్రేక్షకుడికి చాలా ఎమోషనల్ ఎపిసోడ్స్‌లో తన జీవితాన్ని కనెక్ట్ చేసి తీసుకొనిరావడంలో జీవా సక్సెస్ అయ్యాడు. హీరోయిన్ కూడా మంచి నటనను కనబరిచింది. పాటలు విజువల్ గా బాగున్నాయి. దర్శకుడు పాటల టేకింగ్ విషయంలో బాగా పరిణితి ప్రదర్శించాడు అని చెప్పాలి. ఇతర పాత్రధారులైన శివకుమార్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్
సినిమాలో అసలైన కథ మరియు స్టోరీ పాయింట్ చాలా బాగుంటుంది అయితే కథా కథనాల పరంగా మాత్రం సినిమా ఆకట్టుకునేవిధంగా సాగలేదు. స్టోరీ నరేషన్ అంటే దర్శకుడు కథ చెప్పే తీరు అసలు బాగాలేదు అనే చెప్పాలి. కొన్ని ఎమోషన్స్ తో.. లాజిక్ లేని స్క్రీన్ ప్లే తో సినిమా సాగింది. మొదటి భాగంలో కొన్ని సీన్స్ సరదాగా పర్వాలేదు అనిపించినప్పటికీ సినిమాలో బలమైన పాయింట్ ను చెప్పే సీన్స్ ఉండాల్సిన సెకండాఫ్ మొత్తం అనవసరమైన సాగదీతకు గురి అయింది. అసలైన కథలోకి ఎంటర్ అయినప్పుడు హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ అనవసరంగా సాగదీశారు అని అనిపించింది. దీనికి తోడు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువ కావడంతో సహజత్వం ఉండాల్సిన సన్నివేశాలపై అసహజమైన ఫీలింగ్ ప్రేక్షకుడికి వచ్చేస్తుంది.
చిన్న చిన్న మేలో డ్రామా ఇన్సిడెంట్ల కారణంగా గుర్రం నడుపుకునే కుర్రాడికి క్లాస్ అమ్మాయి పడటం…. వీటికి తోడు వీళ్ళద్దరూ ప్రేమకు విధి విలన్.. అతని వల్ల వీళ్ళ లవ్ స్టోరీలో సమస్యలు రావడం ఇలా బలం లేని సీన్స్ తో సాగడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. కంటెంట్ పరంగా ఇంకా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు సినిమాను సింపుల్ గా ముగించడం అంతగా రుచించదు.
టెక్నికల్ గా….
సాంకేతికంగా గా దర్శకుడు మంచి కాన్సెప్ట్ తీసుకున్నా తెరమీద చూపించడంలో ఓవరాల్ గా ఇబ్బంది పడ్డాడు. అయితే అక్కడక్కడ ఎమోషనల్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం బాగా తీసి ఆకట్టుకున్నాడు. కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. కొన్ని షాట్స్ అయితే అబ్బురపరిచాయి అని చెప్పాలి. ఇక సంగీత దర్శకుడు అందించిన సంగీతం కూడా పర్వాలేదనిపించింది. నేపథ్య్ సంగీతం అంతంత మాత్రంగా ఉంది. ఎడిటర్ గా పనిచేసిన అతని వర్క్ ఇంకా మెరుగు పడవలసి ఉంది అని అనిపించింది.
చివరికి…
‘జిప్సీ‘ లో జీవా నటన ఈ సినిమాకే హైలెట్. క్లైమాక్స్ కొన్ని చోట్ల డైలాగ్స్ మరియు ముఖ్యమైన సీన్స్ తో సినిమా అక్కడక్కడా బాగానే ఉంటుం.ది అయితే పూర్తి స్థాయిలో మాత్రం కథను ఆసక్తికరంగా నడిపించారు లేకపోయాడు దర్శకుడు. అన్నింటికీ మించి సినిమాలో బలమైన సంఘర్షణ మిస్ కావడం సినిమాకి బలహీనత కాగా బలవంతమైన ఎమోషన్స్ అయితే స్క్రీన్ ప్లేని ఘోరంగా దెబ్బతీశాయి. ఇక కాన్సెప్ట్ పరంగా లవ్ స్టోరీ నచ్చే వారు దీనిని ఒకసారి చూడవచ్చు అయితే ఇక ఏమీ పని లేదు ఎలాగైనా టైంపాస్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ సినిమా ‘ఆహా‘ లో ఉంది చూడండి. లేకపోతే ప్రత్యేకంగా చూసేందుకు మాత్రం ఈ సినిమా టైం వేస్ట్ అని చెప్పాలి.