25.2 C
Hyderabad
January 31, 2023
NewsOrbit
రివ్యూలు సినిమా

Mukhachitram Review: ముఖచిత్రం(2022) రివ్యూ, కోర్టు డ్రామాను తప్పుగా మొత్తం మీద సినిమా బోరింగ్ గా!

Mukhachitram Review and talk
Share

Mukhachitram Review: కలర్ ఫోటో సినిమాకి జాతీయ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ రచయితగా ఇప్పుడు ముఖచిత్రం అనే సినిమాతో ప్రేక్షకులం ముందుకు వచ్చారు.. డైరెక్టర్ గంగాధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వికాస్ వశిష్ట, ప్రియా వడ్లమని హీరో హీరోయిన్లుగా నటించారు. విశ్వక్సేన్ కీలక పాత్రలో కనిపించారు. డిసెంబర్ 9న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆలరించిందో ఇప్పుడు చూద్దాం..

Mukhachitram Review: and talk
Mukhachitram Review: and talk

కథ..
డాక్టర్ రాజ్ కుమార్ (వికాస్ వశిష్ట) హైదరాబాదులో ఫేమస్ ప్లాస్టిక్ సర్జన్. మాయా ఫెర్నాన్డేజ్ (ఆయేషా ఖాన్) కథ రచయిత, సినిమాల్లో ప్రయత్నిస్తుంటుంది. రాజ్ కుమార్ మాయ చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు రాజ్ అంటే మాయకి ఇష్టం ప్రేమ. కానీ రాజ్ కి మాత్రం తనపై ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. మహతి (ప్రియా వడ్లమాని) సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి పెళ్లిళ్ల బ్రోకర్ నుంచి మహతి ఫోటో రాజ్ కుమార్ కి వస్తుంది. మహతిని చూసిన వెంటనే రాజ్ కుమార్ తననే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. మహతికి కూడా రాజ్ కుమార్ మొదటి చూపులోనే నచ్చేస్తాడు. ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. ఇద్దరూ అన్యోన్యంగా జీవిస్తారు. కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు మాయా రోడ్డు ప్రమాదానికి గురవుతుంది. తర్వాత రోజే మహతి మెట్ల పైనుంచి జారీ కిందపడి మరణిస్తుంది. మహతిని ఎలాగైనా బ్రతికించుకోవాలని భావించిన రాజ్ కుమార్ మహతి ముఖాన్ని మాయకి ట్రాన్స్ ప్లాంట్ చేస్తాడు. మహతి గా మారిన మాయ ఏం చేసింది. తన జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి.. తనది సహజమైన మరణమా లేదా ఏదైనా కారణం ఉందా అనేదే సినిమా మిగతా కథ..

ఒక సామాజిక సమస్యని థ్రిల్లర్ నేపథ్యంలో వినూత్నంగా చెప్పాడు డైరెక్టర్ కోర్టులో కేసు వాదనకు రావడంతో కథ మొదలవుతుంది. అయితే అసలు కథలోకి వెళ్లడానికి డైరెక్టర్ చాలా సమయమే తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా ముగిసే సరికి ఇంటర్వెల్ బ్యాంగ్ పర్ఫెక్ట్ గా ఇస్తాడు. కానీ సెకండాఫ్ ని మాత్రం ఒకే ఒక్క ట్విస్ట్ మాత్రమే.కథ ఎన్ని మలుపులు తిరిగినా మిస్టరీ చావుని కోర్టు రూమ్ డ్రామా కి కలెక్ట్ చేసి సామాజిక సమస్యలు చర్చించడం. ఈ కథలో సరిగ్గా అతకలేదు మహతి చావు విషయంలో పాత్రలన్నీ కాస్త ఎక్కువగా చూపించినట్లు అనిపించాయి. నిజానికి కోర్టులో జరిగిన వాదనలు కూడా పెద్దగా రక్తికట్ట లేదు. మాయ పాత్రని వాడుకొని దాన్ని రివైజ్ డ్రామాగా మార్చి స్త్రీ పాత్రతో సందేశం చెప్పి ఉంటే కూడా ప్రభావంతంగా ఉండేది. మొత్తానికి ఈ సినిమా కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది.

వికాస్ వశిష్ట సహజంగా నటించాడు. తనలో ఉన్న నటనను మరొకసారి పరిచయం చేశాడు. మహతి పాత్రలో ప్రియా వడ్లమని ఆకట్టుకుంది. విశ్వక్ చేసింది చిన్న పాత్ర అయినా కానీ కోర్టు రూమ్ డ్రామాని మరింత ఆసక్తిగా రాసుకోవాల్సింది అనిపిస్తుంది. .విశ్వక్ లాయర్ బోన్ లో నిలబడి చెప్పిన డైలాగులు అందర్నీ ఆకట్టుకుంటాయి లాయర్ వశిష్టగా చేసిన రవిశంకర్ పాత్ర కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. తన వాయిస్ అదనపు ఆకర్షణ తండ్రి పాత్రలో మీరు హుందాగా చేశారు. నేపథ్య సంగీతం కూడా పర్లేదు అనిపిస్తుంది. ముఖచిత్రం కోసం వెతుకుతున్న పాయింట్ బాగుంటుంది. కాకపోతే సినిమాలో ఎంగేజింగ్ రక్తి కట్టించేలా చెప్పడంలో డైరెక్టర్ తడబాటు కనిపిస్తుంది.


Share

Related posts

డేట్ లాక్ చేశారు సరే ..పెద్ద సినిమాలొస్తే పరిస్థితేంటి ..?

GRK

సినీ కార్మికులకు హాస్పిటల్ విషయంలో చిరంజీవి కీలక ప్రకటన..!!

sekhar

Balakrishna: బాలయ్య బాబు కోసం మరో సీనియర్ హీరోయిన్ ను తీసుకొస్తున్న గోపీచంద్ మలినేని..??

sekhar