NewsOrbit
న్యూస్ రివ్యూలు సినిమా

Naandhi Review : అల్లరి నరేష్ ‘ నాంది ‘ మూవీ రివ్యూ

Naandhi Review :  చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్ తాను హీరోగా ఒక థ్రిల్లర్ కథాంశంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరలక్ష్మి శరత్ కుమార్, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధానపాత్రలలో నటించిన ‘నాంది’ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు. సతీష్ వేగ్నేశ ఈ సినిమాకు ప్రొడ్యూసర్. శ్రీ చరణ్ పాకల సంగీతం అందించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం….

 

Naandhi review cinema allari naresh
Naandhi review cinema Allari Naresh

Naandhi Review : అసలేంటీ ‘నాంది’…?

రియలిస్టిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ బండి సూర్య ప్రకాష్ గా పరిచయం అవుతాడు. ఇతనిని సినిమా మొదట్లోనే చంచల్ గూడ జైలు కు 14 రోజుల రిమాండ్ కి పంపిస్తారు. అలా ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ వ్యక్తిగా ప్రియదర్శి జైలు లోకి వస్తాడు. ఇతను చంచల్గూడా జైలుకి రెగ్యులర్ గా వచ్చిపోతుంటాడు. యూట్యూబ్ లో అతని పెట్టే వివాదాస్పద టైటిల్స్ వల్ల కేసులు ఫైల్ అయి జైలుకు వస్తుంటాడు. అయితే అక్కడి నుండి కథ అనేక మలుపులు తీసుకొని అల్లరి నరేష్ ఫ్లాష్బ్యాక్ వైపు మళ్ళుతుంది. సామాజిక కార్యకర్త రాజగోపాల్ మర్డర్ కేసు పై పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చివరికి కొన్ని ఆధారాలు అల్లరి నరేష్ వైపు ఎలా తీసుకెళ్తాయి…. అతనిని నిందితుడిగా పరిగణించి ఎలా అరెస్టు చేశారు అన్న విషయాన్ని చూపిస్తారు. మధ్యలో అల్లరి నరేష్, హీరోయిన్ నమధ్య కెమిస్ట్రీ…. వారిద్దరికీ జరిగిన నిశ్చితార్థం…. ఆ తర్వాత చిన్నాభిన్నమైన అల్లరి నరేష్ జీవితం చూపిస్తారు. ఇక ఫ్లాష్బ్యాక్ ముగిసిన తర్వాత ఐదు సంవత్సరాలు అయినప్పటికీ ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంటుంది. అప్పుడే రాధిక శరత్ కుమార్ నుండి వచ్చే ట్విస్ట్ తో మొదటి భాగం ముగుస్తుంది. ఆ తర్వాత నరేష్… అసలేం జరిగిందో తెలుసుకునేందుకు జైలు నుండి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆ తర్వాత వచ్చే కోర్టు సీన్లు…. వాటిలో ఈ హత్యకు సంబంధించిన అనేక కీలక విషయాలు బయటకు వస్తాయి. ఇలా చేయని తప్పుకి ఐదు ఏళ్ళ నుండి శిక్ష అనుభవిస్తున్న అల్లరి నరేష్ దాని నుండి ఎలా బయటపడ్డాడు? అందుకు కారణాలు ఏంటి? అసలు అల్లరి నరేష్ ను ఎవరైనా ఈ కేసులో కావాలనే ఇరికించారా? అతను బయట పడాలంటే ఏం చేయాలి…? బయ‌టకి వచ్చి ఏమైనా చేశాడా? అన్న విషయంపై ఈ కథ తిరుగుతూ ఉంటుంది.

ప్లస్ లు

ఈ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ చాలా బలంగా ఉంది. అల్లరి నరేష్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లు, చేయని తప్పుకు అల్లరినరేష్ జైలులో కుమిలిపోయే సీన్లు దర్శకుడు ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు.

అల్లరి నరేష్ నటన గురించి ఈ సినిమాలో చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎంతో గ్యాప్ వచ్చినప్పటికీ థ్రిల్లర్ కథాంశాలు అల్లరి నరేష్ కు కొత్త కాదు. తన అనుభవాన్ని మొత్తం రంగరించి ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచాడు.

మూవీ లో మరొక ప్రధాన హైలెట్ స్క్రీన్ ప్లే. మామూలుగా థ్రిల్లర్ కథాంశాలకు ఒక టెంప్లేట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. కానీ వాటిని బ్రేక్ చేయాలన్నా కూడా అది థ్రిల్లర్ కథలకే సాధ్యం. అలాంటి ఒక అద్భుతమైన స్క్రీన్ప్లేతో ఊహించని మలుపులతో దర్శకుడు ఈ విషయంలో పూర్తి మార్కులు కొట్టేశాడు అని చెప్పాలి.

ముందుగా చెప్పినట్టు ఎమోషన్స్ తో నిండిపోయిన ఈ కథను దర్శకుడు తనకు నచ్చినట్టు ప్రేక్షకులు ఆలోచించేలా చేస్తాడు. చాలా ఇంట్రెస్టింగ్ గా సాగే కథనంతో థ్రిల్ వస్తుంది… ఆ తర్వాత వచ్చే ఫైట్ లు కోర్టు సీన్స్ వంటివి ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి.

మొత్తం మీద సినిమా లో ఎటువంటి లాగ్ అనేది లేకుండా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, ఎమోషన్స్ తో దర్శకుడు తనలోని వైవిధ్యాన్ని టాలెంట్ మొత్తం ఈ సినిమాలో చూపించేశాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ చిత్రానికి మరొక పెద్ద ప్లస్.

మైనస్ లు

ఈ సినిమాలో అన్ని పాత్రలకు ప్రాముఖ్యత లేకపోవడం ఒక రకంగా మైనస్ అని చెప్పాలి. ముఖ్యమైన పాత్రల నిడివి తక్కువగా ఉండటం కూడా మరొక సమస్య. అయితే పాత్ర క్యారెక్టరైజేషన్ విషయంలో కొద్దిగా ఇబ్బంది పడ్డాడు దర్శకుడు.

సినిమా రెండవ అర్ధ భాగంలో ఎమోషన్ కంటెంట్ పైన పూర్తిగా ఫోకస్ పెట్టి కోర్టు సీన్ లను మరింత రసవత్తరంగా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. అవి ఆసక్తికరంగా ఉన్నప్పటికీ అతని చేతిలో ఉన్న మంచి కంటెంట్ తో వాటిని మరింత థ్రిల్లింగ్ గా, ఇంటరెస్టింగ్ గా చేయవచ్చు అనిపిస్తుంది.

అల్లరి నరేష్ పర్ఫామెన్స్ ముందు మిగిలిన వారు కొద్దిగా తేలిపోయినట్లు కనిపిస్తారు. వరలక్ష్మి శరత్ కుమార్ ను మినహాయించి మిగిలిన క్యాస్టింగ్ ఎవరూ వీరిద్దరి రేంజ్ లో ఫర్ఫార్మెన్స్ చేయలేకపోయారు కాబట్టి ఎక్కడో మనం చిన్న సినిమా చూస్తున్నాము అనే భావన కలుగుతుంది.

Naandhi Review – విశ్లేషణ :

ఈ సినిమా ట్రైలర్ తోనే అల్లరి నరేష్, దర్శకుడు మంచి మార్కులు కొట్టేశారు. ఎంతో మంచి కథాంశంతో వినూత్నమైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాంది సినిమాను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించినట్లు మనకి సీను…. సీన్లో అర్థం అవుతుంది. అల్లరి నరేష్ పర్ఫామెన్స్ కోసం ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్ తలుపు తడతారు. ఎమోషనల్ కంటెంట్ కథ ఆద్యంతం కొనసాగుతూ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ అంశాలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. కానీ ఈ విషయంలో దర్శకుడు కొద్దిగా మెరుగుపడచ్చు అనిపించింది. అయితే ప్రేక్షకులను మాత్రం పూర్తిగా కథలో లీనం చేయడంలో డైరెక్టర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కోర్టు సన్నివేశాలలో మరింత పరిపక్వత కనబర్చవచ్చు. ఇక సినిమా క్లైమాక్స్ కు వచ్చే సరికి కొత్త యాంగిల్ లోకి మారడం బాగున్నా… అది కూడా కొద్ది మంది ప్రేక్షకులకు అది నచ్చకపోవచ్చు. మొతానికి ‘నాంది’ మాత్రం ఒక మంచి ఎమోషనల్ థ్రిల్లింగ్ రైడ్ అనే చెప్పాలి. క్రైమ్ నేపథ్యంలో థ్రిల్లర్ లను ఇష్టపడేవాళ్ళు తప్పక చూడాల్సిన సినిమా మిగిలిన వారు కూడా ఒకసారి చూడవచ్చు.

ఒక్క మాటలో : అల్లరి నరేష్ రెండో ఇన్నింగ్స్ కి ఇదే అసలైన ‘నాంది’

Related posts

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju