నందమూరి కళ్యాణ్‌రామ్ “బింబిసారా” మూవీ రివ్యూ..!!

Share

సినిమా పేరు: బింబిసారా
దర్శకుడు: వశిష్ట
నటీనటులు: నందమూరి కళ్యాణ్‌రామ్, కేథరిన్ థెరీసా, సంయుక్తా మీనన్, వారినా హుస్సేన్, వెన్నెల, ప్రకాష్ రాజ్
నిర్మాతలు: హరికృష్ణ నిర్మాణ సంస్థ…కళ్యాణ్ రామ్
సంగీతం: M. M. కీరవాణి
సినిమాటోగ్రఫీ: ఛోటా కె. నాయుడు

పరిచయం:-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు తీసే కళ్యాణ్ రామ్ ఫస్ట్ టైం సోషియో ఫాంటసీ చిత్రం “బింబిసారా” చేసి అదరహో అనిపించుకున్నారు. మునుపెన్నడూ లేని రీతిలో కళ్యాణ్ రామ్ సరికొత్త అవతారంలో కనిపించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. “బింబిసారా” ట్రైలర్ తోనే ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరగగా ఆ తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలతో.. మరింత అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాలో కళ్యాణ్ రామ్ గెటప్ తో పాటు టైటిల్ కూడా వెరైటీగా ఉండటంతో.. పాటు చాలా రోజుల తర్వాత టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో సినిమా రావటంతో బింబిసారా కి మంచి క్రేజ్ ఏర్పడింది. మరి ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఏ విధంగా రాణించాడో తెలుసుకుందాం…

స్టొరీ విషయానికొస్తే…

త్రిగర్త రాజ్యానికి చక్రవర్తిగా బింబిసారుడు పాత్రలో కళ్యాణ్ రామ్ నటించరు. అత్యంత అగ్రరాజ్యంగా.. తన రాజ్యం ఉండాలని ఆకాంక్షతో అనేక చిన్న చిన్న సామ్రాజ్యాలను కూడా తన ఆధీనంలో ఉండేలా బింబిసారుడు చాలా క్రురంగా ఇతర పట్ల వ్యవహరిస్తాడు. ఎవరి పట్ల దయాజాక్షిణ్యం చూపించకుండా ఉండే బింబిసారుడుకి ఒక పండితుడి శాపం తగులుద్ది. దీంతో మోడరన్ కాలానికి బింబిసారుడు రావటం జరుగుద్ది. అయితే వర్తమాన కాలంలో ఒక నిధిని దాచి పెట్టడం మాత్రమే కాదు అందులో వైద్యానికి సంబంధించిన ధన్వంతరి పుస్తకం కూడా రహస్యంగా దాస్తాడు. అయితే ఆ పుస్తకాన్ని సాధించటం కోసం ప్రస్తుత కాలంలో ఓ వ్యక్తి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దీంతో రాజుల కాలం నుండి మోడరన్ కాలంలోకి వచ్చిన బింబిసారుడు.. తాను దాచిన నిధిని మరియు వైద్య పుస్తకాన్ని ఎలా కాపాడుకున్నాడు..? మళ్లీ తిరిగి రాజుల కాలానికి ఎలా చేరాడు అనేది తెలుసుకోవాలంటే “బింబిసార” సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:-

 

డైరెక్టర్ వంశీ వశిష్ట కొత్త దర్శకుడు అయినా గాని “బింబిసార” తెరకెక్కించడంలో తన టాలెంట్ ఏంటో నిరూపించాడు. మంచి బలమైన కథ అయినా గాని తెరమీద అద్భుతంగా ప్రజెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సోషియో ఫాంటసీ టైం ట్రావెల్ కథ కావటంతో స్క్రీన్ ప్లే విషయంలో ఎక్కడా కూడా తేడా రాకుండా చాలా జాగ్రత్తగా తీసుకున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ పర్ఫామెన్స్ విషయానికొస్తే మరోసారి ఫాంటసీ కథలకు నటనకు కేరాఫ్ అడ్రస్ నందమూరి వంశమని తన నటనతో నిరూపించాడు. ఫస్టాఫ్ సినిమా ఓ రేంజ్ లో ఉంది. ఇక సెకండాఫ్ వచ్చేసరికి అక్కడక్కడ మగధీర ఇంకా బాహుబలి సన్నివేశాల ఫ్లేవర్ కనిపిస్తూ ఉంటుంది. సినిమా మొత్తానికి కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ ఆర్మీ టైపు నడిపించాడు. కేథరిన్ తేరిసా, సంయుక్త మీనన్ ఇద్దరు టాప్ మోస్ట్ హీరోయిన్లు ఉన్నాగాని పెద్దగా వాళ్ళ పాత్రలకు ప్రాధాన్యత ఏమి కనిపించలేదు. ఇక సెకండాఫ్ లో కొద్దిగా సన్నివేశాలు సాగదీసినట్లు ఇంకా కామెడీ సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. క్లైమాక్స్ లో కూడా కొద్దిగా మిస్ ఫైర్ అయినట్టు..ఓవరాల్ గా చూసుకుంటే “బింబిసార” ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. బింబిసారుడు పాత్రలో రెండు విభిన్నమైన కళ్యాణ్ రామ్ గెటప్ లు సినిమాకి హైలెట్. ఇక మోడ్రన్ పాత్రలో కూడా కళ్యాణ్ రామ్ బాగానే ఆకట్టుకున్నాడు. ఇక మ్యూజిక్ అందించిన కీరవాణి సినిమాకి ప్రాణం పోశాడు అని చెప్పవచ్చు. కీరవాణి అందించిన మ్యూజిక్ సినిమాకి మంచి ఇంపాక్ట్ కలిగించింది. ఇక ప్రకాష్ రాజ్ కి ఎలాంటి పాత్ర ఇచ్చినా గాని దానిలో ఒదిగిపోయే రకమని అందరికీ తెలుసు. విఎఫ్ ఎక్స్ గ్రాఫిక్ వర్క్ కూడా పర్వాలేదు అనిపించింది. క్రీస్తుపూర్వానికి 500 సంవత్సరానికి ప్రస్తుత కాలానికి లింకు చేస్తూ టైం ట్రావెల్ సోషియో ఫాంటసీ చిత్రంగా అభిమానులను బాగానే ఆకట్టుకుంది.

 

ప్లస్ పాయింట్స్:-

కళ్యాణ్ రామ్ నటన

ఫస్టాఫ్

కీరవాణి మ్యూజిక్

చోటా కె నాయుడు కెమెరా వర్క్.

మైనస్ పాయింట్స్:-

విలన్ పాత్ర

ఇద్దరు హీరోయిన్ పాత్రలు

సెకండ్ ఆఫ్

 

ఓవరాల్ గా:

“బింబిసార” రూపంలో టైం ట్రావెల్ సోషల్ సినిమా గతంలో విజువల్ త్రిల్లర్ గా బాలకృష్ణ నటించిన “ఆదిత్య 369” నీ తలపించింది అని చెప్పవచ్చు.

 

రేటింగ్ : 3/5


Share

Recent Posts

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

59 mins ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

1 hour ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం .. ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…

6 hours ago