NewsOrbit
రివ్యూలు

లాజిక్ లెస్ థ్రిల్లర్

నటీనటులు: కల్యాణ్‌రామ్‌, నివేదా థామస్‌, షాలిని పాండే, నాజర్‌, హర్షవర్థన్‌, ప్రభాస్‌ శ్రీను తదితరులు
మ్యూజిక్: శేఖర్‌ చంద్ర
ఎడిటింగ్‌: తమ్మిరాజు
సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.వి.గుహన్‌
నిర్మాత: మహేష్‌ ఎస్‌ కోనేరు
బ్యానర్‌: ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ: 01-03-2019
నిడివి – 126 నిమిషాలు..

కథ
ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా ఓ చానెల్‌లో పనిచేసే గౌతమ్ (కళ్యాణ్ రామ్)కి అతని మేనమామ కుమార్తె మేఘ (షాలినీ పాండే)తో వివాహం ఫిక్స్ చేస్తారు. ఈ వేడుకలో భాగంగా గౌతమ్ ఓ రిసార్ట్ లోని 118 అనే రూమ్‌లో స్టే చేస్తాడు. ఆ రోజు రాత్రి సరిగ్గా 1:18 నిమిషాలకు అతనికి ఓ కల వస్తుంది. మరోసారి కూడా అదే రిసార్ట్ లో స్టే చేసిన అతనికి అదే కల మళ్లీవస్తుంది. గౌతమ్ కి వచ్చిన కలలో ఆద్య (నివేథా థామస్)ను ఎవరో తీవ్రంగా కొట్టడం, ఓ కారును పెద్ద కొండ మీదనుంచి చెరువులో పడేయటం లాంటి సంఘటనలు కనిపించటంతో గౌతమ్‌ ఆ కల తనకి ఎందుకు వస్తుంది? అసలు ఆద్య ఉందా? ఉంటే ఆమెని ఎవరు చంపాలనుకున్నారు అనే విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో కలలో కనిపించిన ప్రాంతాలు గౌతమ్ కి నిజజీవితంలో కనిపిస్తాయి. దాంతో ఆద్య ఎక్సిస్టెన్సీ గురించి బలంగా నమ్మి, ఆమెకోసం వెతుకులాట మొదలుపెడుతాడు. ఏ విషయాన్ని అయినా మొదలుపెడితే మధ్యలో వదిలేసే అలవాటులేని గౌతమ్‌ ఆద్యని వెతికే క్రమంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? ఆద్య ఎవరు? ఆమె గురించే అతడికి ఎందుకు కలలు వస్తుంటాయి? ఆద్యకి గౌతమ్ కి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ
ఇజం సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించిన కల్యాణ్‌ రామ్‌ మరోసారి స్టైలిష్ జర్నలిస్ట్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. థ్రిల్లర్ కథకి తగ్గట్లు తన లుక్ మార్చిన కళ్యాణ్ రామ్, కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఎన్టీఆర్ కి టెంపర్ సినిమా ఎంత పేరు తెచ్చిందో, టాక్ తో సంబంధం లేకుండా కళ్యాణ్ రామ్ కి ఈ 118 సినిమా అంత పేరు తెస్తుంది. ఆద్య పాత్రలో నటించిన నివేథా థామస్ నటన 118 సినిమాకే హైలెట్‌గా నిలిచింది. నివేద స్క్రీన్ టైమింగ్ తక్కువే అయినా తన నటనతో ఆకట్టుకుంది. మరో హీరోయిన్ షాలిని పాండే పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ లేకున్నా కూడా ఉన్నంతలో మంచి నటనే కనబరిచింది. ఇతర పాత్రల్లో హరితేజ, ప్రభాస్‌ శ్రీను, నాజర్‌ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. మొదటిసారి తెలుగు సినిమాకి దర్శకత్వం వహించిన గుహాన్ అతను చెప్పాలనుకున్న కథని సూటిగా సుత్తిలేకుండా చెప్పిన విధానం బాగుంది. సినిమా మొదలైన 15 నిమిషాల్లోపే ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిన గుహాన్ మూవీలో ఎక్కడ సుత్తి లేకుండా చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేశాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే వరకూ చాలా గ్రిప్పింగా సాగిన కథనం, 118కి అతిముఖ్యమైన ‘ల్యూసిడ్ డ్రీమింగ్’ అనే పాయింట్ ని బలంగా చెప్పడంలో కాస్త తడబడిన దర్శకుడు, ప్రీ-క్లైమాక్స్ నుంచి సినిమాని మరింత బలంగా రాసుకోని ఉంటే బాగుండేది. ముఖ్యంగా డాక్టర్ పాత్రలో కనిపించిన నాజర్ సీన్స్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. లాజిక్స్ ని పక్కన పెట్టి, 118ని చూస్తే మాత్రం ఈ సినిమాని కంప్లీట్ గా ఎంజాయ్ చెయ్యొచ్చు లేదంటే మాత్రం ఒక దశ దాటిన తర్వాత ఒక సాధారణ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది. ఇక టెక్నీకల్ విషయాలకి వస్తే గుహన్ సినిమాటోగ్రఫీ 118 మూవీకే హైలెట్ గా నిలిచింది, థ్రిల్లర్ కి కావాల్సిన పెర్ఫెక్ట్ విజువల్స్ ని చూపించాడు. బ్యాక్ గ్రౌండ్, ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ఫైనల్ వర్డిక్ట్ – లాజిక్ లెస్ థ్రిల్లర్

author avatar
Siva Prasad

Related posts

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar

Leave a Comment