Narappa Review: ‘నారప్ప’ మూవీ రివ్యూ

Share

Narappa Review: ‘విక్టరీ’ వెంకటేష్, ప్రియమణి జంటగా నటించిన తమిళ చిత్రం ‘అసురన్’ రిమేక్ ‘నారప్ప’ నిన్న రాత్రి అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తెలుగులో రిమేక్ రైట్స్ ను సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు కొనుక్కున్నాడు. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం….

 

Narappa Review on Amazon Prime
Daggubati Venkatesh as Narappa

కథ

అనంతపురం దగ్గర్లోనే ఒక చిన్న పల్లెటూరు లో నారప్ప (వెంకటేష్)… అతని భార్య ప్రియమణి, ఒక కూతురు, ఇద్దరు కొడుకులతో ప్రశాంతమైన జీవితం గడుపుతుంటాడు. అదే ఊరిలో పెద్దమనిషి, ధనికుడు అయిన పాండుసామి ఎలాగైనా నారప్ప పొలాన్ని కాజేయాలని చూస్తాడు. అదే సమయంలో పాండుసామి కొడుకుతో నారప్ప పెద్ద కొడుకు మునికన్నా గొడవ పడతాడు. మునికన్నా పాండుసామి కొడుకుని చితకబాదగా ప్రతీకారంగా పాండుసామి మునికన్నా నన్ను చంపిస్తాడు. అందుకు ప్రతీకారంగా నారప్ప చిన్న కొడుకు తన అన్న ని చంపిన పాండుసామిని చంపేస్తాడు. దీంతో ఊర్లో కలకలం రేగుతోంది. నారప్ప కుటుంబాన్ని చంపేయాలని పాండుసామి కుటుంబం ప్రయత్నిస్తున్న సమయంలో అసలు నారప్ప గతం ఏమిటి..? అతను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఇక్కడికి వచ్చాడు…? చివరికి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు…? ఊరిలో ఈ రెండు కుటుంబాల మధ్యన చిచ్చు తగ్గిపోయిందా లేదా అన్నది మిగిలిన కథాంశం.

ప్లస్ లు

  • సినిమా తమిళ రీమేక్ అయినా ఎక్కడ సాంబార్ వాసన రాకుండా తెలుగు బ్యాక్ గ్రౌండ్ తో మంచి లోకేషన్స్ లో అత్యున్నత విలువలతో నిర్మించిన ఈ చిత్రం చూసేందుకు చాలా బాగుంటుంది.
  • తమిళ ‘అసురన్’ సినిమా లోని ఎమోషన్స్ ను స్క్రీన్ పైన అంతే మోతాదులో పండించడంలో శ్రీకాంత్ అడ్డాల సఫలం అయ్యాడు. ఎక్కడా ప్రయోగాలకు పోకుండా ఒక కల్ట్ సినిమాని ఉన్నది ఉన్నట్లుగా దించేశాడు.
  • ఇక వెంకటేష్ విషయానికి వస్తే తన సినీ జీవితం లోని అత్యుత్తమ ప్రదర్శన లలో ఇది ఒకటిగా మిగిలిపోతుంది. ఇప్పటివరకూ వెంకటేష్ ను ఇంతటి రౌద్రంగా, హింసాత్మకంగా చూపించే క్యారెక్టర్లో మీరు చూసి ఉండరు.
  • జాతీయ అవార్డు గ్రహీత నటి ప్రియమణి కూడా తన పాత్ర లో అదరగొట్టింది. వెంకటేష్, ప్రియమణి మధ్య సన్నివేశాలు వారి పెద్ద కొడుకు చనిపోయినప్పుడు వారు పండించిన మోషన్స్ అయితే ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి.

మైనస్ పాయింట్స్

  • మొదటి అర్ధ భాగంలో ఎంతో ఎమోషనల్ గా ఉండే సినిమా రెండవ భాగం కి వచ్చేటప్పటికి కొద్దిగా తగ్గుతుంది. సినిమా గతంలో జరిగే సన్నివేశాలు కొద్దిగా ఫ్లో దెబ్బతీస్తాయి.
  • తమిళ ‘అసురన్’ రిమేక్ నారప్ప. అందులో కుల వివక్ష ఫోకస్ పాయింట్. కానీ నారప్ప లో పేద-ధనిక వ్యత్యాసం అననే పాయింట్ మీద అదే కథని చెప్పారు. ఇది కొంత మంది ప్రేక్షకులకు నప్పకపోవచ్చు.
  • ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో వెంకటేష్, అమ్ము అభిరామి మధ్య వచ్చిన సీన్లు పెద్దగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. 
  • ముందే తమిళంలో ‘అసురన్’ సినిమా చూసిన వారు తెలుగులో చూస్తే బోర్ ఫీలయ్యే అవకాశం ఉంది. దాదాపుగా సీన్ టు సీన్ అలాగే తీశారు కాబట్టి పెద్ద థ్రిల్లింగ్ గా అనిపించికపోవచ్చు.

విశ్లేషణ

మొత్తంగా చెప్పాలంటే ‘నారప్ప’ సినిమా ఒక సమస్యను ప్రస్తావిస్తూ తీసిన హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో ప్రేక్షకులకు అవసరమైన డ్రామా, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. రెండవ అర్ధ భాగంలో సినిమా కొద్దిగా డల్ అయినప్పటికీ మొత్తంగా సినిమా మాత్రం ‘అసురన్’ ఇచ్చిన ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. ‘అసురన్’ చూసిన వారిలో అయితే డైరెక్టర్ కుల వివక్ష పైన తెరకెక్కిన చిత్రాన్ని ఇలా ఎందుకు మార్చారు అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఇకపోతే… వెంకటేష్-ప్రియమణి నటన, కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల సహా మిగిలిన సైడ్ క్యారెక్టర్లు కూడా తమ పాత్రలని అద్భుతంగా పోషించారు. రెండు కుటుంబాల మధ్య ఉన్న వివక్ష, విభేదాలను చూపించడంలో దర్శకుడు సఫలం కాగా మణిశర్మ సంగీతం కూడా ఈ చిత్రాన్ని మరింత ఎత్తు కి తీసుకువెళుతుంది. కాబట్టి అమెజాన్ ప్రైమ్ లో ‘నారప్ప’ సినిమా ను ఒకసారి వెంకటేష్ పర్ఫార్మెన్స్ కోసం చూసేయండి.

చివరి మాట: ‘నారప్ప’ అంటే వెంకటేష్ సినిమా కానీ ‘అసురన్’  తెలుగు వర్షన్ కాదు…


Share

Related posts

CBI: సీబీఐ కొత్త చీఫ్ ఎంపిక కసరత్తు ..! ఈ ముగ్గురిలో కొత్తబాస్ ఎవరవుతారో.. ?

somaraju sharma

కేసీఆర్ జాతీయ పార్టీ పై క్లారిటీ ఇచ్చిన హరీష్ రావు…!!

sekhar

అధీర‌గా చేస్తోంది ఆ స్టార్ న‌టుడేనా?

Siva Prasad