NewsOrbit
Entertainment News రివ్యూలు సినిమా

Malli Pelli Review in Telugu: నరేష్…. పవిత్ర లోకేష్ జంటగా నటించిన “మళ్లీ పెళ్లి” సినిమా ఫుల్ రివ్యూ..!!

Share

Malli Pelli Review in Telugu: సీనియర్ హీరో నరేష్ మరియు పవిత్ర లోకేష్ నిజజీవితంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తరలిన “మళ్లీ పెళ్లి” సినిమా శుక్రవారం మే 26వ తారీకు విడుదలయ్యింది. ఈ సినిమా రిలీజ్ అవ్వకు ముందు..ఈ సినిమా స్టోరీ దాదాపు వెబ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో.. వైరల్ అయిన సన్నివేశాలు మరియు సంఘటనలే. వాటిని ఆధారం చేసుకుని ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది.
సినిమా: మళ్లీ పెళ్లి
నటినటులు: నరేష్, పవిత్ర లోకేష్, శరత్ బాబు, జయసుధ, అన్నపూర్ణ, వనిత విజయ్ కుమార్ తదితరులు
ఎడిటింగ్: జునైద్ సిద్దికి
సంగీతం: సురేష్ బొబ్బిలి, అరుళ్ దేవ్
నిర్మాత: నరేష్
దర్శకత్వం: ఎమ్మెస్ రాజు
విడుదల తేదీ: 26 మే 2023
Naresh and Pavitri Lokesh starring Malli Pelli movie full review
పరిచయం:

సీనియర్ నటుడు నరేష్ ఒకప్పుడు హీరోగా చాలా సినిమాలే చేయడం జరిగింది. అదేవిధంగా పవిత్ర లోకేష్ కూడా హీరోయిన్ గా అప్పట్లో అనేక సినిమాలు చేయటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ సీనియర్ నటులైనా గానీ సాహసం చేసి హీరో హీరోయిన్ గా మళ్లీ పెళ్లి అనే సినిమా చేయడం జరిగింది. ఈ ఇద్దరు ప్రధాన పాత్రధారులుగా చేసిన ఈ సినిమాకి ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు. స్వయంగా నరేష్ తానే నిర్మాణం చేయడం జరిగింది. ఈ సినిమా మొదటినుంచి వివాదాస్పదం కావడంతో… నరేష్ నుంచి విడిపోయిన మూడో భార్య రమ్య రఘుపతి.. స్టే కోరుతూ నరేష్ కి నోటీసులు జారీ చేసింది. నరేష్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తరికెక్కిన ఈ సినిమా… ఎన్నో చిక్కుముడులను దాటుకుని మే 26వ తారీకు విడుదలయ్యింది. మరి “మళ్లీ పెళ్లి” సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

స్టోరీ:

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ హీరో నరేంద్ర (వికే నరేష్) కు… ఆయన మూడో భార్య సౌమ్య సేనాపతి (వనిత విజయ్ కుమార్) మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఒక బిడ్డకు జన్మనిచ్చాక కాపురంలో గొడవలు మొదలవుతాయి. ప్రశాంతత కావాలనుకున్న నరేంద్ర జీవితంలోకి మరో ప్రముఖ నటి..అల్ రెడీ పెళ్లి అయి… ఇద్దరు పిల్లలకు తల్లి అయిన పార్వతి (పవిత్ర లోకేష్) ఎలా వచ్చింది..? ఆమె జీవితం వెనక జరిగిన సంఘర్షణ ఏమిటి..? ఆమె కోసం నరేంద్ర ఏం చేశాడు అనేది సినిమా స్టోరీ.

Naresh and Pavitri Lokesh starring Malli Pelli movie full review
విశ్లేషణ..

దాదాపు నరేష్ నిజజీవితంలో జరిగిన స్టోరీయే.. “మళ్లీ పెళ్లి” కథ. అంతకుముందు సినిమాలో చూసిన సన్నివేశాలు మీడియాలో కనిపించినవే. ఓ రకంగా మూడో భార్యపై పగ తీర్చుకోవడానికి ఈ సినిమా తీసినట్లుంది. ఇదే సమయంలో అసలు పవిత్ర లోకేష్ కి తన జీవితంలో ఎందుకంత ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది అనేది కూడా నరేష్ ఈ సినిమా ద్వారా సమాజానికి చెప్పకనే చెప్పేశాడు. సినిమా మొత్తం చూస్తే నరేష్ మూడో భార్య అదేవిధంగా పవిత్ర భర్తలు అసలు మంచి వాళ్ళు కాదు అనిపిస్తుంది. ఆస్తికోసం వాళ్లను పెళ్లి చేసుకున్నారనేది ఓవరాల్ పాయింట్. మరి వాస్తవం ఏంటో అసలు సంగతి ఏంటో.. చెప్పలేం. కానీ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఇంకా విషయాలు చాలా బోల్డ్ గా చూపించారు.. దర్శకుడు ఎమ్మెస్ రాజు. ఇదే రీతిలో పవిత్ర లోకేష్ తో నరేష్ ప్రేమ బంధాన్ని కూడా చాలా అద్భుతంగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం జరిగింది. సినిమాలో సౌమ్య పాత్రని విలన్ గా చూపించడం జరిగింది. ఇదే సమయంలో పార్వతీ భర్తతో ఆమె జీవితం ఎలా సాగిందో… అతని దగ్గర ఆమెకు కరువైంది… ఏమిటో…నరేష్ కి ఎందుకు దగ్గరవాల్సి వచ్చిందో.. “మళ్లీ పెళ్లి” సినిమాలో అద్భుతంగా చూపించడం జరిగింది. ఇక ఈ సినిమాలో నరేష్ తల్లి విజయనిర్మల పాత్రలో జయసుధ, సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో శరత్ బాబు నటించరు. సినిమా మొత్తం చాలా వరకు నరేష్, పవిత్ర లోకేష్, వనిత విజయ్ కుమార్ ల చుట్టూనే సన్నివేశాలు సాగుతాయి. మూడో భార్య సౌమ్య విషయంలో నరేష్ వ్యవహరించిన కొన్ని సన్నివేశాలు కాస్త చిరాకు అనిపిస్తాయి.

 

ప్లస్ పాయింట్స్…..

నరేష్ పవిత్ర నటన
క్లైమాక్స్
రొమాంటిక్ సీన్స్

మైనస్ పాయింట్స్….

అనవసరమైన సన్నివేశాలు
ఫస్టాఫ్
రియాల్టీ లో ఉన్న స్టాఫ్ స్క్రీన్ మీద లేకపోవడం.


Share

Related posts

పరోక్షంగా ఆ కామెంట్లు కొరటాల గురించే చిరంజీవి అన్నారంటన్న నెటిజెన్లు..??

sekhar

Prabhas: ప్ర‌భాస్ జోరు.. ఒకేసారి రెండూ కానిచ్చేస్తున్నాడు!

kavya N

Prabhas Yaash: ప్రభాస్ మూవీలో “కేజిఎఫ్” హీరో యాష్..??

sekhar