NewsOrbit
రివ్యూలు

Oh Baby రివ్యూ

బ్యాన‌ర్స్‌:  సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్, క్రాస్ పిక్చ‌ర్స్‌
న‌టీన‌టులు: సమంత అక్కినేని, నాగ‌శౌర్య‌, ల‌క్ష్మి, రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, తేజ స‌జ్జ‌, ప్ర‌గ‌తి త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం:  బి.వి.నందినీ రెడ్డి
నిర్మాత‌లు:  సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్ర‌సాద్‌, హ్యున్ హు, థామ‌స్ కిమ్
బ్యాన‌ర్స్‌:  సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్, క్రాస్ పిక్చ‌ర్స్‌
స‌హ నిర్మాత‌లు:  వివేక్ కూచిబొట్ల‌, యువ‌రాజ్ కార్తికేయ‌న్‌, వంశీ బండారు
ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు:  విజ‌య్ డొంకాడ‌, దివ్యావిజ‌య్‌
మ్యూజిక్‌:  మిక్కి జె.మేయ‌ర్‌
కెమెరా:  రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌
డైలాగ్స్‌:  ల‌క్ష్మీ భూపాల్‌
ఎడిట‌ర్‌:  జునైద్ సిద్ధిఖీ
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  జ‌య‌శ్రీ ల‌క్ష్మీనారాయ‌ణ‌న్‌
ఆర్ట్‌:  విఠ‌ల్‌.క

`యూ ట‌ర్న్‌`తో లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు మొగ్గు చూపిన స‌మంత.. ఆ క్ర‌మంలో చేసిన మ‌రో లేడీ ఓరియెంటెడ్ మూవీ `ఓ బేబీ`. కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ`కి ఇది తెలుగు రీమేక్‌. 70 బామ‌…24 ఏళ్ల ప‌డుచుపిల్ల‌గా మార‌డ‌మే క‌థాంశం అని టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూస్తేనే అర్ధ‌మైపోతుంది. పోయిన వ‌య‌సు తిరిగి రావ‌డ‌మంటే మాట‌లు కాదు.. మ‌రి అలాంటి పాయింట్‌తో తెర‌కెక్కిన `ఓ బేబీ` చిత్రం ప్రేక్ష‌కులను ఏ మేర ఆక‌ట్టుకుందో తెలుసుకోవాల‌నే ఆస‌క్తి ప్రేక్ష‌కుల్లో పెరిగింది. మ‌రి నిజంగా `ఓ బేబీ` ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్ట‌కుందా? స‌మంత స‌క్సెస్‌ను ద‌క్కించుకుందా?  లేదా?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

క‌థ‌:
సావిత్రి అలియాస్ బేబి(ల‌క్ష్మి)..స్నేహితుడు చంటి(రాజేంద్ర ప్ర‌సాద్‌)తో క‌లిసి  కాలేజ్‌లోక్యాంటీన్ ర‌న్ చేస్తుంటుంది. పిల్ల‌ల ప‌ట్ల ఆమె చూపించే అతి ప్రేమ‌, వారికి చాలా సంద‌ర్భాల్లో విసుగును తెప్పిస్తుంటుంది. బేబీ ఇబ్బందితో కోడ‌లు(ప్ర‌గ‌తి)కి హార్ట్ ఎటాక్ కూడా వస్తుంది. అత్తా కోడ‌ళ్లు దూరంగా ఉంటేనే మంచిద‌ని డాక్ట‌ర్ చెబుతాడు. ఆ విష‌యం త‌న‌కు కొడుకు చెప్ప‌లేక‌పోతున్న సంద‌ర్భంలో మ‌న‌వ‌రాలి ద్వారా తెలుసుకుని బాధ‌ప‌డ్డ బేబీ క్యాంటీన్‌కు వెళుతుంది. అక్క‌డ చంటికి విషయం చెప్పి బాధ‌ప‌డి.. త‌న‌కు చిన్న‌ప్ప‌టి నుండి క‌ష్టాల‌నే ఇచ్చిన దేవ‌డ్ని తిడుతుంది. తన‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్లు బ్ర‌తికే హ‌క్కును దేవుడు ఇవ్వ‌లేద‌ని సావిత్రి దూషించ‌డంతో స్వయంగా ఆ దేవుడే వ‌చ్చి బేబీకి ఆమె కోల్పోయిన వ‌య‌సుని తిరిగి ఇచ్చేస్తాడు. అలా వ‌య‌సు తిరిగి రావ‌డంతో బేబీ చాలా సంతోష‌ప‌డుతుంది. ఆక్ర‌మంలో ఆమెకు కొత్త త‌ర‌హా బాధ‌లు కూడా వ‌స్తాయి. ఆ బాధ‌లేంటి? అస‌లు విక్ర‌మ్ ఎవ‌రు?  చివర‌కు కుటుంబం కోసం బేబీ ఎలాంటి త్యాగం చేస్తుంది?  అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

స‌మీక్ష‌:
న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే స‌మంత టైటిల్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించింది. హావ‌భావాల‌ను మ‌సలి ల‌క్ష్మితో, ఆమె అనుభ‌వాల‌తో పోల్చుతూ చేయ‌డం అంటే చిన్న విష‌యం కాదు. స‌మంత ఆ పాత్ర‌ను చ‌క్క‌గా క్యారీ చేసింది. ఇక సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి.. కోడ‌లుపై కోపం చూపే అత్త‌గారిగా, కొడుకంటే ప్రేమ ఉండే తల్లిగా, నాయ‌న‌మ్మ‌గా ఆమె పాత్ర‌లో ఒదిగిపోయారు. ఇక బేబీ స్నేహితుడు చంటి పాత్ర‌లో రాజేంద్ర ప్ర‌సాద్ న‌ట‌న చాలా బావుంది. ఈ పాత్ర ద్వారా, స‌మంత పాత్ర ద్వారానే కామెడీ జ‌న‌రేట్ అవుతుంది. స‌మంత‌నే త‌న బేబీ అని తెలుసుకున్న‌ప్పుడు రాజేంద్ర ప్ర‌సాద్ చేసే ప‌నులు ప్రేక్ష‌కుల‌కు న‌వ్వును తెప్పిస్తాయి. ఇక రావు ర‌మేశ్ ప్రొఫెస‌ర్ పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించారు. విక్ర‌మ్ పాత్ర‌లో నాగ‌శౌర్య, బేబీ మ‌న‌వ‌డి పాత్ర‌లో తేజ, కోడ‌లుగా ప్ర‌గ‌తి ఇలా అంద‌రూ వారి వారి పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. ఇక సాంకేతికంగా చూస్తే ద‌ర్శ‌కురాలు నందినీ రెడ్డి సినిమాను అద్భుతంగా ఆవిష్క‌రించారు. సినిమాలో కామెడీ కోణాన్నే కాదు.. సెంటిమెంట్ యాంగిల్‌ను కూడా చ‌క్క‌గా ప్రెజంట్ చేశారు. ఫ‌స్టాఫ్ అంతా పూర్తి కామెడీతో సాగితే.. సెకండాఫ్ అంతా కామెడీ, ఎమోష‌న్స్‌తో సాగుతుంది. ఇక సినిమాలోచివ‌ర‌లో రాజేంద్ర ప్ర‌సాద్.. చైత‌న్య‌గా మారే విధానం అంద‌రికీ న‌చ్చ‌తుంది. మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. రిచ‌ర్డ్ ప్రసాద్ కెమెరా ప‌నిత‌నం బావుంది.
చివ‌ర‌గా.. ఓ బేబీ.. ఫీల్ గుడ్ మూవీ
రేటింగ్‌: 3.25/5
author avatar
Siva Prasad

Related posts

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar

Leave a Comment