25.2 C
Hyderabad
January 31, 2023
NewsOrbit
రివ్యూలు సినిమా

Panchathantram Movie Review: హార్ట్ టచింగ్ కథలతో ఆకట్టుకున్న పంచతంత్రం.. కానీ అదొక్కటే మైనస్..

Share

Panchathantram Movie Review: ఐదు డిఫరెంట్ స్టోరీలతో వచ్చిన ఆంథాలజీ మూవీ ‘పంచతంత్రం’ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. హర్ష పులిపాక కథ రాసి డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 9న రిలీజ్ అయింది. బ్ర‌హ్మానందం, స‌ముద్రఖ‌ని, కలర్స్ స్వాతి వంటి స్టార్ క్యాస్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఎంత మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు తెలుసుకుందాం.

* కథ ఏంటి

Panchathantram Movie Review

ఈ సినిమాలో బ్రహ్మానందం ఉన్నాడన్న మాటే కానీ అతడి కామెడీ ఎక్కడా కూడా కనిపించదు. ఈ కమెడియన్ పోస్ట్ రిటైర్మెంట్ వయసులో ఒక రచయితగా మారి యంగ్ రైటర్స్ పాల్గొనే ఒక స్టోరీ టెల్లింగ్ కాంటెస్ట్‌లో పాల్గొంటాడు. అందులో ఐదు కథలను చెబుతూ వాటిని పంచేంద్రియాలుగా వర్ణిస్తాడు. ఐదు కథల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విహారి (నరేష్ అగస్త్య) బీచ్ చూడటం ఒక కథ. ఇది పంచంద్రియాలలో కంటి చూపుకు సంబంధించింది. సుభాష్ (రాహుల్ విజయ్) అనే ఒక యువకుడు పెళ్లి కోసం లేఖ (శివాత్మిక రాజశేఖర్) అనే ఒక అమ్మాయిని కలవడం, ఆమెతో చిన్నప్పటి లవ్ స్టోరీ నుంచి అన్ని విషయాలు మాట్లాడుకోవడం, పర్ఫెక్ట్ వైఫ్ అండ్ హస్బెండ్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకోవడం అనేది ఇంకొక కథ. ఈ కథలో కేక్ తయారు చేసే చోటికి వీరిద్దరు వచ్చి కలుస్తారు కాబట్టి ఇది టేస్ట్‌కి సంబంధించింది.

రక్తాన్ని ఎక్కువగా వాసన చూడటం, అవసరం లేకపోయినా పరిసరాలు ఎక్కువగా శుభ్రం చేసుకోవడం వంటి వింత వ్యాధితో బాధపడుతున్న రామనాథన్ (సముద్రఖని) ఎలా బయటపడతాడనేది మరొక కథ. ఇది వాసనా అనే ఇంద్రియానికి సంబంధించినది. కొత్తగా పెళ్లయిన దేవి (దివ్య శ్రీపాద), శేఖర్ (వికాస్) అనే భార్యాభర్తలు ఒక వింత సమస్యను ఎదుర్కొంటారు. కడుపుతో ఉన్నప్పుడు దేవికి ఒక జబ్బు వస్తుంది. అప్పుడు భర్త తల్లిదండ్రులు ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయి, భార్యాభర్తలు ఈ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు అనేది మరో కథ. ఇది స్పర్శ అనే ఇంద్రియానికి సంబంధించింది. చివరి కథలో ఎటూ కదల్లేని శారీరక స్థితిలో ఉన్న చిత్ర(స్వాతి రెడ్డి) పిల్లల ఆడియో సిరీస్‌లో లియో అనే ఒక సూపర్ హీరో క్యారెక్టర్ కి వాయిస్ అందిస్తుంది. అలా చిన్న పిల్లలను ఆమె ఎంతగానో కదిలిస్తుంది. ఇది వినికిడికి సంబంధించింది.

* అనాలసిస్

Panchathantram Movie Review

పంచేంద్రియాలతో ఐదు కథలను చెప్పడం అనేది చాలా కొత్త ఐడియా. అయితే ప్రతి కథలో ఒక అంతరార్థం దాగుండటం ఈ సినిమా గొప్పతనం. సక్సెస్ కావాలంటే వయసుతో సంబంధం లేదని చెప్పడం, ఉరుకుల పరుగుల జీవితంలో బ్రేక్ తీసుకొని ప్రపంచాన్ని చూసి ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఉందని తెలపడం, పెళ్లి చేసుకునేటప్పుడు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం, మనసులోని భయాన్ని వదిలేయడానికే క్షణం కూడా పట్టదని నొక్కి వక్కాణించడం, పెళ్లి జీవితంలో ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటే ఎలాంటి సమస్య నుంచైనా బయటపడగలరని తెలియజేయడం, ఏ పరిస్థితుల్లో ఉన్నా మనసుంటే లక్షలాది మందిని కదిలించవచ్చని చెప్పడం ఈ మూవీ దర్శకుడు లక్ష్యం కాగా అది కరెక్ట్‌గా చెప్పగలిగాడు. ఐదు కథలతో పాటు చెప్పాలనుకున్న విషయాన్ని బ్రహ్మానందంతో చాలా స్పష్టంగా చెప్పింది ప్రేక్షకుడికి అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చేయగలిగాడు. కాకపోతే మొదటి మూడు కథలను చాలా స్లోగా చెప్పడం వల్ల ప్రేక్షకుల సహనానికి ఈ మూవీ ఒక పరీక్ష లాగా తలపిస్తుంది. చివరి రెండు స్టోరీలు మాత్రం చాలా ఎమోషనల్‌గా హార్ట్ టచ్చింగ్గా ఉండి థియేటర్ వదిలి వెళ్లిపోయేటప్పుడు ముఖాలపై చిరునవ్వుని తెస్తాయి.

* పర్ఫామెన్స్

ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరు తమ పాత్రల మేరకు బాగా నటించి అలరించారు. ఇక టెక్నికల్‌గా కూడా ఈ మూవీ ఎక్కడా ఇబ్బంది పెట్టదు. ఇది మోడరన్ లవ్ హైదరాబాద్‌లాగా ఐదు ఎపిసోడ్‌ల సిరీస్‌లా సాగుతుంది. ఫస్ట్ మూడు పార్ట్స్ బోరింగ్ గా అనిపించినా తర్వాత రెండు మనిషిని హత్తుకుంటాయి కాబట్టి దీనిని ఓసారి చూసేందుకు ప్రేక్షకులు కన్సిడర్ చేయొచ్చు.


Share

Related posts

Nikhil : నిఖిల్ సూపర్ హిట్ సీక్వెల్ మీదే కెరీర్ ఆధారపడి ఉందా ..?

GRK

Sudigali Sudheer: మళ్లీ రీఎంట్రీ ఇస్తా సుదీర్ కామెంట్స్ కి ఫుల్ హ్యాపీగా ఉన్న ఫ్యాన్స్..!!

sekhar

కొత్త లుక్ లో హీరోయిన్ మెహ్రీన్.. యువకులకు పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ

Ram