నేషనల్ క్రష్ ప్రియా వారియర్, రోషన్ జంటగా నటించిన సినిమా ‘ఒరు అదార్ లవ్’. అదే ఒరు అదార్ లవ్ సినిమాని లవర్స్ డేగా తెలుగులో రిలీజ్ చేశారు. అప్పుడప్పుడే కాలేజీలో చేరిన రోషన్, ప్రియా వారియర్ ప్రేమలో పడుతారు. సరదాగా గడిచిపోతున్న వారి జీవితంలో ఊహించని సంఘటనలు జరగడంతో రోషన్‌కు ప్రియా బ్రేకప్ చెబుతుంది. ఇలాంటి పరిస్థితిలో రోహన్ తన ప్రేమని గెలుచుకోవడానికి చేసిన ప్రయత్నాలేంటి? మళ్లీ ప్రియా, రోషన్ కలిశారా లేదా? చివరకు వీరి కథ ఎలా ముగిసింది అనేదే లవర్స్ డే కథ.
మంచి కాలేజ్ సీన్స్, క్యూట్ లవ్ ఎపిసోడ్ తో సరదాగా సాగిన ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయ్యింది కానీ రెండో భాగం మాత్రం ఊహించని మలుపులతో కొత్త కథ మొదలవుతుంది కానీ అప్పటికే సినిమాని జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మంచి లవ్ స్టోరీకి షాక్ ఇచ్చే ఎండింగ్ ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తెలుగు ప్రేక్షకుల ముందుకి కాలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీస్ కొత్తేమి కాదు కాబట్టి మన వాళ్లని అలరించే పాయింట్ కథలో లేదు. ప్రియా ప్రకాష్ వారియర్ మొదటి సినిమాతోనే తన యాక్టింగ్ క్యాపబిలిటీస్ ని ప్రూవ్ చేసుకుంది. ఫస్ట్ హాఫ్ అంతా తానే అయి సినిమాని ముందుకు తీసుకెళ్లిన ప్రియా ప్రియా ప్రకాష్ మంచి డెబ్యూ అయితే ఇచ్చింది. రోషన్ తన పాత్రకి న్యాయం చేశాడు. మరో మెయిన్ రోల్ ప్లే చేసిన నూరిన్ మంచి మార్కులు కొట్టేసింది. లీడ్ పెయిర్ యాక్టింగ్ తప్ప సినిమాలో బలమైన కథ, సన్నివేశాలు లేకపోవడం లవర్స్ డేకి మైనస్ గా మారింది. కథనం కాస్త వేగంగా సాగినా కూడా బాగుండేదేమో కానీ సాగదీత కథనం ఉండడంతో దర్శకుడు ఒమర్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడా అనిపిస్తుంది.