NewsOrbit
రివ్యూలు

Raja Raja Chora: ‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ

Raja Raja Chora: శ్రీ విష్ణు, మేఘా ఆకాశ్ జంటగా నటించిన ‘రాజ రాజ చోర’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవిబాబు, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, గంగవ్వ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హశిత్ గోలి దర్శకత్వం వహించాడు. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ చేత నిర్మించబడింది. మరి చిత్రం ఎలా ఉందో చూద్దాం…

Raja Raja Chora: కథ

భాస్కర్ (శ్రీ విష్ణు) ఒక జిరాక్స్ షాప్ లో పని చేస్తుంటాడు. అబద్ధాలు చెప్పి విద్య (సునైన) ను పెళ్లి చేసుకోగా అతనికి ఒక కొడుకు పుడతాడు. తనకు అబద్ధం చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు అతనిని కటకటాల వెనక్కి పంపిస్తానని భయపెట్టి అలా చేయకుండా ఉండాలంటే తనను లాయర్ విద్యను చదివించాలని భాస్కర్ ను విద్య బెదిరించి చదువుకుంటూ ఉంటుంది. ఇక భాస్కర్ తన సాఫ్ట్వేర్ ఉద్యోగి అని చెప్పి సంజన (మేఘ ఆకాష్) తో ప్రేమ వ్యవహారం నడిపిస్తుంటాడు. ఆమె కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. భార్య కోసం ప్రేయసి కోసం భాస్కర్ చిన్న చిన్న దొంగతనాలు కూడా చేసేవాడు. ఇలా భాస్కర్ ఒక పెద్ద దొంగతనం చేసి సంజన తో కలిసి వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకుంటాడు. సిఐ విలియం రెడ్డి (రవిబాబు) ఉండే ఏరియా దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అతనిపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అలాగే ప్రమోషన్ కోసం కూడా అతను ఎప్పట్నుంచో ఎదురు చూస్తుంటాడు. ఒక చిన్న దొంగతనం చేస్తూ అప్పుడే భాస్కర్ రెడ్డి కంటి లో భాస్కర్ పడతాడు. విలియం రెడ్డి మరొక తప్పు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. మరి భాస్కర్ రెడ్డి చేసిన తప్పు ఏమిటి భాస్కర్ తన భార్యను వదిలేసి సంజనతో వెళ్ళిపోతాడా? అని తెలియాలంటే సినిమా చూడాలి

Raja Raja Chora: ప్లస్ పాయింట్స్

హీరో శ్రీ విష్ణు పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. మామూలుగానే ఇలాంటి కామెడీ రోల్స్ లో మెరిసే శ్రీ విష్ణు ఈ చిత్రంలో తన పూర్తి స్థాయి నటన బయటకు తీశాడు.

వివేక్ సాగర్ సమకూర్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. సరైన సన్నివేశాలలో మంచి బీట్ ఇచ్చి ప్రేక్షకులకు బోరింగ్ లేకుండా చేశాడు.

సినిమా లోని కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. అలాగే ఇంటర్వెల్ ముందు నుండి ఇంటర్వెల్ వరకూ వచ్చే సన్నివేశాలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి.
మిగతా చిన్న సినిమాలలా కాకుండా ఈ చిత్రం క్లైమాక్స్ ఎంతో బాగుంటుంది. చాలా రోజుల తర్వాత ప్రేక్షకులకు మంచి ఫినిషింగ్ ఉన్న సినిమా చూసాము అన్న ఫీలింగ్ వస్తుంది.

మైనస్ పాయింట్స్

ఈ సినిమా రెండవ అర్ధ భాగం బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. మొదటి అర్ధ భాగం ఎంతో ఆసక్తికరంగా సాగుతుందో… రెండవ అర్ధ భాగంలో బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలు వస్తాయి.ఎడిటింగ్ విషయంలో ఈ సినిమా కొద్దిగా మెరుగుపడాలి. కొన్ని సీన్లు అయితే సమయం నిడివి ఎక్కువ ఉన్నట్లు బాగా సాగదీసినట్లుగా కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి.చిత్రం నిడివి కూడా ఎక్కువే. ఇంత పెద్ద సినిమాకు అతి బలమైన కథాంశం ఇందులో లేకపోగా ఎటువంటి ఎంటర్టైన్మెంట్ సినిమాని ఇంత ఎక్కువ సేపు సాగదీయడం బాగా దెబ్బతీసింది.

విశ్లేషణ

మొత్తానికి చక్కటి మొదటి అర్ధభాగం తో పాటు ఎమోషనల్ రెండవ అర్ధ భాగం కలిసి ‘రాజ రాజ్ చోర’ థియేటర్ వద్ద ఒక యావరేజ్ సినిమాగా నిలిచింది. కొద్ది నవ్వులు, కాస్త ఎమోషన్, మరింత డ్రామాతో ఈ సినిమా హిట్ కొట్టే అవకాశాన్ని రెండవ అర్ధ భాగం దెబ్బతీసింది. అయితే ఓపికగా కూర్చొని సినిమా చూసేవారికి మాత్రం ఈ చిత్రం బాగా నచ్చవచ్చు.చివరి మాట: ‘రాజ రాజ చోర’ – యావరేజు కథ రా….

Related posts

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar