NewsOrbit
రివ్యూలు

ద‌ర్బార్ రివ్యూ & రేటింగ్

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ .. వీరిద్ద‌రికీ త‌మిళ చిత్రంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా సూప‌ర్‌స్టార్ వంటి మాస్ క‌మ‌ర్షియ‌ల్ హీరోకు ఉన్న ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలాంటి హీరోను మురుగ‌దాస్ వంటి డైరెక్ట‌ర్, డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అనే ఆస‌క్తి ఎలా ఉంటుందోన‌ని అంద‌రిలో ఆస‌క్తి పెరిగింది. మంచి హిట్ కొట్టి చాలా కాల‌మైన ర‌జినీకాంత్ ద‌ర్బార్‌తో ఎలాంటి స‌క్సెస్ అందుకున్నాడో తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం…

విడుద‌ల‌: ఎన్‌.వి.ప్ర‌సాద్‌
బ్యాన‌ర్‌: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌
న‌టీన‌టులు: ర‌జినీకాంత్‌, న‌య‌న‌తార‌, సునీల్‌శెట్టి, నివేదా థామ‌స్‌, ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌, యోగిబాబు, ద‌లీప్ తాహిల్‌, న‌బాబ్ షా, తంబిరామ‌య్య‌, శ్రీమాన్ త‌దిత‌రులు
సంగీతం: అనిరుధ్‌
కెమెరా: సంతోశ్ శివ‌న్‌
ఎడిటింగ్‌: శ‌్రీక‌ర్ ప్ర‌సాద్‌
నిర్మాత‌: సుభాస్క‌ర‌న్‌
ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌

క‌థ‌:
విదేశాల్లో ఉండే డాన్ హ‌రి చోప్రా(సునీల్ శెట్టి) దెబ్బ‌కు ముంబైలోని పోలీసులు భ‌య‌ప‌డుతుంటారు. చాలా మంది పోలీసులు ఉద్యోగాల‌కు రాజీనామాలు చేస్తుంటారు. దాంతో ప్ర‌భుత్వం ఆదిత్య అరుణాచ‌లం(ర‌జినీకాంత్‌)ను ముంబై క‌మీష‌న‌ర్‌గా నియ‌మిస్తుంది. ముంబైకి వ‌చ్చిన ఆదిత్య‌…రాగానే డ్ర‌గ్స్ రాకెట్‌, హ్యుమ‌న్ ట్రాఫికింగ్‌ను కంట్రోల్ చేస్తాడు. అంతే కాకుండా వాటికి కార‌ణ‌మైన వ్యాపార‌వేత్త సునీల్ మ‌ల్హోత్రా(న‌వాజ్ షా), కొడుకు అజ‌య్ మ‌ల్హోత్రా(ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌)ను అరెస్ట్ చేసి యావ‌జ్జీవ శిక్ష ప‌డేలా చేస్తాడు. కొడుకుని కాపాడుకోవ‌డానికి సునీల్ ఓ ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్‌ను ఆదిత్య తెలివిగా తిప్పికొడ‌తాడు. అజ‌య్ మ‌ల్హోత్రా చ‌నిపోతాడు. అదే స‌మ‌యంలో హ‌రి చోప్రా ఇండియా వ‌స్తాడు. రాగానే ఆదిత్య‌పై ఎటాక్ చేస్తాడు. ఆ ప్ర‌మాదంలో ఆదిత్య కుమార్తె వ‌ల్లి(నివేదా థామ‌స్‌) చనిపోతుంది. అప్పుడు ఆదిత్య అరుణాచ‌లం ఏం చేస్తాడు? వ‌ల్లి హ‌త్య వెనుక‌గ‌ల కార‌ణ‌మేంటి? హ‌రి చోప్రా ఎవ‌రు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

స‌మీక్ష‌:

స్టార్ల సినిమాలకు మంచి బిల్డప్‌, అంతకు మించిన స్టైలిష్‌ టేకింగ్‌, సూపర్బ్ ఫైట్స్, మనసుకు హత్తుకునే సీన్లు, క్యూట్‌ రొమాన్స్, పంచ్‌ డైలాగులు.. ఇలాంటివన్నీ ఉంటే సినిమా సగం హిట్‌ అయినట్టే. ఇవన్నీ దర్బార్ మూవీలోనూ ఉన్నాయి. సో మురుగదాస్‌ సగం సేఫ్‌ అయినట్టే. మిగిలిన సగం సంగతి ఏంటి? రజనీకాంత్‌ని హీరోగా పెట్టి మురుగదాస్‌ తీసిన దర్బార్‌ కథ కొత్తదేం కాదు. సిల్వర్‌ స్క్రీన్‌ మీద పోలీస్‌ స్టోరీలు మొదలైనప్పటి నుంచీ ఉన్న ఫార్ములానే. ఓ సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌… సమాజానికి ఏదో చేయాలని ప్రయత్నిస్తాడు. అతని సిన్సియారిటీకి కొందరు విలన్లు అడ్డు తగులుతారు. ఫ్యామిలీ మీద దాడి చేస్తారు. దాని ఫలితం ప్రాణ నష్టమో… ఇంకోటో జరిగి తీరుతుంది. ఈ సినిమాలో జరిగింది కూడా అదే. కాకపోతే రజనీకాంత్‌ ఓ దుర్మార్గుడిని శిక్షిస్తే, ఆ దుష్టుడి తండ్రి ఓ దేవతలాంటి అమ్మాయిని పొట్టనపెట్టుకుంటాడు. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. కాకపోతే కూతురికన్నా కాస్త వయసులో పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకునే రజనీ ఆలోచన మాత్రం సౌత్‌ కి కొంత కొత్తగానే ఉంది. టేకింగ్‌, మేకింగ్‌ పరంగా లైకా ప్రొడక్షన్స్ ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు.
పోలీస్ ఆఫీస‌ర్ సినిమాలంటే విల‌న్ ఆగ‌డాల‌కు హీరో ఎలా చెక్ పెడుతూ వ‌చ్చాడు. దానికి విల‌న్ ఏం చేశాడు. చివ‌ర‌కు హీరో ఏం చేశాడు? అనేదే ప్ర‌ధాన క‌థాంశం. ఇలాంటి క‌థ‌లతో చాలా సినిమాలే వ‌చ్చాయి. కానీ సన్నివేశాల‌ను ఎంత గ్రిప్పింగ్‌గా రాసుకున్నార‌నేదే ప్ర‌ధానం. ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్ సన్నివేశాల‌ను ఆడియెన్స్‌కు న‌చ్చేలా రాసుకున్నాడు. ఇక ర‌జ‌నీకాంత్ ఏడు ప‌దుల వ‌య‌సులోనూ ఎన‌ర్జిటిక్‌గా క‌న‌న‌ప‌డుతూ అద్భుతంగా సినిమాను త‌న భుజాల‌పై మోశాడు. ర‌జినీ ఎంట్రీ నుండి ఎండింగ్ వ‌ర‌కు అంద‌రినీ డామినేట్ చేసేశాడు. స‌న్నివేశాలు కూడా అలాగే కుదిరాయి.
యాక్ష‌న్ పార్ట్ విషయానికి వ‌స్తే.. రామ్ ల‌క్ష్మ‌ణ్ అద్భుత‌మైన ఫైట్స్‌ను కంపోజ్ చేశారు. ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్ అయితే సింప్లీ సూప‌ర్బ్‌. అలాగే సెకండాఫ్‌లో వ‌చ్చే రైల్వేస్టేష‌న్ ఫైటింగ్ సీన్ బావున్నాయి.
స‌న్నివేశాల ప‌రంగా న‌వాజ్‌షా, ప్ర‌తీక్ బబ్బ‌ర్‌, ర‌జినీకాంత్ మ‌ధ్య వ‌చ్చే థ్రిల్లింగ్ సీన్స్ కూడా బావున్నాయి. ప్ర‌త్య‌ర్థి ఎత్తుల‌ను చిత్తు చేయ‌డ‌మే కాకుండా.. వారికి నొప్పి క‌లిగేలా ఉండే ర‌జినీకాంత్ డైలాగ్స్, ప్ర‌వ‌ర్త‌న ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాయి.
న‌య‌న‌తార‌, నివేదా థామ‌స్ పాత్ర‌లు ప‌రిమితం. న‌య‌న‌తార కంటే నివేదా థామ‌స్ పాత్ర‌కే వెయిటేజ్ ఎక్కువ‌గా అనిపిస్తుంది. ఆమె కూడా అద్భుతంగా న‌టించింది. ఇక ర‌జినీ, న‌య‌న‌తార మ‌ధ్య వ‌చ్చే ల‌వ్ ట్రాక్‌లోని కామెడీ ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తుంది.
సినిమాలో స‌న్నివేశాల‌కు అనిరుధ్ త‌న బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ప్రాణం పోశాడు. మాస్‌కు, అభిమానుల‌కు క‌నెక్ట్ అయ్యేలా స‌న్నివేశాల రేంజ్‌ను పెంచేలా బీజీఎమ్ ఉంది. సంతోశ్ శివ‌న్ కెమెరా ప‌నిత‌నం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్ వ‌ర్క్ బావుంది. మొత్తంగా చూస్తే సంక్రాంతి పండగకు మంచి బోణీ ఈ మూవీ.

బోట‌మ్ లైన్‌: ద‌ర్బార్‌.. ర‌జినీ వ‌న్ మ్యాన్ షో

రేటింగ్‌: 3/5

 

author avatar
Siva Prasad

Related posts

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar

Leave a Comment