NewsOrbit
రివ్యూలు

`రణరంగం` రివ్యూ& రేటింగ్

బ్యాన‌ర్‌: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
తారాగ‌ణం : శ‌ర్వానంద్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, ముర‌ళీ శ‌ర్మ‌, బ్ర‌హ్మాజీ, సుబ్బ‌రాజు, రాజా, అజ‌య్‌, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ కీల‌క పాత్ర‌ధారులు
మ్యూజిక్‌: ప్ర‌శాంత్ పిళ్లై
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
స్టోరీ-స్క్రీన్‌ప్లే- డైర‌క్ష‌న్‌: సుధీర్ వ‌ర్మ‌
నిర్మాత‌: సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ

హీరోగా కాస్త పేరు రాగానే నాలుగు ఫైట్లు, నాలుగు పాట‌లు, క‌మ‌ర్షియ‌ల్ హంగులు… అనే రొటీన్ ఫార్ములాకు కాస్త దూరంగానే ఉంటారు శ‌ర్వానంద్‌. ఇంటెన్స్ ఉన్న సినిమాలు చేయ‌డానికి ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తాడు. హీరోగా ఎంత ఎలివేట్ కావాల‌నుకుంటాడో, ఆర్టిస్ట్ గా మెప్పించ‌డానికి కూడా అంతే ఉబ‌లాట‌ప‌డ‌తాడు. ఆ క్ర‌మంలో ఆయ‌న కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశారు. తాజాగా 45 ఏళ్ల వ్య‌క్తిగా ఉన్న వయ‌సుక‌న్నా ఎక్కువ వ‌య‌సు పాత్ర‌లో ఆయ‌న న‌టించిన చిత్రం `ర‌ణ‌రంగం`. `స్వామిరారా`తో స‌క్సెస్‌కొట్టిన సుధీర్ వ‌ర్మ గ్యాంగ్‌స్ట‌ర్ చిత్రంగా తెర‌కెక్కించారు. శ‌ర్వానంద్ ప‌క్క‌న కాజ‌ల్‌, క‌ల్యాణి న‌టించ‌డం ఇదే తొలిసారి. అంతా కొత్త కాంబినేష‌న్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఆడియ‌న్స్ కి న‌చ్చుతుందా? గ్యాంగ్‌స్ట‌ర్ పాస‌వుతాడా? జ‌స్ట్ గో థ్రూ…

కథ:
1995…దేవా(శర్వానంద్) అనాథ. వైజాగ్‌లోని ఓ బస్తీలో స్నేహితులతో కలిసి ఉంటుంటాడు. జీవనం కోసం బ్లాక్ టికెట్స్ అమ్ముతుంటాడు. ఓ సందర్భంలో తమ కాలనీలోకి వచ్చిన గీత(కల్యాణి ప్రియదర్శన్)ను చూసి ప్రేమిస్తాడు. అయితే అదే సమయంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. ఆయన సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేస్తారు. దాంతో మదుబాబులు మద్యం కోసం నానా యాతనపడుతుంటారు. అలాంటి వారి కోసం ఒరిస్సా నుండి తెలివిగా మందు తీసుకొచ్చి ఎవరికీ తెలియకుండా అమ్ముతుంటాడు. అయితే అదే వ్యాపారాన్ని చేస్తున్న ఎమ్మెల్యే సింహాచలం(మురళీశర్మ) దేవా స్నేహితులపై దాడి చేయిస్తాడు. అయితే దేవా ఎమ్మెల్యేకు ఎదురు తిరిగి తెలివిగా పెద్ద డాన్‌గా ఎదుగుతాడు. గీతను పెళ్లి చేసుకుంటాడు. అయితే ఎమ్మెల్యే సింహాచలం దేవాను చంపడానికి ప్రణాళిక వేస్తాడు. దాని వల్ల దేవా ఏం కోల్పోతాడు? తన ప్రయాణంలో దేవా ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ:

ఓ సాధారణ యువకుడు మాఫియా డాన్‌గా ఎదిగే క్రమాన్ని `రణరంగం` చిత్రంతో దర్శకుడు సుధీర్ వర్మ ఆవిష్కరించాడు. అయితే మాఫియా బ్యాక్ డ్రాప్‌లో ఇది వరకే చాలా సినిమాలు వచ్చాయి. మరి తన సినిమాలో కొత్తగా ఏదైనా చూపించాడా? అంటే అలాంటి వాటికి ఆస్కారమే కనపడలేదు. ఇప్పటి వరకు పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో వచ్చిన కాన్సెప్ట్‌లను ఆధారంగా చేసుకుని ఈ చిత్ర కథను రాసుకున్నాడు. హీరో గతం, వర్తమానం అనేలా కథను రెండు భాగాలుగా విభజించుకున్నాడు డైరెక్టర్ సుధీర్ వర్మ. ఈ రెండు భాగాలుగా ముందు వెనుకలుగా చూపించకుండా.. సన్నివేశాల అల్లికగా చూపించాడు. అయితే ఈ ప్యాట్రన్‌లో స్క్రీన్ ప్లే సాగడం అనేది కొత్తేమీ కాదు. ఈ తరహా స్క్రీన్ ప్లే సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఇది వరకే చూసేశారు. నేటితరం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కథను తయారు చేసుకున్నట్లు కనపడలేదు. కేవలం మేకింగ్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమా చేసేసి హిట్ అయిపోతుందిలే అని అనుకుంటే ఎలా? హీరో లిక్కర్ మాఫియాలోకి అడుగు పెట్టినప్పుడు పోలీసుల కళ్లు గప్పి మద్యాన్ని తీసుకొచ్చే సన్నివేశాలు నాయకుడు సినిమాను తలపిస్తాయి. అలాగే హీరో, స్నేహితుడి హత్యకు ప్రతీకారం తీర్చుకునే యాక్షన్ పార్ట్ చూస్తే అడవిలో అన్న, బాషా సినిమాలు గుర్తుకు వస్తాయి. ఇక క్లైమాక్స్‌ సీన్ అయితే రంగస్థలం, పైసా వసూల్ చిత్రాల్లోని ట్విస్ట్‌ను ఉపయోగించారు. ఇలాంటి సన్నివేశాలను తెరకెక్కించినప్పుడు సినిమా చూసే ప్రేక్షకుడికి కొత్తదనం ఎక్కడ నుండి కనపడుతుంది. ముఖ్యంగా సెకండాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. నటీనటుల విషయానికి వస్తే పాతికేళ్ల కుర్రాడిగా, 40 ఏళ్ల వ్యక్తిగా వేరియేషన్ చూపిస్తూ చక్కగా నటించాడు శర్వానంద్. అలాగే రెట్రో లుక్‌లో కల్యాణి ప్రియదర్శన్ నటన బావుంది. ఇక కాజల్ అగర్వాల్ నటన గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో నటించింది. సందర్భానుచితంగా వచ్చిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.

చివరగా.. రణరంగం..కొత్త సీసాలోకి పాతనీరు
రేటింగ్: 1.75/5

author avatar
Siva Prasad

Related posts

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Naa Saami Ranga Review: సంక్రాంతికి తగ్గట్టు నాగార్జున.. “నా సామిరంగ” మూవీ రివ్యూ..!!

sekhar

Saindhav Review: విక్టరీ వెంకటేష్ కెరియర్ లో 75వ చిత్రం “సైంధవ్” మూవీ రివ్యూ..!!

sekhar

Guntur Kaaram Review: పుష్కరకాలం తర్వాత త్రివిక్రమ్ మహేష్ కలయికలో వచ్చిన మూవీ.. “గుంటూరు కారం” సినిమా ఫుల్ రివ్యూ..!!

sekhar

Leave a Comment